snoww Posted March 19, 2019 Report Posted March 19, 2019 ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారో చెప్పేసిన కేఏ పాల్ 19-03-2019 21:27:27 విశాఖపట్నం: నర్సాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. ఇంకొక నియోజకవర్గంలో కూడా పోటీ చేసే అవకాశం ఉందని, 22న నామినేషన్ దాఖలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. రేపు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వర రావు తనకు ఫోన్ చేసి ఆశీస్సులు కావాలని అడిగారని కేఏ పాల్ వ్యాఖ్యానించడం విశేషం. టీడీపీలో ఉంటే ఓటమి ఖాయమని.. బయటకు వస్తే ప్రజాశాంతి పార్టీ టిక్కెట్ ఇస్తామని బోండా ఉమతో అన్నట్లు కేఏ పాల్ చెప్పడం కొసమెరుపు. ఇప్పుడు ఉన్న రెండు పార్టీలు అవినీతి పార్టీలని పాల్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయని, పవన్ అన్నయ్య పార్టీ పెట్టి ఎలా మూసివేశారో పవన్ కూడా అలాగే చేస్తారని ఆయన విమర్శించారు. ఆంధ్రాని అమెరికా చేసే సత్తా కేవలం ప్రజాశాంతి పార్టీకే ఉందని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. హెలికాప్టర్లో తిరుగుతున్న నేతలకు ఓట్లు వేయొద్దని, కానీ హెలికాప్టర్ గుర్తుకు ఓటు వేయండని కేఏ పాల్ పిలుపునిచ్చారు. Quote
boeing747 Posted March 19, 2019 Report Posted March 19, 2019 Jai Fraja santhi farty..jai CM Ka Paul Quote
Sucker Posted March 19, 2019 Report Posted March 19, 2019 6 minutes ago, boeing747 said: Jai Fraja santhi farty..jai CM Ka Paul From KA Paul IT wing Quote
Charger Posted March 19, 2019 Report Posted March 19, 2019 KA paul tharapuna Amala Paul campaign chesthe, paaul ki votle votlu antunna PSP biddalu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.