snoww Posted March 26, 2019 Report Posted March 26, 2019 నవ్యాంధ్రకే తలమానికంగా.. 26-03-2019 09:24:22 నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో కీలక విమానాశ్రయం రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు.. 700 ఎకరాల భూ సేకరణతో సుసాధ్యం భూ సేకరణతో .. ఎయిర్‌పోర్టు మెగా విస్తరణ పర్వం ప్రధాన రాష్ర్టాలకు విమానయానం అనుసంధానం అంతర్జాతీయంగా .. సింగపూర్‌కు విమాన సర్వీసు.. లైన్లో దుబాయ్ ! విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నవ్యాంధ్రకే తలమానికంగా మారింది. కొన్ని దశాబ్దాల క్రితం నేవీ హెలికాఫ్టర్లకు షెల్టర్‌జోన్‌గా ఉండే ఈ విమానాశ్రయం.. రాష్ట్ర విభజన తర్వాత కొత్త సొబగులు అద్దుకుంది. రాజధాని అమరావతి పరిధిలో ఉండటం.. రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించి భూసేకరణ చేసి ఏఏఐ(ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా)కు అప్పగించింది. మహా విస్తరణ రూపం దాల్చింది. తర్వాత అనేక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడపడటంతో మహర్దశ పట్టింది. ప్రయాణికుల సంఖ్య ఏటా వృద్ధి చెందుతోంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి విమాన ప్రయాణికులు ఇక్కడకు రావడంతో నవ్యాంధ్రలో కీలక విమానాశ్రయంగా మారింది. ఆంధ్రజ్యోతి విజయవాడ: నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఐదేళ్లలో విజయవాడ(గన్నవరం) ఎయిర్‌పోర్టు రూపురేఖలే మారిపోయాయి. మెట్రో పాలిటన్ నగరాల విమానాశ్రయ వృద్ధిరేటు కంటే విజయవాడ విమానాశ్రయం నమోదు చేస్తున్న వృద్ధి ఎక్కువగా ఉంటోంది. ఈ విమానాశ్రయం మహా విస్తరణ రూపం దాల్చింది. రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో అవసరమైన భూములను అప్పగించడం, తగిన సహకారం అందిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైనిక అవసరాల కోసం నాటి బ్రిటీషు ప్రభుత్వం నిర్మించిన ఎయిర్‌పోర్టు ఇది. ఆ తర్వాత .. స్వాతంత్ర్యానంతరం ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఒక్కటి నడిచేది. నేవీకి చెందిన హెలికాప్టర్లకు షెల్టర్‌జోన్‌గా ఎయిర్‌పోర్టుగా ఉండేది. అలాంటి విమానాశ్రయంలో దశాబ్దం క్రితం ఒకే ఒక్క సర్వీసుగా కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్‌కు సర్వీసును నడిపేది. ఆ సంస్థ మూత పడిన తర్వాత పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. విభజన తర్వాత విమానాశ్రయానికి కొత్త సొబగులు వచ్చాయి. ప్రభుత్వ దూరదృష్టి రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం ఎయిర్‌పోర్టుకు భూసేకరణ చేసింది. 700 ఎకరాల భూములను విస్తరణ, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. రైతుల నుంచి అభ్యంతరాలు వచ్చినా సీఎం చంద్రబాబు అప్పట్లో వారిని హైదరాబాద్‌కు పిలిపించుకుని రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో సమానంగా గన్నవరం ప్రాంత రైతులకు కూడా ప్యాకేజీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో భూ సేకరణ సుసాధ్యమైంది. వీటిని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కు అప్పగించారు. సంస్థలకు ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం విమానయాన ఇంథనంపై ట్యాక్సులను తగ్గించడంతో ఆ సంస్థలకు ప్రోత్సాహకరంగా మారింది. ఇక్కడ నుంచి అనేక విమానయాన సంస్థలు పలు ప్రాంతాలకు సర్వీసులు ప్రారంభించాయి. స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా, ఇండిగో, ట్రూజెట్ వంటి అనేక సంస్థలు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఐదేళ్లుగా భారీ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి, ఆర్థిక రాజధాని ముంబయికి, పొరుగు రాష్ట్రం తెలంగాణలోని హైదరాబాద్, తమిళనాడులోని చెన్నై, కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు, కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్‌కు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ప్రాంతీయంగా విశాఖపట్నం, తిరుపతి, కడపకు సర్వీసులు ఉన్నాయి భూ సేకరణతో దశ తిరిగింది రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేయడంతో విజయవాడ విమానాశ్రయ దశ తిరిగింది. ఏఏఐ అధికారులు రూ. 