snoww Posted March 6, 2019 Report Posted March 6, 2019 పాడిపంటల తెలంగాణ పాలు, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వృద్ధి సన్నబియ్యం విత్తనాలకు తమిళనాడు కితాబు విద్యుదుత్పత్తిలో ఒరవడి రెండు, మూడు స్థానాల్లో సింగరేణి, జెన్‌కో తెలంగాణలో పాడి పంటలు బాగున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆహారపంటల సాగు, మాంసం, పాల ఉత్పత్తిలో రాష్ట్రం మంచి వృద్ధి సాధిస్తోంది. వ్యవసాయపరంగా పురోగమిస్తోంది. పత్తి, చెరకుల్లో మినహాయించి మిగిలిన అన్ని విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. - రిజర్వ్‌బ్యాంకు తాజా గణాంకాలు తెలంగాణ రైతులు పండించే సాంబమసూరి (బీపీటీ-5204 సన్నరకం) విత్తనాలు నాణ్యంగా ఉన్నాయి. వచ్చే ఖరీఫ్ సీజన్‌లో 30 వేల క్వింటాళ్ల సాంబ మసూరి వరి విత్తనాలివ్వండి. - తమిళనాడు వ్యవసాయశాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో ఒడిశా ప్రభుత్వ విద్యుదుత్పత్తి సంస్థ(ఓపీజీసీ) 83.93 శాతం ఉత్పత్తితో అగ్రస్థానంలో ఉండగా సింగరేణి 80.22 శాతంతో రెండో స్థానంలో.. తెలంగాణ జెన్‌కో 77.28 శాతంతో మూడో స్థానంలో ఉంది. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉన్న ఎస్టీపీపీ గడచిన ఆరునెలల్లో రెండు సార్లు వందశాతం పీఎల్‌ఎఫ్ సాధించింది. దేశవ్యాప్తంగా ఇలా సాధిస్తున్న కేంద్రాలు చాలా తక్కువ. ఆహారధాన్యాలు, మాంసం, పాల ఉత్పత్తిలో మంచి వృద్ధి తెలంగాణలో పాడి పంటలు బాగున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆహారపంటల సాగు, మాంసం, పాల ఉత్పత్తిలో రాష్ట్రం మంచి పురోగతి సాధిస్తోంది. రిజర్వ్‌బ్యాంకు తాజాగా విడుదల చేసిన రాష్ట్రాల గణాంకాల ప్రకారం తెలంగాణ వ్యవసాయపరంగా పురోగమిస్తోంది. పత్తి, చెరకుల్లో మినహాయించి మిగిలిన అన్ని విషయాల్లో సానుకూల పరిస్థితులనే కనబరుస్తోంది. మాంసం ఉత్పత్తి ఏటా పెరుగుతోంది. 2015-16లో 5.42 లక్షల టన్నులుండగా 2017-18 నాటికి 6.45 లక్షల టన్నులకు చేరింది. పాల ఉత్పత్తికూడా పెరుగుతోంది. 2015-16లో 44.42 లక్షల టన్నులు ఉండగా 2017-18 నాటికి 49.65 లక్షల టన్నులకు పెరిగింది. * 2015-16లో 51.29 లక్షల టన్నులకు తగ్గినప్పటికీ మరుసటి ఏడాదిలో ఉత్పత్తి గణనీయంగా పెంచుకొని మంచి స్థితికి చేరింది. మూడేళ్లలో దాదాపు 26%మేర ఆహారధాన్యాల సాగువిస్తీర్ణం పెరిగింది. * సగటు ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు కనిపించాయి. 2014-15లో హెక్టారుకు సగటున 2,723 కేజీల దిగుబడి రాగా ఆ తర్వాతి సంవత్సరాల్లో అది 2,353, 2,576 కేజీలకు చేరింది. * సగటు దిగుబడి విషయంలో తెలంగాణ.. పంజాబ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి తర్వాతి స్థానంలో నిలిచింది. 2014-15లో సగటున ఎకరాకు 3,138 కేజీలు రాగా 2015-16లో 2,913కి తగ్గింది. 2016-17లో 3,075 కేజీలకు పెరిగింది. * నూనెగింజల ఉత్పత్తి 2014-15లో 6.30 లక్షల టన్నుల నుంచి 2016-17కి 7.23 లక్షల టన్నులకు చేరింది. సగటు దిగుబడి కూడా బాగా నమోదైంది. 2016-17లో ఆంధ్రప్రదేశ్‌లో హెక్టారుకు సగటున 581 కేజీల నూనెగింజలు దిగుబడి రాగా తెలంగాణలో మాత్రం అంతకు రెట్టింపుగా 1,385 కేజీల దిగుబడి వచ్చింది. * చెరకు సాగు విస్తీర్ణం 38వేల హెక్టార్ల నుంచి 29 వేల హెక్టార్లకు తగ్గింది. దిగుబడి కూడా 33.43 లక్షల టన్నుల నుంచి 20.61 లక్షల టన్నులకు చేరింది. హెక్టారు సగటు దిగుబడి మాత్రం గత మూడేళ్లలో పెరిగింది. 2014-15లో 377 కేజీల ఉత్పత్తిరాగా 2016-17 నాటికి 416 కేజీలకు పెరిగింది. 2 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.