Kool_SRG Posted February 21, 2019 Author Report Posted February 21, 2019 టీడీపీ దూకుడు.. ఆ ఐదుగురు అభ్యర్థులు ఫైనల్..! రాజంపేట లోక్‌సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్ష. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చ. ఐదు స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులపై దాదాపు స్పష్టతకు వచ్చిన టీడీపీ అధినేత. గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు నియోజకవర్గాలవారీగా బలాబలాలపై చర్చ ఇబ్బందులు లేనిచోట్ల అభ్యర్థులు ఫైనల్ ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది టీడీపీ. మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసిన దూకుడు పెంచిన చంద్రబాబు.. ఇక గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టారు. జిల్లాలు, నియోజకవర్గాలవారీగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశారు. గురువారం రాజంపేట లోక్‌సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాలవారీగా అభ్యర్థుల బలాబలాను బేరీజు వేశారు. నేతల అభిప్రాయాలను సేకరించిన టీడీపీ అధినేత.. ఐదు నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థులపై స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజంపేట లోక్‌సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. అభ్యర్థుల విషయానికొస్తే.. చిత్తూరు జిల్లాలో.. పీలేరు - నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు).. పుంగనూరు - అనూషా రెడ్డి (మంత్రి అమర్నాథ్ రెడ్డి బంధువు)లు బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. మదనపల్లె, తంబళ్లపల్లి నియోజకవర్గాల అభ్యర్థిల ఎంపికపై కసరత్తు కొనసాగుతోందట. ఇక కడప జిల్లాలో అభ్యర్థుల విషయానికొస్తే .. రాజంపేట - చెంగల్రాయుడు (మాజీ ఎమ్మెల్సీ) రాయచోటి - రమేష్‌కుమార్ రెడ్డి (టీడీపీ నేత) రైల్వే కోడూరు - నరసింహ ప్రసాద్ (చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అల్లుడు)లు ఉన్నారట. ఈ ఆరుగురు అభ్యర్థుల్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. టికెట్ల విషయంలో అసంతృప్తికి గురైన నేతలకు సీఎం నచ్చజెప్పారట. రాబోయే రోజుల్లో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారట. Quote
Kool_SRG Posted February 21, 2019 Author Report Posted February 21, 2019 జగన్ ఇలాకానే టిడిపి తొలి లక్ష్యం : కడప - రాజంపేట లోక్‌సభ పరిధిలో టిడిపి అభ్యర్దులు వీరే..! వైసిపి అధినేత జగన్ సొంత జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురి పెట్టారు. అందులో భాగంగా కడప జిల్లాలోని కడప..రాజంపేట లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్దులను ముఖ్యమంత్రి ఖరారు చేసార. ఈ రెండు లోక్‌సభ పరిధి లో ఏడు అసెంబ్లీ అభ్యర్దులను అధికారికంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. కడప పార్లమెంటరీ పరిధిలో.. కడప పార్లమెంట్ సీటు కోసం మంత్రి ఆదినారాయణ రెడ్డిన టిడిపి అధికారికంగా ప్రకటించింది. ఆయన ఇప్పటికే పులివెందుల నుండి ప్రచారం ప్రారంభించారు. ఇదే పార్లమెంట్ పరిధిలోని జమ్మలమడుగు నుండి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిని టిడిపి అభ్యర్దిగా ఖరారు చేసారు. ఇక, జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల బరిలో మాజీ ఎమ్మె ల్సీ సతీష్ రెడ్డిని ఇప్పటికే అధినేత ప్రకటించారు. ఇక, కడప సిటీలో మాజీ మంత్రి అహ్మదుల్లా కుమారుడు ఆఫాఫ్ ను ఖరారు చేసారు. ఇక, బద్వేల్ నుండి లాజర్ అభ్యర్దిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కమలాపురం నియోజకవర్గంలో వీర శివారెడ్డి..పుత్తా వర్గాల మధ్య టిక్కెట్ పంచాయితీ నడుస్తోం ది. దీని పై ముఖ్యమంత్రి ఇప్పటికే వీర శివారెడ్డికి అనుకూలంగా సంకేతాలిచ్చారు. ప్రొద్దుటూరు లో వరదరాజలు రెడ్డి పేరు రేసులో మొదటి స్థానంలో ఉంది. మైదుకూరు పంచాయితీ కొనసాగుతోంది. రాజంపేట పార్లమెంటరీ పరిదిలో.. రాజంపేట లోక్‌సభ టిడిపి సీటు మాజీ మంత్రి సాయి ప్రతాప్ కు ఇచ్చే అవకాశం ఉంది. రాజంపేట పార్లమెంటరీ పరిధిలోని రాజంపేట అసెంబ్లీకి టిడిపి నుండి చెంగలరాయుడు పేరును చంద్రబాబు ఖ రారు చేసారు. రాయచోటి నుండి రమేష్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. రైల్వే కోడూరు నుండి టిడిపి అభ్యర్దిగా నరసింహ ప్రసాద్ పేరును సీయం ప్రకటించారు. తంబళ్లపల్లె లో టిడిపి అధికారికంగా అభ్యర్దిని ప్రకటించలేదు. ఇక్కడ టిడిపి కి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా..ప్రకటన పెండింగ్‌లో పెట్టారు. పీలేరు లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. పుంగనూరు నుండి అనూషరెడ్డి పేరును ముఖ్యమంత్రి ఖరారు చేసారు. ఇక్క డి నుండి వైసిపి సీనియర నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి బరిలో నిలుస్తున్నారు. మదనపల్లె అభ్యర్ది ఖరారు అంశా న్ని సీయం పెండింగ్‌లో పెట్టారు. తేలని మైదుకూరు పంచాయితీ.. మైదుకూరు నుండి మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపి సీటు ఆశిస్తున్నారు. ఆయన బుధవారం రాత్రి పొద్దు పోయిన తరువాత ముఖ్యమంత్రి తో సమావేశమయ్యారు. తాను టిడిపిలో చేరటానికి సిద్దంగా ఉన్నానని..అయితే , తనకు సీటు ఇస్తేనే పార్టీలో చేరుతానని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఈ రోజు ఉదయం సీయం ను కలిసిన మంత్రి యనమల మైదుకూరు సీటు ప్రస్తుత టిటిడి ఛైర్మన్ పుత్తా సుధాకర్ యాదవ్ కు ఇవ్వాలని కోరారు. సీయం సైతం ఈ సీటు పై అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. అయితే, సుధాకర్ యాదవ్ మాత్రం డిఎల్ పార్టీలో చేరలేదని ..మైదుకూరు నుండి తానే పోటీ చేస్తున్నానంటూ చెబుతున్నారు. దీని పై ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుందామంటూ ముఖ్యమంత్రి చెబుతున్నట్లు తెలిసింది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.