KrishnaDevaRaya Posted March 1, 2019 Report Posted March 1, 2019 భారతీయ మీడియాకు పాకిస్థాన్ 'థాంక్స్' అది.... పాకిస్థాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్. వాతావరణం గంభీరంగా ఉంది. భారతీయ వింగ్ కమాండర్ ను పాక్ మిలిటరీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అప్పటికే భారత్, పాక్ సరిహద్దులో యుధ్ధ మేఘాలు కమ్ముకున్నందున వాతావరణం చాలా వేడిగా ఉంది. పైగా, పాక్ భూభాగంలో కూలిపోయిన విమానం నుంచి పారాచూట్ సహాయంతో ప్రాణాలతో బయటపడిన వింగ్ కమాండర్... తన దగ్గర రహస్యాలు శత్రు దేశం చేతికి చిక్కకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. కొన్ని కీలక పత్రాలు మింగేసి... కొన్ని దగ్గర్లోని నీళ్లలో నాన్చేచి పిప్పి పిప్పి చేశారు. ఇంటరాగేషన్ కు రంగం సిద్ధమయ్యింది. పాక్ ఆర్మీ అధికారి: నీ పేరేమిటి? భారత వింగ్ కమాండర్: అభినందన్ పాక్ ఆర్మీ అధికారి: మీది ఏ ప్రాంతం? భారత వింగ్ కమాండర్: డౌన్ సౌత్ పాక్ ఆర్మీ అధికారి: అంటే ఎక్కడ? మీ కుటుంబ వివరాలు చెప్పండి? భారత వింగ్ కమాండర్: నేను ఆ వివరాలు అందించలేను. (ఇంతలో ఒక సైనిక అధికారి పక్క రూంలోకి వెళ్లి వచ్చి... ఇంటరాగేట్ చేస్తున్న ఆర్మీ అధికారి చెవిలో ఏదో చెప్పాడు) పాక్ ఆర్మీ అధికారి: మిస్టర్ వర్ధమాన్ అభినందన్. మీది తమిళనాడు. మీ తాత, నాన్న, భార్య అంతా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు. మీ పితాజీ రిటైర్డ్ ఎయిర్ మార్షల్.... హ్హ హ్హ హ్హా.... (పేర్లతో సహా తమ వాళ్ళ గురించి పాక్ అధికారి చెప్పేసరికి ఆశ్చర్య పోవడం అభినందన్ వంతయ్యింది.) పాక్ ఆర్మీ అధికారి: మీరు నడుపుతున్న విమానం ఏమిటి? భారత వింగ్ కమాండర్: సారీ, ఐ కెన్ నాట్ టెల్ యూ... ఐ యామ్ నాట్ సపోజ్డ్ టు టెల్ యు. (ఇంతలోఇందాక పక్క రూంలోకి వెళ్లి వచ్చిన ఆయనే మరో సారి ఇప్పుడే వస్తానని బైటికి వెళ్లి వచ్చి... ఇంటరాగేట్ చేస్తున్న ఆర్మీ అధికారి చెవిలో ఏదో చెప్పాడు) పాక్ ఆర్మీ అధికారి: హ్హ హ్హ హ్హా.... మిగ్ 21 బైసన్ కదా... హై నా... హ్హ హ్హ హ్హా.... (కాలిపోయినకాఫ్టర్ గురించి తాను చెప్పకపోయినా వాళ్ళకు తెలిసేసరికి ఆశ్చర్య పోవడం అభినందన్ వంతయ్యింది.) ఇట్లా ఆ పాకిస్థాన్ ఆర్మీ అధికారి అడగడం, భారతీయ వింగ్ కమాండర్ ప్రాణం పోయినా చెప్పానని మొండికేయడం, పక్క రూంలోకి వెళ్లి వస్తున్న అధికారి అన్ని వివరాలతో రావడం, ఇంటరాగేట్ చేస్తున్న అధికారి... హ్హా హ్హ హ్హా అని విజయోత్సాహంతో నవ్వుతూ వివరాలు వెల్లడించడం తేలిగ్గా జరిగిపోయాయి. ఇంతకూ పక్కరూం లో ఏముందో తెలుసా? పది భారతీయ టెలివిజన్ ఛానెల్స్ ఆన్ చేసి ఉన్నాయి. అన్నీ లైవ్ లో పోటాపోటీగా అభినందన్ వివరాలు పొల్లుపోకుండా చెబుతున్నాయ్!!! మేరా మీడియా మహాన్.....సారీ అభినందన్ Quote
KrishnaDevaRaya Posted March 1, 2019 Author Report Posted March 1, 2019 this is our Indian media. Quote
Ara_Tenkai Posted March 1, 2019 Report Posted March 1, 2019 dont you think ... aa silly details telusukodaniki media channels avasaram undantava??? RAW IB lanti vallaki enthasepu ivi telusukovadam... vellu mari chestaru... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.