Chinna84 Posted March 3, 2019 Report Posted March 3, 2019 భద్రతా బలగాల కనీస అవసరాలను తీర్చడంలో గత ప్రభుత్వాలు తీవ్రంగా విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దిల్లీలో జరిగిన ‘ఇండియా టుడే’ కాంక్లేవ్‌లో శనివారం మాట్లాడిన ఆయన విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘భద్రతా బలగాలకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అవసరమన్నది ప్రతి ఒక్కిరికీ తెలిసిన విషయం. 2009లో బలగాలు 1,86,000 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అవసరమని ప్రతిపాదనలు పంపాయి. కానీ 2009 నుంచి 2014 మధ్య కనీసం ఒక్క బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా ఇవ్వలేదు’’ అని మోదీ ఆరోపించారు. ఎన్డీయే హయాంలో ఇప్పటి వరకు 2.3లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇచ్చామన్నారు. రక్షణ శాఖ కొనుగోళ్లలో మధ్యవర్తులకు అవకాశం ఇవ్వలేదన్నారు. రక్షణ రంగంలో అవినీతికి ఆస్కారం లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వాలు ఒప్పందాలు, ముడుపులపైనే ఆసక్తి చూపాయని ఆరోపించారు. బాలాకోట్‌లో జరిపిన దాడులపై ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమన్నారు. పాక్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన వింగ్ కమాండర్ అభినందన్ గురించి ప్రస్తావిస్తూ.. అభినందన్ అనే పేరుకు అర్థమే మారిపోయిందన్నారు. భారత్ సత్తాకు ఇప్పుడు అభినందన్ ఓ నిదర్శనమన్నారు. Quote
kittaya Posted March 3, 2019 Report Posted March 3, 2019 Madyalo brokers lekunda chesam Anna daggara Contraversy create cheyocha ledha Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.