Jump to content

Recommended Posts

Posted
కేసీఆర్‌ దూకుడుతో హైదరాబాద్‌కు నష్టం
24-03-2019 00:37:52
 
636889846694960314.jpg
‘ఆంధ్రా వార్తల దరిద్రం మాకెందుకు’ అన్న కేటీఆర్‌ ఇప్పుడు తమ సొంత పత్రికలో తెలుగుదేశంపార్టీ వ్యతిరేక వార్తలకు ప్రత్యేక స్థానం కేటాయించారు. తమ బెదిరింపులకు భయపడి తెలుగుదేశంపార్టీ తరఫున పోటీచేయడానికి కొంతమందైనా వెనుకంజ వేస్తారని భావించి ‘ప్రజావ్యతిరేకతకు భయపడి తెలుగుదేశంపార్టీ తరఫున పోటీచేయడానికి అభ్యర్థులు కూడా దొరకడం లేదని..’ ప్రచారం చేయడం మొదలెట్టారు. జరుగుతున్న పరిణామాలన్నీ హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్రులను పునరాలోచనలో పడేస్తున్నాయి.
 
కేసీఆర్‌ అండ్‌ కో మొదలెట్టిన బెదిరింపుల పర్వం హైదరాబాద్‌ ప్రయోజనాలను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది. హైదరాబాద్‌లో ఆస్తులు, వ్యాపారాలు ఉన్నవారిని బెదిరిస్తున్నారన్న వార్తలు దేశమంతటా వ్యాపిస్తే హైదరాబాద్‌కే నష్టం. ఇవ్వాళ ఆంధ్రులను బెదిరిస్తున్నారు.. రేపు మనల్ని బెదిరించరన్న గ్యారెంటీ ఏమిటి? అన్న సందేహం ఇతర రాష్ట్రాల వారికి రాకుండా ఉంటుందా? చంద్రబాబును ఏదో చేసేయాలన్న కేసీఆర్‌లోని అత్యుత్సాహం తెలంగాణ రాష్ట్రానికి కూడా కొత్త సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. ఏపీలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డిని ఆదుకోవాలనుకుంటే ఇది సరైన మార్గం కాబోదు.
 
ఆంధ్రప్రదేశ్‌లో గత వారం రోజులుగా చోటుచేసు కుంటున్న పరిణామాలను గమనిస్తే రాజకీయాలలో ఎటువంటి ప్రమాదకర ధోరణులు తలెత్తుతున్నాయో తెలుస్తుంది. హైదరాబాద్‌ను అడ్డుపెట్టుకొని సాగుతున్న కుట్రలు ఆంధ్రుల ప్రయోజనాలకు నష్టం కలిగించేవిగా ఉంటున్నాయి. హైదరాబాద్‌లో ఆస్తులున్న వారిని భయపెట్టడం ప్రమాదకర సంకేతాలనిస్తోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబునాయుడిని దెబ్బతీయాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం.. ముఖ్యంగా కేసీఆర్‌ అండ్‌ కో అమలుచేస్తున్న ఈ వ్యూహం హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రమాదం కూడా లేకపోలేదు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తర్వాత సీమాంధ్రకు చెందిన పలువురు హైదరాబాద్‌కు వెళ్లి వ్యాపారాలు, పరిశ్రమలు నెలకొల్పారు. దాదాపు 60 ఏళ్లపాటు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నందున వలస వచ్చినవారు ఆస్తులు పెంచుకున్నారు.
 