143 కోట్ల వ్యయంతో పదిహేనేళ్ల అవసరాల తగ్గట్లు తాత్కాలికంగా ఇంటీరియం టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సీఎం చంద్రబాబు, నాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. శాశ్వత టెర్మినల్ బిల్డింగ్ త్వరగా చేపట్టాలని సీఎం చంద్రబాబు ఏఏఐ అధికారులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 700 ఎకరాల భూములను అప్పగించడంతో 2286 మీటర్లుగా ఉన్న రన్‌వేను 3360 మీటర్ల మేర రూ. 138 కోట్ల వ్యయంతో విస్తరించడానికి మార్గమేర్పడింది. ఆ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. ఏఏఐ రూ.611 కోట్ల వ్యయంతో ఇంటి గ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ స్థాయికి... ఖ్యాతి ఈ ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు ఎంతో కృషి చేశారు. అప్పట్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు సహకరించడంతో అంతర్జాతీయ స్థాయి వచ్చింది. దీంతో కస్టమ్స్, ఇమిగ్రేషన్ విభాగాలు కొలువు తీరాయి. అయినా విదేశాలకు విమాన సర్వీసులు నడపటానికి విమానయాన సంస్థలు భయపడుతున్న దశలో రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించింది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం, పొరుగు రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ప్రజలకు విజయవాడ ఎయిర్‌పోర్టు చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి భారీ సంఖ్యలో ఎన్నారైలు ఉన్నారు. వేలాది మంది ఏటా చదువుకోవడానికి విదేశాలకు వె ళుతుంటారు. ఉపాధి పనుల కోసం వేలాది సంఖ్యలో విదేశాలకు వెళ్లేవారు ఉన్నారు. వీరందరినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వమే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) ప్రాతిపదికన సింగపూర్‌కు విమాన సర్వీసు నడపాలని నిర్ణయించి టెండర్లు పిలిచింది. ప్రయాణికుల నుంచి అనూహ్య డిమాండ్ వచ్చింది. సింగపూర్‌కు ఇండిగో విమానయాన సంస్థ సర్వీసును ప్రారంభించగానే 90 - 95 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ఇది విజయవంతంకావడంతో దుబాయ్‌కు ఇదే విధానంలో సర్వీసును నడపడానికి టెండర్లు పిలిచింది. విజయవాడ విమానాశ్రయ ప్రగతి పథం : క్ర.సం సంవత్సరం ప్రయాణికుల రాకపోకలు 1. 2011 - 2012 1,57,531 2. 2012 - 2013 1,69,624 3. 2013 - 2014 1,95,714 4. 2014 - 2015 2,33,617 5. 2015 - 2016 4,04,464 6. 2016 - 2017 6,50,463 7. 2017 - 2018 8,57,000 8. 2018 - 2019 10,00,000 + (ఫిబ్రవరి నాటికి) ఎయిర్‌పోర్టులో.. మెగా ఇన్ఫ్రా ఇక్కడ మౌలిక సదుపాయాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్, లాజిస్టిక్ టెర్మినల్ బిల్డింగ్స్‌కు వెళ్లడానికి రెండు వరసల ప్రధాన రహదారి, ఇంటీరియం టెర్మినల్ బిల్డింగ్‌కు కొత్తగా నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌కు మరో రెండు వరసల ప్రధాన రహదారి నిర్మాణ పనులు చేపట్టింది. రూ.15 కోట్ల వ్యయంతో విమానాశ్రయ రూపురేఖలను మార్చటానికి ల్యాండ్‌స్కేపింగ్ పనులను చేపడుతున్నారు. గతంలో ఆరు పార్కింగ్ బేలు ఉండేవి. అదనంగా మరో పదింటి నిర్మాణం చేపట్టారు. కార్ల పార్కింగ్ ఏర్పాటుచేశారు. ఆస్ర్టియా దేశపు రెండు ఫైర్ఫైటర్లను రూ. 10 కోట్లతో కోనుగోలు చేశారు. రూ. కోటితో ఎయిర్‌పోర్టులో సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. గణనీయంగా ప్రయాణికుల వృద్ధి ఇక్కడ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నప్పటి నుంచి విమాన యాన సంస్థలు పోటాపోటీగా సర్వీసులను నడుపు తున్నాయి. ఏడాదికి 4,372 విమానాల ట్రిప్‌ల నుంచి మొదలై ప్రస్తుతం ఏడాదికి 15 వేలకు పైగా ట్రిప్స్ వేసే స్థాయికి ఎదిగింది. 2011 నుంచి 2014 వరకు రెండు లక్షల లోపే ఏడాదికి విమాన ప్రయాణికుల సంఖ్య ఉంటే.. 2014 నుంచి ఏటా రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల నాటికే ఒక మిలియన్(పది లక్షలు) ప్రయాణికులు రాకపోకలు సాగించడం గమనార్హం. గన్నవరానికి ప్రాధాన్యం విమానాశ్రయం అభివృద్ధి ఈ ఐదేళ్లలో శరవేగంగా జరిగింది. అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. దీంతో గన్నవరానికి ప్రాధాన్యం పెరిగింది. ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరిగాయి. భూములు ఇచ్చిన రైతులు సంతోషంగా ఉన్నారు. వీరికి రాజధానిలో ప్యాకేజీ కల్పించడంతో ఆనందంగా ఉంది. -బొబ్బా నాగేంద్రరావు, రైతు రూపురేఖలు మారిపోయాయి కార్పొరేట్ వరల్డ్ విజయవాడ రాకపోవడానికి కారణం ఏమిటా అనుకునేవాళ్లం. సరైన ఎయిర్‌పోర్టు లేకే అని గుర్తించాం. దేశంలో అనేక ఎయిర్‌పోర్టులను చూశాం. చూస్తుండగానే సాదాసీదా ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. కేంద్రం సహకరించి ఇంకా బాగా ఉండేది. - పొట్లూరి భాస్కరరావు, వ్యాపారవేత్త అంతర్జాతీయ సర్వీసులు.. సంతోషమే నాలుగేళ్లలో విమానాశ్రయం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. విశాఖతో పోల్చుకుంటే ఇక్కడ నుంచే ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. సింగపూర్‌కు విమాన సర్వీసు నడుస్తుంది. దుబాయ్‌కు విమాన సర్వీసు నడపాలి. -జి.వెంకటరావు, విశ్రాంత లెక్చరర్ Quote
