Yaman02 Posted March 7, 2019 Report Posted March 7, 2019 చిన్నారులకు అధిక డోస్ ఇచ్చారు: నీలోఫర్ హైదరాబాద్: నిన్న నాంపల్లి ఆసుపత్రిలో టీకాలు ఇచ్చిన తర్వాత మాత్రల్లో పొరపాటు జరిగిందని నీలోఫర్ సూపరింటెండెంట్ తెలిపారు. పిల్లలకు పారాసిటమాల్‌కు బదులు ట్రెమడాల్ మాత్రలు ఇచ్చారన్నారు. పిల్లలకు నొప్పి నివారణ ఔషధం డోస్ ఎక్కువ కావడంతో అస్వస్థతకు గురయ్యారని వివరించారు. మొత్తం 22 మంది ఆస్పత్రిలో చేరగా ఒకరు మృతి చెందినట్లు పేర్కొన్నారు. వీరిలో ముగ్గురికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. నాంపల్లి అర్బన్ హెల్త్ కేర్ సెంటర్‌లో టీకాలు వికటించిన ఘటనలో ఐదు నెలల చిన్నారి మృతిచెందగా.. మరో 21 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రస్తుతం నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారికి వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ****** ఖమ్మం ఆస్పత్రిలో వ్యక్తి అనుమానాస్పద మృతి ఖమ్మం (వైద్య విభాగం): తాను చనిపోతానని తెలియని ఓ ఆటో డ్రైవర్ ఖమ్మం నగరానికి వచ్చి విగత జీవిగా మారాడు. ఇంటి నుంచి బయలుదేరిన క్షణం నుంచి తండ్రి వెంటే ఉన్న కుమారుడు తండ్రి చనిపోయాడని తెలిసి దిక్కుతోచని పరిస్థితుల్లో కన్నీటి పర్యంతమవుతుంటే ఈ హృదయ విదారక దృశ్యం అక్కడున్న వారిని కలచివేసింది. ఖమ్మం నగరంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా కురివి మండలం గుండ్రాతిమడుగు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఆబోతు కృష్ణ(47) గురువారం ఉదయం ఇంటి నుంచి తన ఆటోలో తనయుడు అఖిల్‌ను వెంట బెట్టుకుని ఖమ్మం వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో గాంధీ చౌక్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వెన్ను నొప్పి సమస్య ఉందని వైద్యుడిని సంప్రదించాడు. పరీక్షించిన వైద్యుడు మందులు రాసిచ్చి మూడు రోజుల పాటు ఇంజక్షన్లు వాడాలని సూచించారు. ఆస్పత్రి సిబ్బంది ఇంజక్షన్ ఇస్తున్న తరుణంలో.. కృష్ణ నోటి నుంచి నురగలు వచ్చాయి. వాంతులు కూడా అయ్యాయి. పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే ఆటోలో అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందాడని ధ్రువీకరించారు. తండ్రిలేడని చెప్పగానే అఖిల్ బోరున విలపించాడు. కనీసం కుటుంబానికి సమాచారం ఇచ్చేందుకు ఫోన్ కూడా లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరుగా విలపించాడు. బాలుడు పడిన వేదన చూసి అక్కడున్న వారు సైతం కంట నీరు పెట్టారు. ఇంజక్షన్ వికటించిందా.. మృతుడు మరణించిన క్రమం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. కృష్ణకు చికిత్స అనంతరం ఫిట్స్ వచ్చిందని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. ఫిట్స్ ఉన్న వ్యక్తి గుండ్రాతిమడుగు గ్రామం నుంచి ఆటో నడుపుకొంటూ ఖమ్మం వరకు ఎలా వచ్చాడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంజక్షన్ ఇస్తున్న సమయంలో కృష్ణ నోటి నుంచి నురగలు వచ్చాయని మృతుడి కుమారుడు చెప్పాడు. అతను అపస్మారక స్థితిలోకి వెళ్తున్నాడని గ్రహించిన ఆసుపత్రి సిబ్బంది హుటాహుటీన ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరణించిన విషయం గ్రహించే కుమారుడికి చెప్పకుండా ప్రభుత్వాసుపత్రికి తరలించి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంజక్షన్ వికటించడంతోనే కృష్ణ మృతిచెంది ఉంటాడనే ఆరోపణలపై ఆసుపత్రి వైద్యులను వివరణ కోరగా.. మృతిచెందిన కృష్ణ గత 12 ఏళ్లుగా చికిత్స కోసం తమ ఆసుపత్రికి వస్తున్నాడని, అతనికి ఊపిరితిత్తుల సమస్యతో పాటు ఇతర సమస్యలు ఉన్నాయన్నారు. ఫిట్స్ రావడంతో మెరుగైన వైద్యం కోసం.. అందులోనూ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని తమ సిబ్బందినిచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి పంపామన్నారు. వైద్య సేవల్లో ఎలాంటి లోపం లేదని వారు పేర్కొన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.