రాష్ట్రం విడిపోతుందన్న ఊహ కూడా లేనందున సీమాంధ్రులు తమ శ్రమనంతా పెట్టుబడిగా హైదరాబాద్‌లోనే పెట్టారు. అయిదేళ్ల క్రితం రాష్ట్రం విడిపోవడంతో హైదరాబాద్‌లో పెట్టుబడులు, ఆస్తులు ఉన్నవారు ప్రభుత్వానికి అణిగిమణిగి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ప్రమాదం ఉండే అవకాశం ఉందని ఊహించిన కాంగ్రెస్‌పార్టీ పెద్దలు హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించి.. సీమాంధ్రులను దృష్టిలో పెట్టుకొని గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కూడా కట్టబెట్టారు. అయితే గవర్నర్‌ నరసింహన్‌ ఆ విషయాన్ని మరచిపోయి తెలంగాణకు మాత్రమే తాను గవర్నర్‌ను అన్న భావనతో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఆస్తులుండి ఏపీలో రాజకీయ పార్టీలలో.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వారు బెదిరింపులకు గురవుతున్నారు.
 
‘‘తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే అంతే సంగతులు.. మీ ఆస్తులు పదిలంగా ఉండాలంటే పోటీకి దూరంగా ఉండండి.. లేదా వైసీపీలో చేరండి’’ అని తెలంగాణ ప్రభుత్వ పెద్దల నుంచి హెచ్చరికలు వెళ్లడం ఆందోళన కలిగించే అంశం! కేసీఆర్‌ అండ్‌ కో మొదలెట్టిన ఈ బెదిరింపుల పర్వం హైదరాబాద్‌ ప్రయోజనాలను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది. హైదరాబాద్‌లో ఆస్తులు, వ్యాపారాలు ఉన్నవారిని బెదిరిస్తున్నారన్న వార్తలు దేశమంతటా వ్యాపిస్తే హైదరాబాద్‌కే నష్టం. ఇవ్వాళ ఆంధ్రులను బెదిరిస్తున్నారు.. రేపు మనల్ని బెదిరించరన్న గ్యారెంటీ ఏమిటి? అన్న సందేహం ఇతర రాష్ట్రాల వారికి రాకుండా ఉంటుందా? చంద్రబాబును ఏదో చేసేయాలన్న కేసీఆర్‌లోని అత్యుత్సాహం తెలంగాణ రాష్ట్రానికి కూడా కొత్త సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. ఏపీలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డిని ఆదుకోవాలనుకుంటే ఇది సరైన మార్గం కాబోదు. జగన్మోహన్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్‌ కోరుకోవడం వెనుక బహుముఖ కారణాలు ఉన్నాయి. జాతీయ రాజకీయాలలో చంద్రబాబుకు చోటులేకుండా చేయాలనుకోవడం బయటకు కనిపించే కారణం కాగా, రహస్య ఎజెండా వేరే ఉందని చెబుతున్నారు. ఇందులో ముఖ్యమైనది ఏపీలో జగన్‌ అధికారంలోకి వస్తే అభివృద్ధిలో హైదరాబాద్‌ మరింతగా దూసుకుపోతుందనీ, అమరావతి నిర్మాణం కుంటుపడుతుందన్నది కేసీఆర్‌ అండ్‌ కో ఆలోచనగా చెబుతున్నారు.
 
‘‘చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతి అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది. దాని ప్రభావం హైదరాబాద్‌పై పడుతుంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం’’ అని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఒక ముఖ్య నేత వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం కోసం ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా 33 వేల ఎకరాలను చంద్రబాబు సమీకరించిన విధానాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా పార్టీ ముఖ్యుల సమావేశంలో అంతర్గత చర్చల సందర్భంగా ప్రశంసించారు. ‘‘తెలంగాణలో భూ సేకరణకు మనం ఎన్నో ఇబ్బందులుపడ్డాం. ఏపీలో చంద్రబాబు చాలా తెలివిగా భూసమీకరణ పేరిట కావలసిన భూమిని సేకరించగలిగారు’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. కేసీఆర్‌ భావిస్తున్నట్టుగానే రాజధాని కోసం పైసా అవసరం లేకుండా వేలాది ఎకరాలను సేకరించి పెట్టుకోవడం చంద్రబాబు సాధించిన అతి గొప్ప విజయం. దేశంలో ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదు. అయితే ఏపీ రాజకీయాలలో నెలకొన్న వైషమ్యాల కారణంగా చంద్రబాబు సాధించిన ఈ విజయాన్ని గుర్తించడానికి ఏపీలో కొంతమంది నిరాకరిస్తున్నారు.
 
