WigsandThighs Posted February 27, 2019 Report Posted February 27, 2019 Businessman producer anta..MB is no less than Nag Quote
JANASENA Posted February 27, 2019 Author Report Posted February 27, 2019 హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నిర్మాతగా ఓ చిత్రం రాబోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా ఘట్టమనేని మహేశ్‌బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ సంస్థలు సంయుక్తంగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాయి. ఈ చిత్రానికి ‘మేజర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటించనున్నారు. ఈ విషయాన్ని మహేశ్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడిస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. మేజర్ ఉన్నికృష్ణన్ గెటప్‌లో అడివి శేష్ లుక్ ఆకట్టుకుంటోంది. తెలుగు, హిందీ భాషాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. శశి కిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అడివి శేష్ నటించిన ‘గూఢచారి’ సినిమాకు కూడా శశి కిరణే దర్శకత్వం వహించారు. పలువురు టాలీవుడ్ ఆర్టిస్ట్‌లు ఈ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారని అడివి శేష్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘నా దగ్గర ‘మేజర్’ న్యూస్ ఉందని మీకు ముందే చెప్పా. ఈ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పడానికి కొన్ని కారణాలున్నాయి. ఒకటి.. ఇది మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కుతోంది. రెండు.. ఆయన 26/11 దాడులు జరిగినప్పుడు ప్రజలను కాపాడేందుకు కీలక పాత్ర పోషించారు. మూడు.. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నాలుగు.. సోనీ పిక్చర్స్ ఇండియా సంస్థ సమర్పిస్తోంది. ఐదు.. ఈ సినిమా మమ్మల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లబోతోంది’ అంటూ హర్షం వ్యక్తం చేశారు అడివి శేష్. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.