snoww Posted April 2, 2019 Report Posted April 2, 2019 అందుకే నేను పెళ్లి చేసుకోలేదు: మాయావతి దిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఇంతవరకు వివాహం చేసుకోలేదు. అయితే ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి బయటకు చెప్పడానికి దాదాపుగా ఇష్టపడరు. కానీ మంగళవారం సుప్రీం కోర్టు దాఖలు చేసిన అఫిడవిట్‌లో మాత్రం దీని గురించి ప్రస్తావించారు. అమె ఎందుకు వివాహానికి దూరంగా ఉన్నారో వివరించారు. మాయా యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె విగ్రహాలు, బీఎస్పీ గుర్తయిన ఏనుగు విగ్రహాలను అక్కడక్కడా ఏర్పాటు చేశారు. అయితే వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మయావతి తన విగ్రహాలు కట్టించుకున్నారని ఆరోపిస్తూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై మాయా స్పందిస్తూ కోర్టులో నేడు అఫిడవిట్ దాఖలు చేశారు. ‘అధికారం చెలాయించే వారి చెర నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని నేను ఎన్నో ఏళ్ల కిందట నిర్ణయించుకున్నాను .వారి అభ్యున్నతి కోసం నాజీవితాన్ని త్యాగం చేశాను. అందుకే నేను పెళ్లి చేసుకోలేదు. నిరుపేదల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఓ దళిత మహిళ గౌరవార్థం ప్రజలే విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు’ అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రజాధనాన్ని పార్టీ ప్రచారం కోసం ఖర్చు చేశారన్న పిటిషన్ దారు వాదనను దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణ చేపట్టింది. ప్రజాధనాన్ని ఉపయోగించి మాయావతి తన విగ్రహాలు, పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేసినందుకు గాను ఆమె డబ్బు డిపాజిట్ చేయాల్సిందేనంటూ తీర్పిచ్చింది. అనంతరం ఈ కేసును ఏప్రిల్ 2కు వాయిదా వేసింది.ఈ కేసు నేడు మరోసారి విచారణకు రాగా.. మాయావతి అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రజల కోరిక మేరకే విగ్రహాలు ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. ఈ విగ్రహాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయని గతంలో మాయావతి పేర్కొన్న విషయం తెలిసిందే. Quote
reality Posted April 2, 2019 Report Posted April 2, 2019 Idhi nithya pellikoduku tho alliance... whatta combination Quote
MuPaGuNa Posted April 2, 2019 Report Posted April 2, 2019 ee paapa p.susheela statue of unity meeda chesina comments mari..political game antivi , money waste antivi..... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.