Jump to content

Recommended Posts

Posted
సమైక్యాంధ్రప్రదేశ్‌కు వచ్చిన 18 మంది ముఖ్యమంత్రులతోను సన్నిహిత సంబంధాలున్న నేను నవ్యాంధ్రప్రదేశ్‌కు వచ్చే అయిదు సంవత్సరాలకు చంద్రబాబు నాయుడునే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం ‘చారిత్రక అవసర’మని ఘంటాపథంగా చెప్పగలను.
636880369340144063.jpg
 
కాబోయే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎవరు? ఇది సర్వత్రా జరుగుతున్న చర్చ! ఇప్పుడు రంగంలో ముఖ్యమంత్రి పదవికి పోటీదార్లు ముగ్గురు కనిపిస్తున్నారు. కాబోయే ముఖ్యమంత్రి ఎవరైనా, ఆయనకు ఆ పదవిలో కనీసం సంవత్సరమైనా అనుభవం వుండాలి. అనుభవంతో పాటు పరిపాలనా దక్షత వుండాలి. ఆకస్మికంగా రాజకీయరంగంలో దుమికిన వారో, కనీసం ఒక్క రోజైనా మంత్రి పదవిని నిర్వహించనివారో ఆ పదవిని ఎలా నిర్వహించగలరు? ఏదో విధంగా వారు ముఖ్యమంత్రి అయినా, వారేమీ చేయగలరు? ముఖ్యమంత్రిత్వ బాధ్యతలు వారికేమి తెలుసు?
 
అందులోను నవ్యాంధ్రప్రదేశ్‌ తలాతోక లేని రాష్ట్రంగా అవతరించింది. అవతరించినప్పుడు రాజధానే లేదు. రాష్ట్రానికి కాని, దేశానికి కాని రాజధాని అంటే, మనిషికి ‘తల’ లాంటిది. భారత దేశంలో ఇంతవరకు రాజధాని లేకుండా ఏ రాష్ట్రం అవతరించలేదు‌!
 
పైగా, లోటు బడ్జెటుతో అవతరించింది. తెలుగు సామెత చెప్పినట్టు, ‘ఉప్పుతో తొమ్మిదీ సమకూర్చుకుంటే కాని వంట సాధ్యం కాదు’. తల లేని మొండెంవంటి ఈ రాష్ట్రానికి ఎన్ని హంగులు సమకూర్చుకుంటే, అది తక్కిన రాష్ట్రాల వలె సజావుగా నడుస్తుంది? అందువల్లనే, రాజధాని లేని మొండెం వంటి రాష్ట్రానికి ‘తల’తో పాటు రూపు రేఖలను దిద్దగల నాథుడు నారా చంద్రబాబేనని 2014లో జరిగిన ఎన్నికలలో నవ్యాంధ్రప్రదేశ్‌ ఓటర్లు ఆయననే ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.
 
మరి ముఖ్యమంత్రిత్వంలో ఆయనకు 14 సంవత్సరాల అనుభవం వుంది. రాష్ట్రంలో మరెవరైనా అంత అనుభవం వున్నవారున్నారా? చంద్రబాబుకు పూర్వం కాసు బ్రహ్మానందరెడ్డికి ముఖ్యమంత్రిగా అనుభవం దాదాపు తొమ్మిది సంవత్సరాలు.
 
కాని, ఆయన రికార్డునూ చంద్రబాబు నాయుడు అధిగమించారు. ఇక, ఆయన పరిపాలనా దక్షతనుగురించి వేరే చెప్పాలా? అంతటా పరిపాలనా దక్షత వుంది కనుకనే ఆయన అంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా వుండగలిగారు.
భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పేరు ప్రఖ్యాతులైనా, వారి రాష్ట్రానికే పరిమితం. కాని, చంద్రబాబు పేరు ప్రపంచ ప్రఖ్యాతం. అంతే కాదు– ఆయన మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పుడు అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, బ్రిటిష్‌ ప్రధాని టోని బ్లెయిర్‌, ప్రపంచ కుబేరుడు బిల్‌ గేట్స్, ఇంకా కొందరు అంతర్జాతీయ ప్రముఖులు పనికట్టుకుని, హైదరాబాద్‌ వచ్చి, ఆయనను చూడకుండా వెళ్లేవారు కాదు! ఈ గౌరవం, ఇంత గౌరవం – భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రికీ దక్కలేదు. అదే ‘అంతర్జాతీయ ముఖ్యమంత్రి’ అంటే!
 