‘‘రాజధానికి అంత భూమి ఎందుకు? ఇంత భూమి ఎందుకు?’’ అని సన్నాయి నొక్కులు నొక్కేవారు ఎక్కువయ్యారు. ఒక్కసారి రాజధాని నిర్మాణం మొదలైతే దాని చుట్టుపక్కల భూముల ధరలు అమాంతం పెరిగిపోతాయి. అప్పుడు భూమి కావాలన్నా సేకరించడం అసాధ్యమవుతుంది. ఈ మాత్రం ఇంగితం కూడా లేనివారే చంద్రబాబు ప్రయత్నాన్ని ఆక్షేపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల వ్యాఖ్యానాలను బట్టి హైదరాబాద్‌ అభివృద్ధిపథంలో దూసుకుపోవాలంటే ఏపీలో జగన్‌ అధికారంలోకి రావాలి. అమరావతి నిర్మాణ పురోగతి కుంటుపడాలి. తెలంగాణ హితవు కోరేవారికి ఇది సబబుగానే కనిపిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ అభివృద్ధిలో దూసుకుపోవాలని కేసీఆర్‌ కోరుకోవడం కూడా తప్పు కాదు. మరి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రయోజనాల సంగతి ఏంటి? అమరావతి నిర్మాణం శరవేగంగా జరగాలా? వద్దా? ఏపీ ప్రజలు ఈ ఎన్నికల సందర్భంగా ఈ విషయం ఆలోచించి విజ్ఞతతో వ్యవహరిస్తే వారికే మంచిది.
 
md-sir-main-aa.jpgవికృత రాజకీయ క్రీడ
ఇప్పుడు మళ్లీ బెదిరింపుల విషయానికి వద్దాం. హైదరాబాద్‌లో ఆస్తులు, వ్యాపారాలున్న వారిని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తున్నారని ‘ఆంధ్రజ్యోతి’ గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచురిస్తూ వచ్చింది. తాజాగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో చేరాలనుకున్న వారిలో కొందరు చివరి నిముషంలో వైసీపీలో చేరారనీ, అందుకు కారణాలను ఆరా తీయగా బెదిరింపులు వచ్చాయని తెలిసిందనీ పవన్‌ కల్యాణ్‌ చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో ఆంధ్రుల భూములపై వివాదాలు ఇప్పుడే కొత్తగా మొదలయ్యాయి. గడచిన అయిదేళల్లో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోలేదు. ఇప్పుడే ఎందుకు బెదిరింపులు వస్తున్నాయంటే అందుకు ఏపీలో జరగనున్న ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోవాలని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు బలంగా కోరుకోవడమే! జగన్మోహన్‌రెడ్డి ఏపీలో అధికారంలోకి వస్తే అణిగిమణిగి పడి ఉంటారన్నది తెలంగాణ ప్రభుత్వ పెద్దల భావన! ఇలా భావించడానికి కారణాలు లేకపోలేదు.
 
