Jump to content

Recommended Posts

Posted
ఏపీనే మాకు బాకీ

 

తెలంగాణ డిస్కంలకే రూ. 2,406 కోట్లు ఇవ్వాలి
24 గంటల్లో సమస్య పరిష్కరించుకోవడానికి సిద్ధం
లేఖలు రాసినా స్పందన  పూజ్యం
కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు
ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు

hyd-main4a_23.jpg

తెలంగాణ విద్యుత్‌ సంస్థలు తమకు రూ. 5,600 కోట్లు ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పెద్దలు అసత్య ప్రచారం చేస్తున్నారు. నిజానికి వారే మాకు బాకీ ఉన్నారు.మాకు రావాల్సింది మాకు ఇచ్చి.. వారికి రావాల్సింది ఉంటే తీసుకోమని ఎన్నిసార్లు చెప్పినా అటు నుంచి స్పందన లేదు. ఉల్టా చోర్‌ కొత్వాల్‌కో డాంటే.. అంటే ఇదే.

-తెలంగాణ ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు 

ఈనాడు, హైదరాబాద్‌: తమకు ఇవ్వాల్సిన సొమ్ము  ఇవ్వడం మానేసి.. తామే బాకీ ఉన్నట్లు ఏపీ సర్కారు దుష్ప్రచారం చేస్తోందని తెలంగాణ ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు పేర్కొన్నారు. ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు, ఇక్కడి నుంచి అక్కడికి చెల్లించాల్సిన లెక్కలన్నీ చూస్తే ఇంకా తెలంగాణకే అక్కడి నుంచి రూ. 2,406 కోట్లు రావాలి. కానీ తెలంగాణ నుంచి రూ. 5,600 కోట్లు రావాలని ఏపీ విద్యుత్‌ సంస్థలు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్సీఎల్టీ)కి వెళ్లాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌) సీఎండీ రఘుమారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావులతో కలసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రెండు రాష్ట్రాల సంస్థల మధ్య ఉన్న అంశాలపై కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుందామని ఇప్పటికే ఏడెనిమిది లేఖలు మేం రాశాం. మీకు మేం ఏం ఇవ్వాలి.. మాకు ఏం రావాలో చెప్పండని అడిగాం. కానీ ఏపీ అధికారుల్లో స్పందనే లేదు. అన్ని లెక్కలు చూస్తే తెలంగాణకే ఏపీ నుంచి సొమ్ము రావాలి. ఈ విషయాన్ని ఏపీ విద్యుత్‌ సంస్థల అధికారులు అక్కడి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుపోవడం లేదు. అక్కడి అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు మధ్య సమాచార లోపం ఉందనుకుంటున్నాం. మా సీఎం కేసీఆర్‌ మాకు స్పష్టంగా చెప్పారు. లెక్కలన్నీ చూసి ఏపీకి ఇవ్వాల్సింది ఏమైనా ఉంటే ఇచ్చేయండి అని ఆదేశించారు. కానీ ఏపీ నుంచే తెలంగాణకు రావాల్సి ఉందని మేం ఆయనకు వివరించాం. వాళ్లు వచ్చి మాతో మాట్లాడితే 24 గంటల్లో పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సామరస్య పరిష్కారానికి రావాలని వారిని ఎన్నిసార్లు అడిగినా స్పందనే లేదు.