అలాగే అప్పటి యునైటెడ్‌ ఫ్రంట్‌ హయాంలోను, ఆ తరువాత వాజ్‌పేయి పాలనా కాలంలోను చంద్రబాబు కేంద్ర స్థాయిలో కూడా చక్రం తిప్పిన ఘనత సాధించారు. అప్పటిలో ఇద్దరు ప్రధాన మంత్రులు – దేవగౌడ, ఐ.కె. గుజ్రాల్‌ ఎంపికలోనేమి, ఉపరాష్ట్రపతిగా కృష్ణకాంత్‌ ఎన్నికలోనేమి, రాష్ట్రపతులుగా కె.ఆర్‌. నారాయణన్‌, అబ్దుల్‌ కలాంల నిర్ణయంలోనేమి చంద్రబాబు నాయుడిదే కీలక పాత్ర. సరే, లోక్‌సభ స్పీకర్‌గా తొలిసారిగా ఎస్‌.సి. వర్గానికి చెందిన జి.ఎమ్‌.సి. బాలయోగి ఎన్నిక కావడానికి కూడా ఆయనే కారకుడు. అదే ‘కింగ్‌ మేకర్‌’ అంటే!
 
నిజానికి–ఇంతకు పూర్వమే పేర్కొన్నట్టు– భారతదేశంలో కొత్త రాష్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసినా, దానికి రాజధాని లేకుండా లేదు. 2000 లో నిర్మించిన కొత్త రాష్ట్రాలు–ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌ఘడ్‌లకు–రాజధాని నగరాలున్నాయి. అలాగే హర్యానా, పంజాబ్‌లకు ఉమ్మడి రాజధాని చండీఘడ్.
 
కాగా, ఈ ‘ఉక్కుమనిషి’ ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ సందర్శించనన్ని ప్రపంచ దేశాలన్నీ తిరిగి, నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి నిధులు సేకరించారు. నవ్యాంధ్రప్రదేశ్‌కు మూడు సంవత్సరాలు పూర్తి కాకుండానే రాజధాని నగరాన్ని, సెక్రటేరియట్‌, అసెంబ్లీ, కౌన్సిల్‌ భవనాలను నిర్మించిన ‘అభినవ మయబ్రహ్మ’ చంద్రబాబు.
 
బహుశా భారత దేశంలోని ఇప్పటి రాష్ట్రాల ముఖ్యమంత్రులలో ఆయనకు ధీటైన వారు లేరనడం నిర్వివాదం. అందువల్లనే, ఆయన అనుభవ విజ్ఞానాలను పంచుకోడానికి ఐక్యరాజ్యసమితి వంటి ప్రపంచసంస్థ ఆయనను ఆహ్వానించిందని వేరే చెప్పాలా?
 
కాగా, ఇంతకు పూర్వం సమైక్యాంధ్రప్రదేశ్‌కు వచ్చిన 18 మంది ముఖ్యమంత్రులతోను సన్నిహిత సంబంధాలున్న నేను నవ్యాంధ్ర ప్రదేశ్‌కు వచ్చే అయిదు సంవత్సరాలకు చంద్రబాబు నాయుడునే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం ‘చారిత్రక అవసర’మని ఘంటాపథంగా చెప్పగలను.
Posted

భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పేరు ప్రఖ్యాతులైనా, వారి రాష్ట్రానికే పరిమితం. కాని, చంద్రబాబు పేరు ప్రపంచ ప్రఖ్యాతం. అంతే కాదు– ఆయన మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పుడు అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, బ్రిటిష్‌ ప్రధాని టోని బ్లెయిర్‌, ప్రపంచ కుబేరుడు బిల్‌ గేట్స్, ఇంకా కొందరు అంతర్జాతీయ ప్రముఖులు పనికట్టుకుని, హైదరాబాద్‌ వచ్చి, ఆయనను చూడకుండా వెళ్లేవారు కాదు! ఈ గౌరవం, ఇంత గౌరవం – భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రికీ దక్కలేదు. అదే ‘అంతర్జాతీయ ముఖ్యమంత్రి’ అంటే!

ABN or Eenadu source ??

Posted
3 hours ago, Chinna84 said:

https://www.andhrajyothy.com/artical?SID=737271

Posted

30-40 times Delhi chuttu thirigi PM appointment sampadinchukoleni record kooda babu gaaride @3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...