snoww Posted March 8, 2019 Report Posted March 8, 2019 సేవామిత్రలో తెలంగాణ డేటా ఎలా వచ్చిందో తేల్చాలి సిట్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర అశోక్ ఎక్కడున్నా వదలం ఈనాడు, హైదరాబాద్: సమాచార చౌర్యానికి సంబంధించి సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన ఐటీ గ్రిడ్స్ సంస్థ వద్ద తెలంగాణ రాష్ట్ర పౌరులకు సంబంధించిన వ్యక్తిగత డేటా కూడా ఉందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధిపతి, పశ్చిమ మండలం ఐజీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతున్న డేటా చౌర్యానికి సంబంధించిన కేసులు దర్యాప్తు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేసు పూర్వాపరాలు వివరించేందుకు గురువారం డీజీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో సిట్ అధిపతి మాట్లాడారు. డేటా చౌర్యానికి సంబంధించి ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్ సంస్థలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయని, గురువారం నుంచి వీటిని తాము దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించి డేటా ఉంటే తెలంగాణ పోలీసులు ఎలా దర్యాప్తు చేస్తారని తెదేపా నాయకులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు రవీంద్ర దృష్టికి తీసుకొని రాగా, ఐటీ గ్రిడ్స్ సంస్థ నిర్వహిస్తున్న సేవామిత్ర యాప్‌లో తెలంగాణ పౌరుల వ్యక్తిగత సమాచారం కూడా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైందని, ఈ సమాచారం వీరికి ఎలా వచ్చింది, దాంతో ఏం చేశారన్న దానిపైనా ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా ఎవరికైనా నోటీసులిస్తారా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ దోషులు ఎంత పెద్దవారయినా వదిలే ప్రసక్తే లేదని, చట్టబద్ధంగానే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిందితుడిగా గుర్తించిన అశోక్ అమరావతిలో ఉన్నా, అమెరికాలో ఉన్న తప్పకుండా తీసుకొస్తామని, చట్టం ముందు నిలబెడతామన్నారు. మార్చి 2న కేసు నమోదైతే ఫిబ్రవరి 23న సైబరాబాద్ పోలీసులు ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని, తెలుగుదేశం సమాచారం తీసుకెళ్లి వైకాపాకు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ నాయకులు చేస్తున్న ఆరోపణలను విలేకర్లు స్టీఫెన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ లోకేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణలో భాగంగా పోలీసులు ఫిబ్రవరి 22న ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి వెళ్లారని, సంస్థతో పాటు సేవామిత్ర యాప్ పనితీరు గురించి తెలుసుకున్నారని, ఆ రోజు ఉపకరణాలు స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు. కేసు నమోదైన తర్వాత మార్చి 2న వెళ్లినపుడు మాత్రం కొన్ని ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒకవేళ ఫిబ్రవరి 22న వెళ్లినప్పుడే ఏవైనా ఉపకరణాలు స్వాధీనం చేసుకొని ఉంటే అవన్నీ సంస్థ కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదై ఉండేవి కదా అని ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి పోలీసులు వెళ్లిన దృశ్యాలు బయటకు ఎలా వచ్చాయన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. అసలు పౌరుల వ్యక్తిగత సమాచారం ఎలా వచ్చింది, దాన్ని ఎలా దుర్వినియోగం చేశారన్నది ప్రధానమని, దీని నిగ్గు తేల్చడమే తమ పని అని సిట్ ఐజీ తెలిపారు. పోలీసులు ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి వెళ్లిన తర్వాత సేవామిత్ర యాప్‌లో అనేక మార్పులు చేసినట్లు గుర్తించామని, రంగుల ఫొటోలకు బదులు నలుపు తెలుపు ఫొటోలు ఉన్నాయని, చిరునామాలు మాయమయ్యాయని, దీనిపైనా దృష్టి పెట్టామని వివరించారు. నిందితుడు అశోక్ వీటన్నింటికీ సమాధానం చెప్పాలని వివరించారు. స్వాధీనం చేసుకున్న ఉపకరణాలు ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపామన్నారు. సేవామిత్ర యాప్ సమాచారం అమెజాన్, గూగుల్‌లో నిల్వ చేశారని, దీనిని పంపాలంటూ సైబరాబాద్ పోలీసులు ఇదివరకే ఆయా సంస్థలకు లేఖలు రాశారని, అక్కడ నుంచి ఇంకా సమాధానం రాలేదని తెలిపారు. కేసు దర్యాప్తు అంతా సాంకేతిక అంశాలతో కూడుకున్నది కావడం వల్లే సిట్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. కార్యక్రమంలో సిట్ సభ్యులుగా ఉన్న కామారెడ్డి ఎస్పీ శ్వేత, సైబరాబాద్ డీసీపీ (నేరాలు) రోహిణీ ప్రియదర్శిని కూడా పాల్గొన్నారు. Quote
snoww Posted March 8, 2019 Author Report Posted March 8, 2019 AP Data leak issue TG lo case enduku ani crying aapeyyandi inka Quote
snoww Posted March 8, 2019 Author Report Posted March 8, 2019 ఆ ఫొటోల లీకేజీపైనా విచారణ.. తమ డేటాను తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు చోరీ చేశారంటూ ఏపీ ప్రభుత్వం, అక్కడి నాయకులు చేస్తున్న ఆరోపణలపై స్పందించబోమని స్టీఫెన్ పేర్కొన్నారు. ఈ అంశం తమ పరిధిలోది కాదన్నారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీలో తెలంగాణ పోలీసుల విచారణను తప్పుబడుతూ అందుకు సంబంధించిన ఫొటోలను టీడీపీ అధినేత కుమారుడు, ఏపీ మంత్రి లోకేశ్ ట్విట్టర్లో పోస్టు చేయడంపై స్టీఫెన్ స్పందించారు. తాము ఆ రోజు కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే చేశామని, ఒకవేళ తామేమైనా తీసుకెళ్లి ఉంటే ఆ ఫుటేజీలో ఉండేది కదా? అని ప్రశ్నించారు. అసలు ఆ సీసీ ఫుటేజ్ బయటకు ఎలా వెళ్లిందనే విషయంపైనా తాము దృష్టి పెట్టామన్నారు. వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. లోకేశ్‌పైనా చర్యలు తీసుకుంటారా? అన్న ప్రశ్నకు చట్టం ముందు అంతా సమానమేనని స్టీఫెన్ స్పష్టం చేశారు. అమరావతిలో ఉన్నా.. అమెరికాలో ఉన్నా పట్టుకుంటాం... ప్రస్తుతం పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ కంపెనీ డైరెక్టర్ అశోక్ ఏపీ పోలీసుల రక్షణలో ఉన్నాడా అని విలేకరులు ప్రశ్నించగా ‘‘ఈ కేసులో మేం చట్ట ప్రకారమే వ్యవహరిస్తాం. నిందితుడు ఎక్కడ ఉన్నా వదిలే ప్రసక్తే లేదు. ఆయన అమరావతిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా పట్టుకురావడం తథ్యం’అని స్టీఫెన్ స్పష్టం చేశారు. అందుకు కోర్టు, ఈసీ సూచనలు, అనుమతులు తీసుకుంటామని, అంతా చట్ట ప్రకారమే జరుగుతుందని తెలిపారు. నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామన్నారు. Quote
guduraju Posted March 8, 2019 Report Posted March 8, 2019 Aithe TS government kuda ITgrid ke ichindhi contract ? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.