hyd-main4c_2.jpg

హైకోర్టు చెప్పినా పట్టించుకోరా?
అంతర రాష్ట్ర ప్రాజెక్టులైన మాచ్‌ఖండ్‌, తుంగభద్ర విద్యుత్కేంద్రాల నుంచి 75 మెగావాట్ల విద్యుత్‌ తెలంగాణకు ఇవ్వాలని ‘దక్షిణ భారత విద్యుత్‌ కమిటీ’ చెప్పినా ఏపీ ఇవ్వడం లేదు. నాగార్జునసాగర్‌ ఆనకట్ట విస్తరణలో భాగంగా టెయిల్‌పాండ్‌ కట్ట కట్టాం. దాని పాలనా బాధ్యతలు తెలంగాణకు అప్పగించాల్సి ఉన్నా మాకు ఇవ్వడం లేదు. ఏపీ స్థానికత ఉద్యోగులను తెలంగాణ విద్యుత్‌ సంస్థల నుంచి రిలీవ్‌ చేసిన తరవాత వారిలో 619 మంది అక్కడికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నందున చేర్చుకోవాలని హైకోర్టు చెప్పినా తీసుకోలేదు. ఇలా ఏ సహకారం ఇవ్వకుండా ప్రతీదాంట్లో తెలంగాణపైనే ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు విభజన చట్టం ప్రకారం రావాల్సిన కరెంటు ఇవ్వకుండా బాధపెట్టారు. ఇప్పటికీ అదే తీరుతో వ్యవహరిస్తున్నారు’’ అని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 7,778 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులో ఉండగా ఇప్పుడది 16,506 మెగావాట్లకు చేరిందని, మరో ఐదేళ్లలో 28,400 మెగావాట్లకు చేరాలని సీఎం లక్ష్యంగా పెట్టారని ప్రభాకరరావు వివరించారు.

తెలంగాణ రూ.11,728 కోట్లు ఇవ్వాలి 
ఈ విషయం వారి పుస్తకాలే చెబుతున్నాయి
ఏపీ జెన్‌కో వెల్లడి

ఈనాడు, అమరావతి: తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీలు చెప్పిన అంశాలు వాస్తవ విరుద్ధమని ఏపీ జెన్‌కో ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. వారు విద్యుత్తు వినియోగించుకున్న పుస్తకాల్లోని గణాంకాల ఆధారంగా లెక్కించినా తెలంగాణ నుంచి ఏపీ జెన్‌కోకు ఇంకా రూ.11,728 కోట్లు రావాల్సి ఉందని అర్థమవుతుందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థల ఖాతా పుస్తకాల్లో స్పష్టంగా రూ.8,274.23 కోట్లు ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సి ఉందన్న విషయం పేర్కొన్నారని, మిగిలిన మొత్తం తెలంగాణ ఉత్తరప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థల నుంచి రావాల్సిన బకాయిగా ఏపీ జెన్‌కో వివరించింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ డిస్కంలకు విద్యుత్తు సరఫరా చేశామని, ఇందుకు రూ.5,732.40 కోట్లు రావాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ బకాయిలు రాబట్టుకోవడానికి ఎప్పటికప్పుడు జెన్‌కో ప్రయత్నిస్తోందని, రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చిందన్నారు. ప్రతి నెలా విద్యుత్తు బిల్లులతో పాటు రూ.150 కోట్ల చొప్పున తీర్చేస్తామని వారు అంగీకరించినా ఆ మాట నెరవేర్చలేదని ఏపీ జెన్‌కో స్పష్టం చేసింది. ఇక నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ ముందు తెలంగాణ విద్యుత్తు సంస్థలపై ఇన్‌సాల్వెన్సీ చట్టం కింద పిటిషన్‌ దాఖలు చేయడం తప్ప ఏపీ జెన్‌కోకు మరో మార్గం లేదని స్పష్టం చేసింది.

hyd-main4b_9.jpg

Posted

Lol vayya langas

eenadu lo vachindi kabatti bammaremo

Posted
1 minute ago, guduraju said:

Ee langas pakistan laa tayaru ayyaru

Pakistan em thappu seyyaledu man. CBN already briefed.

So langas ni thittali antey modi laa thayaru ayyaru , India laa thayaru ani thittu. 

Posted
4 minutes ago, snoww said:

Pakistan em thappu seyyaledu man. CBN already briefed.

So langas ni thittali antey modi laa thayaru ayyaru , India laa thayaru ani thittu. 

TRS MP Kavitha says Hyderabad, Kashmir forcibly merged into India

Posted
Just now, guduraju said:

TRS MP Kavitha says Hyderabad, Kashmir forcibly merged into India

thappu emi matladindi ra bai.. au mammalni ee lathkor gandlathoni kalpirru

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...