Jump to content

Recommended Posts

Posted
3 minutes ago, Ram30 said:

 

Ma Nakka ki and Pachha Midea AtT Care antunna slaves

Posted

పథకాల విషయంలో, సంక్షేమ కార్యక్రమాల విషయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, చంద్రబాబుకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. నిజానికి వీళ్లిద్దరి మధ్యపోలిక అనవసరం. అలాచేస్తే అది వైఎస్ ను కించపరిచనట్టే. అయితే ఒక్క విషయంలో మాత్రం వీళ్లిద్దరి మధ్య తేడాను స్పష్టంగా చెప్పారు నటుడు మోహన్ బాబు. ఫీజు రీఇంబర్స్ మెంట్ విషయంలో వైఎస్ఆర్ ఎంత నిక్కచ్చిగా ఉన్నారు, చంద్రబాబు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో కళ్లకు కట్టినట్టు వివరించారు.

"ఓ మంచి పని చేయాలని ఫీజు రీఇంబర్స్ మెంట్ పథకం పెట్టారు వైఎస్ఆర్. తర్వాతొచ్చిన ఓ ముఖ్యమంత్రి ఆ స్కీమ్ ను అలానే కొనసాగించారు. పిల్లలు బాగా చదువుకొని గొప్పవాళ్లు అవుతున్నారు. చంద్రబాబంటే నాకు ఇష్టం. మేమిద్దరం సన్నిహితులు. నా కాలేజీ పునాది టైమ్ నుంచి ఎన్నో సందర్భాల్లో వచ్చాడు. అన్నా.. నీ కాలేజ్ నంబర్ వన్ అని ఎన్నోసార్లు చెప్పాడు.  కానీ ఫీజు రీఇంబర్స్ మెంట్ దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు మారిపోయాడు. నాలుగేళ్ల నుంచి ఫీజు ఇంబర్స్ మెంట్ అనుకున్న టైమ్ కు ఇవ్వట్లేదు. అప్పుడప్పుడు బిక్షం వేస్తున్నట్టు ఇస్తున్నాడు."

ఇలా ఫీజు రీయింబర్స్ మెంట్ పై చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు మోహన్ బాబు. తన కాలేజ్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పేద పిల్లల భవిష్యత్తును చంద్రబాబు అంధకారంలోకి నెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబును రాజకీయాలు చేసుకోమన్న మోహన్ బాబు, దయచేసి పిల్లలతో రాజకీయాలొద్దని సూచించారు.

"గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 2 కోట్ల 16 లక్షల రూపాయల్ని ఇవ్వాలి. ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు 16 కోట్లు ఇవ్వాలి. మొత్తం 18 కోట్లు. ఎక్కడా రీఇంబర్స్ మెంట్ లేదు. ఇస్తామంటే ఇస్తామని చెప్పండి. లేదంటే లేదని చెప్పండి. పేద విద్యార్థుల్ని ఎందుకు మీ రాజకీయాలకు బలిచేస్తారు. కాలేజీల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు?"

ఇదే విషయంపై 6 నెలలుగా చంద్రబాబుకు లేఖలు రాస్తుంటే సమాధానం ఇవ్వడం లేదన్నారు మోహన్ బాబు. తను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, పిల్లల తరఫున ఓ సామాన్య వ్యక్తిగా చంద్రబాబును ప్రశ్నిస్తున్నానని తెలిపిన మోహన్ బాబు.. రాజకీయాల కోసం ఫీజు రీఇంబర్స్ మెంట్ లాంటి మంచి పథకాన్ని నీరుగార్చారని ఆరోపించారు.

"నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. ఓ వ్యక్తిగా చంద్రబాబును అడుగుతున్నాను. బయట నువ్వు ఎన్ని వాగ్దానాలు ఇచ్చావన్నది నాకు ముఖ్యంకాదు. నాకు సంబంధంలేదు. నా పిల్లలకు (విద్యార్థులకు) ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. 5-6 నెలల నుంచి ఉత్తరాలు రాస్తున్నాను. ఫలితంలేదు. విద్యార్థులు గొప్పవాళ్లు కావాలని ప్రసంగాలు ఇస్తావు, కానీ వాళ్లకు ఇవ్వాల్సిన ఫీజులు ఇవ్వవు. ఇదేనా నీ రాజకీయం."

చివరికి 3 నెలలకు ఒకసారి ఇస్తానని చెప్పిన బాబు, ఆ పని కూడా చేయలేదన్నారు మోహన్ బాబు. తన సొంత ఆస్తుల్ని ఆంధ్రా బ్యాంక్ లో తాకట్టుపెట్టి ఆ డబ్బుతో జీతాలు ఇస్తున్నానని.. మిగతా కాలేజీలు, అక్కడ చదువుతున్న పిల్లల భవిష్యత్ ను తలుచుకుంటే కడుపు తరుక్కుపోతోందన్నారు మోహన్ బాబు.

Posted
36 minutes ago, Aakupaccha_caradu said:

 

Meenakshi Sheshadri ni Pelli cheskomani force chesadata peddayana nijamenaa??

Posted

polavaram ki , capital ki money slow gaa installments lo isthundi ani center meeda edusthadu CBN

state lo loan waivers , fee waivers ki malli chesedi matram late installments ee. 

Posted
2 minutes ago, snoww said:

polavaram ki , capital ki money slow gaa installments lo isthundi ani center meeda edusthadu CBN

state lo loan waivers , fee waivers ki malli chesedi matram late installments ee. 

Elections khazana money kavali ga nakka sir ki 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...