Jump to content

ardha sathabdapu swathanthranni emaandaamu ..?


Recommended Posts

Posted

 

Well the days of segregation  by caste and creed are behind us ... hope good days are ahead .... 

Posted
అర్ధశతాబ్దపు అఙానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా 
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా
శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం
 
ఈ రక్తపు సిందూరం
 
నీ పాపిటలొ భక్తిగదిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా !
 
కులాల కోసం గుంపులు కడుతూ
మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే
జనాలు తలలర్పిస్తారే
 
సమూహ క్షేమం పట్టని స్వార్థపు   
ఇరుకుతనంలో ముడుచుకు పోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే,
తెలిసి భుజం కలిపి రారే
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి
పోరి ఏమిటి సాధించాలి
 
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం
జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా ఓ అనాథ భారతమా!
 
అన్యాయాన్ని సహించని శౌర్యం
దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవుల్లో క్రూరమృగంలా
దాక్కుని ఉండాలా
వెలుగుని తప్పుకు తిరగాలా
 
శతృవుతో పోరాడే సైన్యం
శాంతిని కాపాడే కర్త్యవ్యం
స్వజాతి వీరులనణచే విధిలో   
సవాలు చెయ్యాలా అన్నల చేతిలొ చావాలా
 
తనలో ధైర్యం అడవికి ఇచ్చి
తన ధర్మం చట్టానికి ఇచ్చి
 
ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే
నడిచే శవాల సిగలో తురుమిన
నెత్తుటి మందారం ఈ సంధ్యాసిందూరం
వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపేనమ్మా గతి తోచని భారతమా!
 
తన తలరాతను తానే రాయగల అవకాశాన్నే వదులుకొని
తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుండట అధికారం
కృష్ణుడు లేని కురుక్షేత్రముగ సాగే ఈ ఘోరం
చితిమంటల సిందూరం చూస్తూ ఇంకా నిదురిస్తావా
 
విశాల భారతమా ఓ విషాద భారతమా!

 

 
Posted

this is also one of my favourite

 

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని
మారదు లోకం మారదు కాలం
గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి
గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి
యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్ఠం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా
వేట అదే వేటు అదే నాటి కధే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్యకాండ
నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని
మారదు లోకం మారదు కాలం

  • Thanks 1
  • Upvote 1
Posted

@timmy Apple uncle ippudu neelo ee violavatakamaina thoughts provoke cheyyadaniki ga karamalu enti 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...