kittaya Posted February 21, 2019 Report Posted February 21, 2019 స్ఫూర్తిదాయకమైన తన తండ్రి జీవిత చరిత్రని భావి తరాలకి అందించాలనే ఓ గొప్ప సంకల్పానికి పూనుకున్నారు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ. వెండితెరపై విశ్వరూపం ప్రదర్శించిన ‘కథానాయకుడు’గా ఎన్టీఆర్ చరిత్రనీ... తెలుగుజాతి కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటి ‘మహానాయకుడు’ అనిపించుకొన్న ఎన్టీఆర్ సాహసాన్నీ... తెరపై ఆవిష్కరించారు. రెండు భాగాలుగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రాల్లో తండ్రి పాత్రలో నటించడమే కాకుండా... నిర్మాతగా కూడా బాధ్యతల్ని మోశారు బాలకృష్ణ. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాల్లో రెండవదైన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ బుధవారం ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలివీ... ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఎలా ఉండబోతోంది? తొలి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ రెండో భాగానికి ట్రైలర్ లాంటిది. అసలు కథ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’లోనే ఉంటుంది. మేం కమర్షియల్ హీరోలం కాబట్టి, మా నుంచి సినిమా వస్తోందనగానే హీరోయిజం, అందుకు తగ్గ విలన్.. ఆ నేపథ్యంలో డ్రామాని కోరుకుంటారు ప్రేక్షకులు. అవన్నీ రెండో భాగంలో ఉంటాయి. అప్పట్లో నాన్నగారు రాజకీయ జీవితంలో సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఆ కష్టాల్ని ఎలా అధిగమించారనే విషయాలుఈ సినిమాలో ఆసక్తికరంగా సాగుతాయి. ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులకూ నచ్చుతుంది. ‘మొదటి సినిమా ఆడలేదంట. ఆ తర్వాత సినిమాకి తిరుగులేదంట’ అనే మాట‘మహానాయకుడు’ ట్రైలర్లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ సెంటిమెంట్లని ఎంతవరకు నమ్మేవారు? నాన్నగారు అలా కాదు. ప్రతి పనినీ నిర్దుష్టమైన సంకల్పంతో చేసేవారు. అపజయాలకి కుంగిపోవడం, విజయాలకి పొంగిపోవడం ఆయన చరిత్రలోనే లేదు. నాకూ అదే అలవాటైంది. తొలి భాగం కథ మీ అమ్మగారు బసవతారకం కోణంలోనే సాగింది. రెండో భాగంలో కథ ఎక్కడ వరకు ఉంటుంది? అమ్మ శివైక్యం కావడంతో కథ సమాప్తమవుతుంది. అమ్మానాన్నల ప్రయాణమే ప్రధానంగా సాగే చిత్రమిది. ఆ దంపతులు ఒకరికొకరు తోడుగా ఎలా మెలిగారు? ఒకరికొకరు ఎలాంటి సలహాలు ఇచ్చిపుచ్చుకున్నారు? నాన్న తన జీవితంలో ఏయే సందర్భాల్లో ఎవరెవర్ని కలుసుకున్నారు? వాళ్లు ఆయన్ని ఎలా ప్రభావితం చేశారనే విషయాల్ని అమ్మానాన్నల కథతో ముడిపెట్టి చూపించాం. మొదట్నుంచీ ఇది అమ్మానాన్నల కథే అని చెబుతూ వచ్చా. అవడానికి ఎన్టీఆర్ జీవిత చిత్రమే కానీ ఒక కథానాయకుడిగా, నిర్మాతగా ఈ కథ మిమ్మల్ని ఎంతవరకు ప్రభావితం చేసింది? నాన్నగారి ప్రస్థానాన్ని తీసుకుంటే... బాల్యం నుంచి కూడా అడుగడుగునా సవాళ్లని ఎదుర్కొన్నారు. అన్నింటినీ దాటుకుంటూ వచ్చారు. ఆయన జీవితంలో తీసుకొన్న సాహసోపేతమైన నిర్ణయాలు ఎన్టీఆర్ సంకల్ప బలం ఏంటో చాటి చెబుతాయి. ఎంతోమంది పరీక్ష రాస్తే, తక్కువమందికి సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం వచ్చింది. అలాంటి ఉద్యోగాన్ని కూడా వదిలేసుకొని సినిమా రంగంలోకి అడుగుపెట్టడం మామూలు విషయం కాదు. అలాంటి సాహసాలు ఆయన జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి. ఒక కథగా చూస్తే అవన్నీ నాలో స్ఫూర్తిని నింపాయి. ఎన్టీఆర్ పట్టుదల, క్రమశిక్షణ గురించి... ఆయన జీవితం గురించి భావితరాలకితెలియాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాను. ఎన్టీఆర్ లాంటి మనుషులు చాలా అరుదు. ఒక బిడ్డగా, తండ్రి చరిత్రని చెప్పే ప్రయత్నం చేశా. తొలి భాగం చూశాక కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎలా స్పందించారు? వాళ్లందరికీ సినిమా బాగా నచ్చింది. కథ పరంగా కానీ, పాత్రల పరంగా కానీ... ఎంత వరకు తీయాలో అంత వరకు తీశారని మెచ్చుకున్నారు. సినిమాని రెండు భాగాలుగా కాకుండా, ఒక భాగంగా తీసుంటే బాగుండేదేమో అని ఎప్పుడైనా అనిపించిందా? మొదట ఒకటే సినిమా అనుకున్నాం. కానీ కథ పూర్తయ్యాక రెండు భాగాలుగా తీయాలనే ఆలోచన వచ్చింది. కథ పరిధి అంత విస్తృతమైనది. నాన్న ప్రయాణం లార్జర్ దేన్ లైఫ్లాంటిది. ఒక సినిమాతో ఈ కథకి పూర్తిగా న్యాయం చేయలేమని మేమంతా సమష్టిగా నిర్ణయం తీసుకొని రెండు భాగాలు చేశాం. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’తో నష్టపోయిన పంపిణీదారుల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చారు! అది అవసరం. చిత్ర పరిశ్రమలో మా అందరిదీ ఒక కుటుంబం. ఫలితాలు ఎలా వచ్చినా... మా ప్రయాణం కొనసాగాల్సిందే. నాకు కష్టం వచ్చినా అది వాళ్ల కష్టంగా భావిస్తారు, వాళ్లకి కష్టం వచ్చినా అది నా కష్టమే అవుతుంది. అందుకే నష్టపోయిన అందరికీ తగిన రీతిలో న్యాయం చేయాలని నిర్ణయించుకొన్నాం. తొలి సినిమా విడుదల తర్వాత ‘మహానాయకుడు’ కోసం స్క్రిప్టులో మార్పులేమైనా చేశారా? మార్పులంటూ ఏమీ చేయలేదు. మొదట ఏదైతే అనుకొన్నామో అదే తీశాం. మొదట అనుకున్న కథకీ... దర్శకుడు క్రిష్ వచ్చాక సిద్ధమైన కథలోనూ మార్పులేమైనా జరిగాయా? క్రిష్ వచ్చాకే అసలు స్క్రిప్టుని మొదలు పెట్టాం. అంతకు ముందు సిద్ధమైన కథ చాలా తక్కువ. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో రకరకాల గెటప్పుల్లో కనిపించారు. మరి ‘మహానాయకుడు’లో మీకు సవాల్‌గా అనిపించిన సందర్భం ఏది? ఇందులో గెటప్పులంటూ ఏమీ ఉండవు. నాన్నగారిలా కనిపించే వ 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.