హైదరాబాద్‌లో జగన్‌కు మాత్రమే కాదు.. ఆయనకు సంబంధించిన వారికి బోలెడన్ని ఆస్తులున్నాయి. అంతేకాదు.. జగన్‌పై విచారణలో ఉన్న కేసుల మూలాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఈ కారణంగా జగన్మోహన్‌రెడ్డిని లొంగదీసుకోవడం సులువు అని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఏపీ ఎన్నికలలో నేరుగా జోక్యం చేసుకోవాలని తలపోసిన కేసీఆర్‌ అండ్‌ కో తమ వ్యూహాన్ని మార్చుకున్నారు. కేసీఆర్‌ ఎత్తుగడలను పసిగట్టిన చంద్రబాబునాయుడు ఎదురుదాడికి దిగడంతో కేసీఆర్‌ తన పంథా మార్చుకున్నారు. ఏపీ రాజకీయాలలో తాము నేరుగా జోక్యం చేసుకుంటే జగన్మోహన్‌రెడ్డికి మేలు కలగకపోగా.. నష్టం జరుగుతుందని కేసీఆర్‌ తొందరగానే గ్రహించారు. దీంతో తన వ్యూహాన్ని మార్చుకున్నారు. తాను ఎక్కడా బయటపడకుండా, తన చేతికి మట్టి అంటకుండా పావులు కదపడం మొదలెట్టారు. ఈ క్రమంలో ఏపీ రాజకీయాలలో, ముఖ్యంగా తెలుగుదేశం తరఫున ఎన్నికలలో పోటీ చేస్తున్న వారికి హైదరాబాద్‌లో ఉన్న ఆస్తుల గురించి ఆరా తీయడం మొదలెట్టారు. ఈ వివరాలన్నీ చేతికి అందిన తర్వాత తమ మనోగతాన్ని ఆస్తులున్న వారికి తెలియజేస్తూ వచ్చారు. వైసీపీలో చేరడానికి లేదా జగన్‌కు మద్దతుగా నిలబడటానికి నిరాకరించిన వారి ఆస్తులపై వివాదం సృష్టించడం మొదలెట్టారు. తెలుగుదేశం తరఫున ప్రస్తుతం పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి ఎన్నికల ఖర్చు కోసం హైదరాబాద్‌లో ఉన్న భూమిలో కొంత భాగాన్ని అమ్మడానికై ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వ పెద్దలు, సదరు అభ్యర్థిని బెదిరించడం మొదలెట్టారు.
 
ఈ బెదిరింపులకు ఆయన లొంగకపోవడంతో అమ్మకానికి పెట్టుకున్న భూమిని రిజిస్ట్రేషన్‌ చేయకూడదని సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఆ అభ్యర్థి ఉన్నారు. ఈ బెదిరింపులకు సంబంధించిన మరో ఉదంతం మరింత ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుత ఎన్నికలలో వైసీపీ తరఫున ఏపీలో లోక్‌సభ స్థానానికి పోటీచేస్తున్న ఒక అభ్యర్థి కొద్దిరోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. ‘‘మీరు నాకు పార్టీలో ఎంతో గౌరవం ఇచ్చారు. అయితే కేంద్ర పెద్దల నుంచీ, తెలంగాణ ప్రభుత్వ పెద్దల నుంచీ నాపై విపరీతమైన ఒత్తిడి ఉంది. తెలుగుదేశంపార్టీ తరఫున పోటీ చేయలేను. నన్ను అర్థం చేసుకోండి’’ అని ఆయన చంద్రబాబు వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో అవాక్కయిన చంద్రబాబు.. ‘నేను కూడా ముఖ్యమంత్రినే కదా? తలచుకుంటే నేను కూడా నిన్ను ఇబ్బంది పెట్టగలను కదా?’ అని వ్యాఖ్యానించగా, ‘మీరు ఆ పనిచేయలేరు అని తెలుసు సార్‌.. అందుకే నా ఆవేదనను మీతో పంచుకున్నాను’ అని ఆ అభ్యర్థి బదులిచ్చారు. దీన్నిబట్టి ఏపీలో చంద్రబాబును ఓడించడానికై తెలంగాణ ప్రభుత్వ పెద్దలే కాదు, కేంద్రప్రభుత్వ పెద్దలు కూడా రంగంలోకి దిగినట్లు స్పష్టమవుతోంది. బలమైన అభ్యర్థులు కావాలనుకున్నప్పుడు ఇతర పార్టీలకు చెందిన వారిని ఆకర్షించడం ఇంతకుమునుపు కూడా జరిగింది. అయితే.. ఇలా బెదిరింపులకు పాల్పడటం.. అది కూడా పొరుగు రాష్ట్ర వ్యవహారాలలో తలదూర్చడం ఇదే మొదటిసారి. ఏపీలో వైసీపీ విజయం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి తెరవెనుక ఉంటూ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.
 
