vatsayana Posted April 3, 2019 Report Posted April 3, 2019 https://telugu.gulte.com/tnews/32548/- ఇతర రాజకీయ నాయకులతో పోలిస్తే.. పవన్‌కల్యాణ్ పొలిటికల్ స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. తాను చెప్పాలనుకున్నది సూటిగా సుత్తిలేకుండా చెప్తారు. అదే టైమ్‌లో కాస్త గంభీరంగా కన్పిస్తారు. అలాంటి పవన్‌కల్యాణ్ నిన్నటికి నిన్న అందరూ ఆశ్చర్యపోయే రీతిలో ప్రవర్తించారు. మాయావతి రాగానే ఆమె కాళ్లకు నమస్కారం చేశారు. గతంలో పవన్ నుంచి ఇలాంటి బిహేవియర్ ఎప్పుడూ చూడేలేదు. అంతెందుకు పవన్ గతంలో మోడీ, చంద్రబాబుని కలిశారు. ఎప్పుడూ వారి కాళ్లపై పడలేదు. ఇక తనకంటే వయసులో పెద్దవాళ్ల అయిన కమ్యూనిస్టు లీడర్లు అయిన రామకృష్ణ, మధుకు నమస్కారం పెడతారు తప్ప ఎప్పుడూ కాళ్లపై పడింది లేదు. అలాంటిది ఏంటీ సడన్‌గా పవన్‌లో ఇంతమార్పు అంటే.. దానికి కొన్ని పక్కా లెక్కలున్నాయి. ముందుగా మనం పవన్ యాంగిల్‌లో ఆలోచిస్తే.. అతి సాధారణ దళిత కుటంబం నుంచి వచ్చిన మాయావతి దేశంలో అతిపెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. అవ్వడమే కాదు.. సమాజ్‌వాదీ లాంటి పార్టీ తట్టుకుని ఆమె నిలబడ్డారు. ఆ పోరాట తత్వమే పవన్‌ని ఆకర్షించింది. అన్నింటికి మించి దేశంలో ఉన్న దళిత నాయకుల్లో అగ్రస్థానం మాయావతిదే. అందుకే పోరాట యోధురాలైన మాయావతికి గౌరవంగా పాదాభివందనం చేశాడు. మరోవైపు.. ప్రతిపక్షం మాత్రం మరోలా పవన్‌ని దుయ్యబడుతున్నాయి. దళిత నేతగా మాయావతిగా మంచి పేరుంది. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. దళిత ఓట్లని ఆకర్షించడానికి పవన్ ఈ విధంగా చేస్తున్నాడని ఆరోపించేవాళ్లూ లేకపోలేదు. ఏపీలో చాలా నియోజకవర్గాల్లో దళితుల ఓట్లు చాలా కీలకం. కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని దళిత ఓటుబ్యాంక్ డిసైడ్ చేయగలరు. అంతేకాకుండా ఆమె కాళ్లకు పాదాభివందనం చేయడం ద్వారా తనకు అందరూ సమానమే అని.. తాను దళితుల పక్షపాతి అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. దీనిద్వారా దళితుల మెప్పు మాత్రమే కాదు.. బీసీల మెప్పు కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా.. మాయవతికి పాదాభివందంనం చేసి అందర్ని ఆశ్చర్యానికి గురిచేశారు పవన్. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.