snoww Posted March 28, 2019 Report Share Posted March 28, 2019 ఏప్రిల్ 8న ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాను విడుదల చేస్తాం: కేతిరెడ్డి 28-03-2019 23:18:31 ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాను ఏప్రిల్ 8న విడుదల చేస్తున్నట్లు దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. కాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై ఏప్రిల్ 3 వరకు ఏపీ హైకోర్టు స్టే విధించింది. అయితే తెలంగాణలో మాత్రం ఈ సినిమా యథావిధిగా మార్చి 29న (శుక్రవారం) విడుదల కానుంది. అటు ‘లక్ష్మీస్ వీరగ్రంథం’పై కూడా ఏపీలో పలువురు ఫిర్యాదు చేశారు. అయితే ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాను ఏప్రిల్ 8న కచ్చితంగా విడుదల చేస్తామని కేతిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ వల్ల ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఏపీలో విడుదల కాదని గతంలోనే కేతిరెడ్డి తెలిపారు. కాగా లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం టీజర్, టైలర్కు విశేష స్పందన లభించింది. Quote Link to comment Share on other sites More sharing options...
Sanathnagar_Satthi Posted March 29, 2019 Report Share Posted March 29, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
Gudiwada_Bidda Posted March 29, 2019 Report Share Posted March 29, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.