ఈ క్రమంలో పరిధి దాటి మరీ హైదరాబాద్‌లో ఆస్తులున్న వారిని టార్గెట్‌గా చేసుకుంటున్నారు. ఈ పరిణామంతో హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్రులలో మొదటిసారిగా అభద్రతాభావం నెలకొన్నది. 2014లో తెలంగాణలో కేసీఆర్‌ ఆధికారంలోకి వచ్చిన నాటినుంచీ సీమాంధ్రులు ముఖ్యంగా సినీపరిశ్రమకు చెందిన వారు అణకువగానే ఉంటూ వచ్చారు. సినీహీరో నాగార్జునకు చెందిన ‘ఎన్‌ కన్వెన్షన్‌’ సెంటర్‌పైకీ, సీమాంధ్రులు అధికంగా నివసించే అయ్యప్ప సొసైటీలో నిర్మాణంలో ఉన్న భవనాలపైకీ మునిసిపల్‌ అధికారులను ఉసిగొల్పడం ద్వారా సీమాంధ్రులను కేసీఆర్‌ తన అదుపులోకి తెచ్చుకున్నారు. నాగార్జున వ్యవహారం తర్వాత సినీపరిశ్రమకు చెందిన పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కీర్తించడంలో బిజీగా ఉంటూ వస్తున్నారు. నంది అవార్డుల ఎంపికలో లొసుగులు చోటుచేసుకున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒంటికాలిపై లేచి విమర్శలు చేసిన సినీప్రముఖులు.. తెలంగాణలో ఒక్క యేడాదికి కూడా అవార్డులు ప్రకటించకపోయినా కిమ్మనలేదు. ‘నందిలేదు.. పందిలేదు..’ అని కేసీఆర్‌ ఈసడించుకున్నా చప్పట్లు కొట్టాల్సిన పరిస్థితి సినీపరిశ్రమకు చెందిన పెద్దలది! ఆస్తులు, వ్యాపారాలు సజావుగా సాగాలంటే కేసీఆర్‌కు జీ హుజూర్‌ అనాల్సిన పరిస్థితిలో ఇప్పుడు హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్రులున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన పలువురి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరమైంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పార్టీ ఆగమైపోతోంది. దీంతో కేసీఆర్‌ రాజకీయాలను ప్రశ్నించే వారే లేకుండాపోయారు.
 
రిటర్న్‌గిఫ్టా... గిఫ్టా?
ఇదిలా ఉంటే.. ఏపీలో చంద్రబాబును ఓడించడానికై జగన్మోహన్‌రెడ్డిని, పవన్‌కల్యాణ్‌ను కలపాలని గవర్నర్‌ నరసింహన్‌తో పాటు.. కేసీఆర్‌ అండ్‌ కో ప్రయత్నిస్తున్నారని కొన్ని నెలలముందు ఇదే కాలమ్‌లో నేను చెప్పాను. ఇప్పుడు జనసేనాని పవన్‌కల్యాణ్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జగన్‌తో చేతులు కలపాల్సిందిగా తెలంగాణకు చెందిన వారినుంచి తనపై ఒత్తిళ్లు వచ్చాయని పవన్‌కల్యాణ్‌ స్వయంగా ప్రకటించారు. గవర్నర్‌ నరసింహన్‌కు పవన్‌కల్యాణ్‌పై హఠాత్తుగా ప్రేమ పుట్టుకు వచ్చినప్పుడే నాకు ఈ అనుమానం కలిగింది. చంద్రబాబునాయుడు ప్రధాని మోదీతో సఖ్యతగా ఉన్నంతకాలం గవర్నర్‌కు పవన్‌కల్యాణ్‌ గుర్తుకు రాలేదు. రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఆహ్వానించి హడావుడీ చేయలేదు. నరేంద్రమోదీ, చంద్రబాబు మధ్య దూరం పెరిగాక పవన్‌కల్యాణ్‌ను గవర్నర్‌ చేరదీస్తూ వచ్చారు. రాజ్‌భవన్‌కు ప్రత్యేకంగా పిలిపించుకొని చర్చలు జరిపారు. ఆ వెంటనే పవన్‌కల్యాణ్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మొదటిసారిగా కలిసి ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు.
 
