snoww Posted March 10, 2019 Report Posted March 10, 2019 లక్షన్నరమందికి బల్దియా షాక్! మూడేళ్ల తర్వాత గుర్తొచ్చిన ‘అక్రమం’ బీపీఎస్ దరఖాస్తుదారులకు పన్నుపోటు రెండున్నరేళ్ల పన్నూ ఒకేసారి! ఒక్కో ఇంటి యజమాని రూ.2 లక్షల వరకు.. ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి రాజధానిలోని 1.50 లక్షల కుటుంబాలను హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేస్తోంది. ‘మా ఇంటిని క్రమబద్ధీకరించండి’ అని దరఖాస్తు చేసిన యజమానుల ఇళ్లకు.. మూడేళ్లుగా అదనపు నిర్మాణానికి పన్ను వసూలు చేయబోమన్న సంస్థ అది. ఇప్పుడు ఒక్కసారిగా జూలు విదిల్చి, ఒక్కోదానికి 200 శాతం జరిమానా కింద రూ.50,000 నుంచి రూ.రెండు లక్షల వరకు పన్ను చెల్లించాలంటోంది. తాఖీదులు పంపడంతో, లక్షలాది సొంతదారులు తీవ్రమైన ఆందోళనతో తల్లడిల్లుతున్నారు. ఒక్కసారిగా రూ.లక్షల్లో పన్నులను ఎలా చెల్లించగలమంటున్నారు. దీనంతటికీ కారణం ‘భవన అక్రమ నిర్మాణం’ కాబట్టి- పన్ను చెల్లించక తప్పదని, అదీ రెండున్నరేళ్ల నుంచి.. అని అధికారులు తెగేసి చెబుతున్నారు.దీనిపై బాధిత యజమానులు ఆగ్రహం వ్యక్తపరుస్తూ, పెద్దయెత్తున ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ నగరంలో 2007లో భవన నిర్మాణ క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్) కింద దాదాపు రెండు లక్షల ఇళ్లను క్రమబద్ధీకరించారు. 2015లో మరోసారి బీపీఎస్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో 1.50 లక్షలమంది ఇళ్ల యజమానులు దరఖాస్తు చేశారు. కొంతమంది హైకోర్టును ఆశ్రయించడంతో ‘దరఖాస్తుల పరిశీలన చేసుకోవచ్చు కానీ, క్రమబద్ధీకరణ ప్రక్రియను తిరిగి ఆదేశాలు జారీచేసేవరకు చేపట్టడానికి వీలులేదు’ అని ఆదేశించింది. అధికారులు చాలావరకు దరఖాస్తుల పరిశీలనను పూర్తిచేశారు. ఈలోపు బల్దియా అధికారుల మదిలో కొత్త ఆలోచన మొదలైంది. రెవెన్యూ విభాగంవారు బీపీఎస్ దరఖాస్తుదారుల వివరాలను..అందులో భవనం ఎన్ని అడుగుల్లో నిర్మించారన్న లెక్కలను తీసుకొన్నారు. రెండున్నరేళ్లకు అదీ 200 శాతం జరిమానాతో ప్రతి భవనానికీ పన్నును నిర్థారించడంతో, ఒక్కో భవన యజమాని గరిష్ఠంగా రూ.రెండు లక్షల వరకు ఒకేసారి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు- హయత్‌నగర్‌కు చెందిన వీరేష్ ఐదేళ్ల కిందటే చిన్న ఇంటిని నిర్మించుకున్నారు. ఏటా రూ.101 మాత్రమే పన్ను కింద చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఇంటిపై మరో అంతస్తు వేయడంతో, దీనివరకు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేశారు. రూ.56,000ను పన్నుకింద చెల్లించాలంటూ అధికారులు నోటీసు పంపించారు. దరఖాస్తు చేసినప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెబితే ఒక్కసారే ఇంత భారీగా ఎలా చెల్లించగలనని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదేవిధంగా కూకట్‌పల్లికి చెందిన మరో యజమానికి ఏకంగా రూ.లక్షన్నర మేరకు పన్ను కట్టాలంటూ బల్దియా నోటీసు ఇవ్వడంతో ఆయనా అల్లాడుతున్నారు. మార్చి నెలాఖరులోగా ఈ మొత్తం చెల్లించకపోతే- ఇంటికి ఉన్న కరెంట్, ఇతరత్రా సౌకర్యాలు తొలగిస్తామంటున్నారని ఆక్రోశిస్తున్నారు. ఖజానాలో డబ్బులు లేవని.. జీహెచ్‌ఎంసీ వద్ద ప్రస్తుతం ఖర్చుచేయడానికి ఏమీ లేదు. ప్రతి నెలా వసూలుచేస్తున్న ఇంటి పన్ను ఆధారంగానే చాలావరకు పనులు నడుస్తున్నాయి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేలా కొంతమంది నిపుణులు సలహా ఇవ్వడంతో, గత రెండు నెలలుగా బల్దియా అధికారులు రంగప్రవేశం చేశారు. బీపీఎస్ దరఖాస్తుల దుమ్ముదులిపి.. నోటీసులు పంపుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఈ మేరకు ముందుగానే ప్రకటించి ఉంటే, నిర్మాణదారులు కొంతమేర పన్ను చెల్లించడానికి ఏర్పాట్లు చేసుకొని ఉండేవారు. రహస్య మదింపు ఆధారంగా నోటీసులు అందుతుండటంతో, అనేకమంది ఆందోళనకు సంసిద్ధమవుతున్నారు. ‘ఇప్పుడు అక్రమ నిర్మాణమని మా దరఖాస్తు ఆధారంగా భావించి..రెండొందల శాతం జరిమానా వేస్తున్నారు. కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత, భవనం సక్రమం అంటూ క్రమబద్ధీకరించాక.. రెండున్నరేళ్లకూ వసూలుచేసిన పన్ను మొత్తాన్ని మాకు తిరిగి ఇచ్చేస్తారా’ అని పలువురు నిలదీస్తున్నారు. దీనికి బల్దియా అధికారుల నుంచి సమాధానం లేదు. Quote
tom bhayya Posted March 10, 2019 Report Posted March 10, 2019 3 minutes ago, alpachinao said: బల్దియా ante emiti Urdu word for municipality 1 Quote
johnubhai_01 Posted March 10, 2019 Report Posted March 10, 2019 12 minutes ago, tom bhayya said: Urdu word for municipality indulo andhrolla kutra enthavaraku undachu antav!!!! Quote
snoww Posted March 10, 2019 Author Report Posted March 10, 2019 12 minutes ago, johnubhai_01 said: indulo andhrolla kutra enthavaraku undachu antav!!!! AP development ni aapatam lo three modi's kutra entha nijam oo , idi kooda anthe nijam. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.