snoww Posted April 1, 2019 Report Posted April 1, 2019 లోక్‌నీతి-సీఎస్ డీఎస్ సర్వే అంచనా! టీడీపీకి 126 నుంచి 135 సీట్లు వైసీపీ 45-50 స్థానాలకే పరిమితం చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం కలిసి వచ్చిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కొనసాగాలనే అభిప్రాయం జగన్‌పై సన్నగిల్లుతున్న నమ్మకం వివేకా హత్య, కేసులతో దెబ్బ సర్వే నివేదికలో సునిశిత విశ్లేషణ న్యూఢిల్లీ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఏపీలో మళ్లీ తెలుగుదేశానిదే అధికారమని ‘లోక్‌నీతి-సీఎ్‌సడీఎస్’ సర్వే స్పష్టం చేసింది. ఇప్పటిదాకా అనేక జాతీయ మీడియా సంస్థలు వైసీపీదే గెలుపు అని చెబుతుండగా... మొట్టమొదటిసారి ‘టీడీపీదే హవా’ అనే అంచనాలు వెలువడ్డాయి. ఏబీపీ చానల్ కోసం లోక్‌నీతి-సీఎ్‌సడీఎస్ ఈ సర్వే చేసినట్లు తెలిసింది. దీని ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ టీడీపీ బంపర్ మెజారిటీతో విజయం సాధించనుంది. టీడీపీ 126 నుంచి 135 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ఈ సర్వే అంచనా వేసింది. వైసీపీ 45 నుంచి 50 స్థానాలకు పరిమితమవుతుందని తేల్చింది. ఇక... 25 ఎంపీ సీట్లలో టీడీపీ 18 నుంచి 22 వరకు గెలుచుకుంటుందని, వైసీపీ 3 నుంచి 5 వరకు నెగ్గుతుందని లోక్‌నీతి-సీఎ్‌సడీఎస్ స్పష్టం చేసింది. జనసేన 2 నుంచి 5 వరకు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించవచ్చునని తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రంలో ఖాతా తెరిచే అవకాశం లేదని తేల్చింది. తెలుగుదేశం పార్టీకి 46.2 శాతం ఓట్లు లభిస్తాయని లోక్‌నీతి-సీఎ్‌సడీఎస్ అంచనా వేసింది. వైసీపీకి 37.2 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. మళ్లీ బాబు ఎందుకంటే... అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన కొనసాగాలనే భావన. జగన్, పవన్‌లతో పోల్చితే చంద్రబాబు నాయకత్వంపైనే ఎక్కువ విశ్వాసం. రైతులకు సహాయం చేసే అన్నదాత సుఖీభవ, డ్వాక్రా మహిళలకు ‘పసుపు కుంకుమ’, రూ.5కే భోజనం పెట్టే అన్న క్యాంటీన్, పింఛన్లు, చంద్రన్న బీమా, ఆటోలు, ట్రాక్టర్లపై జీవితకాల పన్ను ఎత్తివేత... మరిన్ని సంక్షేమ పథకాల ప్రభావం. పోలవరం నిర్మాణం, నదుల అనుసంధానం, రాజధాని అమరావతి నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ, కియ వంటి కంపెనీల రాక, మౌలిక సదుపాయాల కల్పనలో చంద్రబాబు సామర్థ్యం! ...చంద్రబాబు పట్ల ఓటర్లు మొగ్గుచూపడానికి ఇవే కారణాలని సీఎ్‌సడీఎస్-లోక్‌నీతి తెలిపింది. వైసీపీపై ఎందుకు వ్యతిరేకత? జగన్‌పై మనీలాండరింగ్ నుంచి క్విడ్‌ప్రోకో వరకు అనేక కేసులు ఉన్నాయి. దీనివల్ల పాదయాత్ర ఫలితం కూడా లభించలేదు. చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత జరిగిన పరిణామాలు జగన్‌పై నమ్మకాన్ని మరింత తగ్గించాయి. రెండేళ్లుగా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించడాన్ని ప్రజలు హర్షించడంలేదు. ... వీటన్నింటి నేపథ్యంలో జగన్‌ను ప్రజలు విశ్వసించడంలేదని లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ తెలిపింది. ఇక, జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ఇంకా మారలేదని అభిప్రాయపడింది. సర్వే చేసిందిలా... మార్చి 11 నుంచి 19వ తేదీ మధ్య ఈ సర్వే నిర్వహించారు. మొత్తం 26,724 మంది ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇందులో 12029 మంది మహిళలు. అన్ని వయసుల ఓటర్లను పరిగణనలోకి తీసుకుని ప్రశ్నించారు. Quote
snoww Posted April 1, 2019 Author Report Posted April 1, 2019 Quote లోక్‌నీతి-సీఎస్ డీఎస్ సర్వే అంచనా! 1 Quote
snoww Posted April 1, 2019 Author Report Posted April 1, 2019 Just now, snoww said: ABN Boothu Kitti gaa Quote
bhaigan Posted April 1, 2019 Report Posted April 1, 2019 11 minutes ago, snoww said: ilanti surveys nammakandi Quote
caesar Posted April 1, 2019 Report Posted April 1, 2019 Nammandi nammandi, only red media saakshi and Gulabi media news maathramey nammandi... Quote
Android_Halwa Posted April 1, 2019 Report Posted April 1, 2019 Odiyamma... Lagadapati survey ante public kodtunaru ani ipudu CSDS Survey anta Indaka national news la chusina ie Survey kosam kani ekada dorakaledu... akariki fame surveys peru ni vaduktaleru kada Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.