పవన్‌కల్యాణ్‌ తమ మాట విని జగన్మోహన్‌రెడ్డితో చేతులు కలుపుతారని కేసీఆర్‌ అండ్‌ కో భావించినా కథ అడ్డం తిరిగింది. ఇకపై కేసీఆర్‌, కేటీఆర్‌ దృష్టిలో పవన్‌కల్యాణ్‌ దుష్మన్‌ మాత్రమే! రాజ్‌భవన్‌ నుంచి పవన్‌కల్యాణ్‌కు ఆహ్వానాలు కూడా అందకపోవచ్చు! ‘ఆంధ్రా వార్తల దరిద్రం మాకెందుకు’ అన్న కేటీఆర్‌ ఇప్పుడు తమ సొంత పత్రికలో తెలుగుదేశంపార్టీ వ్యతిరేక వార్తలకు ప్రత్యేక స్థానం కేటాయించారు. తమ బెదిరింపులకు భయపడి తెలుగుదేశంపార్టీ తరఫున పోటీచేయడానికి కొంతమందైనా వెనుకంజ వేస్తారని భావించి ‘ప్రజావ్యతిరేకతకు భయపడి తెలుగుదేశంపార్టీ తరఫున పోటీచేయడానికి అభ్యర్థులు కూడా దొరకడం లేదని..’ ప్రచారం చేయడం మొదలెట్టారు. జరుగుతున్న పరిణామాలన్నీ హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్రులను పునరాలోచనలో పడేస్తున్నాయి. తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికలలో పవన్‌కల్యాణ్‌ అనుయాయుల పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రసమితికి ఓటువేసిన వర్గాలు కూడా ఇప్పుడు ఆత్మపరిశీలనలో పడ్డాయి. తెలంగాణ ఎన్నికలలో ఆంధ్రావాళ్లకు వ్యతిరేకంగా సెంటిమెంట్‌ రగిలించినట్టుగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌ అండ్‌ కో చర్యలను గమనిస్తున్న ఆ రాష్ట్రప్రజలలో కూడా సెంటిమెంట్‌ ఏర్పడుతోంది.
 
చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానని కేసీఆర్‌ చేసిన ప్రకటన చంద్రబాబు పాలిట గిఫ్ట్‌గా మారబోతోంది. చంద్రబాబు ఓడిపోవాలని ఎవరు కోరుకుంటున్నారు? ఎందుకు కోరుకుంటున్నారు? దానివల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలకు కలిగే నష్టం ఏమిటి? అనే అంశాలను ఏపీ ప్రజలు విశ్లేషించుకుంటున్నారు. జగన్మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ ఒక్కటే అన్న భావనను ప్రజలలో వ్యాపింపచేయడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సక్సెస్‌ అయ్యారు. తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు అత్యుత్సాహం ప్రదర్శించడం ద్వారా కేసీఆర్‌కు ఎలా మేలు చేశారో, ఇప్పుడు కేసీఆర్‌ అండ్‌ కో తెరవెనుక ఉంటూ పావులు కదపడం ద్వారా చంద్రబాబుకు మేలు చేయబోతున్నారు. కేసీఆర్‌ ప్రకటించి అమలుచేస్తున్న రిటర్న్‌గిఫ్ట్‌ పథకం చంద్రబాబు పాలిట నిజమైన గిఫ్ట్‌ అవుతుందా? లేదా? అన్నది తెలియాలంటే మరో రెండు నెలలు వేచి చూడాల్సిందే!
Posted

