vatsayana Posted March 22, 2019 Report Posted March 22, 2019 https://telugu.gulte.com/tnews/32278/Ali-looking-to-join-Janasena- పవన్‌కళ్యాణ్‌కి చిత్ర పరిశ్రమలో అత్యంత ఆప్త మిత్రుడిగా పేరున్న ఆలీకి పవన్ అన్ని సినిమాల్లోను ముఖ్య పాత్ర లభిస్తుంటుంది. ఆలీతో తన సాన్నిహిత్యాన్ని, స్నేహాన్ని పవన్ ఓపెన్‌గానే చాటుకుంటూ వుంటాడు. పవన్ అభిమానులు కూడా ఆలీని సొంత మనిషిలానే భావిస్తుంటారు. అయితే జనసేన ఎన్నికల బరిలో దిగుతోన్న వేళ పవన్ వెంట నిలబడకుండా పక్క చూపులు చూసిన ఆలీ మెగా ఫాన్స్‌కి షాకిచ్చాడు. ముందుగా టీడీపీలో టికెట్ కోసం ప్రయత్నాలు చేసి తర్వాత వైసిపి తీర్థం పుచ్చుకున్నాడు. అయితే అక్కడా టిక్కెట్ దక్కకపోవడంతో ఇప్పుడు జనసేనలోకి రావాలని చూస్తున్నాడనే పుకార్లు బాగా వినిపిస్తున్నాయి. సరాసరి పవన్ వెంట నడిచి వుంటే ఆలీకి జనసేనలో గౌరవం దక్కేదేమో. అభిమానులు కూడా అతడిని అక్కున చేర్చుకునేవారేమో. కానీ పక్క పార్టీల వైపు వెళ్లడం, జనసేనని చులకనగా చూడడంతో ఆలీ పట్ల ఇప్పుడు జన సైనికులకి సదభిప్రాయం లేదు. ఇప్పుడు పవన్ పంచన చేరితే ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా లేకున్నా తర్వాత ఏదో ఒక పదవి కట్టబెడతాడని ఆలీ పాకులాడుతున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా నటులకి, అందులోను ఆలీ లాంటి ప్రముఖ కమెడియన్లకి సాధారణంగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినపుడు సాదర స్వాగతం లభిస్తుంది. కానీ సరయిన ప్లానింగ్ లేకుండా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆలీ ఒక మంచి అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నట్టయింది. Quote
cosmopolitan Posted March 22, 2019 Report Posted March 22, 2019 Dhoola theerindhi edhvaki .. adhira ma kadapa rajakeeyam.. ekadiki kakunda poyadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.