solman Posted March 26, 2019 Report Posted March 26, 2019 emti uncle AP meda ina manchi news vestunavu Quote
snoww Posted March 26, 2019 Author Report Posted March 26, 2019 Quote ఇది విజయవంతంకావడంతో దుబాయ్‌కు ఇదే విధానంలో సర్వీసును నడపడానికి టెండర్లు పిలిచింది. aa tenders utter flop ayyayi ani eppudu mention sesthavu raa ABN Kitti gaa Quote
solman Posted March 26, 2019 Report Posted March 26, 2019 2 minutes ago, snoww said: aa tenders utter flop ayyayi ani eppudu mention sesthavu raa ABN Kitti gaa adhe kada jaffa gallu inta manchi post veydam endhi aa anukunee lopala prove chesukunavuu ventenaa Quote
snoww Posted March 26, 2019 Author Report Posted March 26, 2019 1 minute ago, solman said: adhe kada jaffa gallu inta manchi post veydam endhi aa anukunee lopala prove chesukunavuu ventenaa Airport pipes ki , roads ki extra security pettandi bro. Jagan , Bodi and Dora vachi cut sestharu malli Quote
snoww Posted March 26, 2019 Author Report Posted March 26, 2019 Just now, snoww said: Airport pipes ki , roads ki extra security pettandi bro. Jagan , Bodi and Dora vachi cut sestharu malli Chinna bob ki seppi AI use chesi Block Sain lo monitor seyyandi vaatini Quote
solman Posted March 26, 2019 Report Posted March 26, 2019 Just now, snoww said: Airport pipes ki , roads ki extra security pettandi bro. Jagan , Bodi and Dora vachi cut sestharu malli will do uncle... @pipliepay oka sari chudu aa pipe la matter Quote
TOM_BHAYYA Posted March 26, 2019 Report Posted March 26, 2019 4 minutes ago, snoww said: Airport pipes ki , roads ki extra security pettandi bro. Jagan , Bodi and Dora vachi cut sestharu malli Runway meedha speedbumper pettadanta jaggadu Quote
AlaElaAlaEla Posted March 26, 2019 Report Posted March 26, 2019 14 minutes ago, snoww said: aa tenders utter flop ayyayi ani eppudu mention sesthavu raa ABN Kitti gaa ప్రతి కార్యకర్తా సైనికుడిలా పోరాడాలి టీడీపీ గెలుపును ఆపలేరు ‘మీ భవిష్యత్తు-నా బాధ్యత’ నినాదం మార్మోగాలి.... #voteforcycle #TDPmission150 #మీభవిష్యత్తునాబాధ్యత #మళ్ళీనువ్వేరావాలి #BabuAgain #AmmoJagan Quote
snoww Posted March 26, 2019 Author Report Posted March 26, 2019 3 minutes ago, AlaElaAlaEla said: jai cbn Aathma Gouravam aa Siggu Sharam lekunda , samayam samdharbam choodakunda Hari Krishna Shavam daggara alliance kosam begging sesi Dora tho chee kottinchukunna Aathma Gouravam aa Quote
AlaElaAlaEla Posted March 26, 2019 Report Posted March 26, 2019 17 minutes ago, snoww said: Aathma Gouravam aa Siggu Sharam lekunda , samayam samdharbam choodakunda Hari Krishna Shavam daggara alliance kosam begging sesi Dora tho chee kottinchukunna Aathma Gouravam aa Quote
AlaElaAlaEla Posted March 26, 2019 Report Posted March 26, 2019 17 minutes ago, snoww said: Aathma Gouravam aa Siggu Sharam lekunda , samayam samdharbam choodakunda Hari Krishna Shavam daggara alliance kosam begging sesi Dora tho chee kottinchukunna Aathma Gouravam aa #TDPMission150 #BabuAnteneNammakam #BabuThoneBharosa #మీభవిష్యత్తుమాభరోసా #మళ్ళీనువ్వేరావాలి #మీభవిష్యత్తునాబాధ్యత #VoteForCycle #YourFutureMyResponsibility #CBNforBetterFuture #CBNAgain4BetterFuture Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.