2014లో తెలంగాణలో కేసీఆర్‌ ఆధికారంలోకి వచ్చిన నాటినుంచీ సీమాంధ్రులు ముఖ్యంగా సినీపరిశ్రమకు చెందిన వారు అణకువగానే ఉంటూ వచ్చారు. సినీహీరో నాగార్జునకు చెందిన ‘ఎన్‌ కన్వెన్షన్‌’ సెంటర్‌పైకీ, సీమాంధ్రులు అధికంగా నివసించే అయ్యప్ప సొసైటీలో నిర్మాణంలో ఉన్న భవనాలపైకీ మునిసిపల్‌ అధికారులను ఉసిగొల్పడం ద్వారా సీమాంధ్రులను కేసీఆర్‌ తన అదుపులోకి తెచ్చుకున్నారు. నాగార్జున వ్యవహారం తర్వాత సినీపరిశ్రమకు చెందిన పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కీర్తించడంలో బిజీగా ఉంటూ వస్తున్నారు.

Posted

ఆంధ్రా వార్తల దరిద్రం మాకెందుకు’ అన్న కేటీఆర్‌ ఇప్పుడు తమ సొంత పత్రికలో తెలుగుదేశంపార్టీ వ్యతిరేక వార్తలకు ప్రత్యేక స్థానం కేటాయించారు. తమ బెదిరింపులకు భయపడి తెలుగుదేశంపార్టీ తరఫున పోటీచేయడానికి కొంతమందైనా వెనుకంజ వేస్తారని భావించి ‘ప్రజావ్యతిరేకతకు భయపడి తెలుగుదేశంపార్టీ తరఫున పోటీచేయడానికి అభ్యర్థులు కూడా దొరకడం లేదని..’ ప్రచారం చేయడం మొదలెట్టారు.

Posted
ఏపీలో చంద్రబాబును ఓడించడానికై జగన్మోహన్‌రెడ్డిని, పవన్‌కల్యాణ్‌ను కలపాలని గవర్నర్‌ నరసింహన్‌తో పాటు.. కేసీఆర్‌ అండ్‌ కో ప్రయత్నిస్తున్నారని కొన్ని నెలలముందు ఇదే కాలమ్‌లో నేను చెప్పాను. ఇప్పుడు జనసేనాని పవన్‌కల్యాణ్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జగన్‌తో చేతులు కలపాల్సిందిగా తెలంగాణకు చెందిన వారినుంచి తనపై ఒత్తిళ్లు వచ్చాయని పవన్‌కల్యాణ్‌ స్వయంగా ప్రకటించారు. గవర్నర్‌ నరసింహన్‌కు పవన్‌కల్యాణ్‌పై హఠాత్తుగా ప్రేమ పుట్టుకు వచ్చినప్పుడే నాకు ఈ అనుమానం కలిగింది. చంద్రబాబునాయుడు ప్రధాని మోదీతో సఖ్యతగా ఉన్నంతకాలం గవర్నర్‌కు పవన్‌కల్యాణ్‌ గుర్తుకు రాలేదు. రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఆహ్వానించి హడావుడీ చేయలేదు. నరేంద్రమోదీ, చంద్రబాబు మధ్య దూరం పెరిగాక పవన్‌కల్యాణ్‌ను గవర్నర్‌ చేరదీస్తూ వచ్చారు. రాజ్‌భవన్‌కు ప్రత్యేకంగా పిలిపించుకొని చర్చలు జరిపారు. ఆ వెంటనే పవన్‌కల్యాణ్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మొదటిసారిగా కలిసి ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు.
 
పవన్‌కల్యాణ్‌ తమ మాట విని జగన్మోహన్‌రెడ్డితో చేతులు కలుపుతారని కేసీఆర్‌ అండ్‌ కో భావించినా కథ అడ్డం తిరిగింది. ఇకపై కేసీఆర్‌, కేటీఆర్‌ దృష్టిలో పవన్‌కల్యాణ్‌ దుష్మన్‌ మాత్రమే! 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...