maidhanam1 Posted March 6, 2019 Report Posted March 6, 2019 ఏపీ డీజీపీ ఇంట్లో ఆక్రమణల కూల్చివేత హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఇంట్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఖైరతాబాద్ జోన్ అధికారులు మంగళవారం కూల్చివేశారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు మహానగరంలో అక్రమ నిర్మాణాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గత పది రోజులుగా పలు అక్రమ నిర్మాణాలను బల్దియా అధికారులు కూల్చివేశారు. అందులో భాగంగా ఏపీ డీజీపీ ఇంటి ఆక్రమణలను తొలగించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నివాసముండే జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లోని 149 నంబరు ప్లాటుకు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ యజమాని. అక్కడ జీ+1కు అనుమతి తీసుకుని మూడు అంతస్తుల్లో ఇంటిని నిర్మించారు. అనంతరం అదనపు అంతస్తులను క్రమబద్ధీకరించుకున్నారు. దక్షిణ, తూర్పు భాగాల్లోని సెట్‌బ్యాక్ స్థలంలో మెట్ల నిర్మాణం చేపట్టారు. వీటివల్ల పక్కనే ఉన్న పార్కులో కొంత స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ విషయమై జూన్ 4, 2017లో జీహెచ్‌ఎంసీకి ప్రశాసన్‌నగర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఫిర్యాదు చేసిందని, ఇంటి యజమానికి రెండుసార్లు నోటీసులిచ్చామని వివరించారు. యజమాని కోర్టును ఆశ్రయించారని, కానీ న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను కొట్టివేసిందని బల్దియా పేర్కొంది. మళ్లీ ఫిర్యాదు రావడంతో సెక్షన్-452ను అనుసరించి 24 గంటల్లో ఆ నిర్మాణాలను కూల్చేస్తామంటూ మార్చి 2న నోటీసు జారీ చేసినట్లు జోనల్ అధికారులు ‘ఈనాడు’కు వివరించారు. మంగళవారం పార్కులో చేపట్టిన నిర్మాణాలను స్వల్పంగా కూల్చేశామని పేర్కొన్నారు. Quote
kranthi111983 Posted March 6, 2019 Report Posted March 6, 2019 I think monna AP police lu aa data theft vishayam lo Hyderabad lo chesina over action, illegal la vachi oka Hyderabad resident intilo dadagiri chesina daniki message anukunta.... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.