vatsayana Posted April 3, 2019 Report Posted April 3, 2019 https://telugu.gulte.com/tnews/32554/- పవన్‌కళ్యాణ్ ఒంటరి పోరాటం చేస్తోంటే, ఆయన పార్టీ తరఫున ప్రచారం చేయడానికి ఒక్క మెగా హీరో కూడా కదిలి రావడం లేదని అభిమానులు గుస్సా అవుతున్నారు. పవన్‌కళ్యాణ్ కోసం ప్రచారం చేయడం మాట అటుంచి కనీసం మాట వరసకి అయినా సోషల్ మీడియా ద్వారా అయినా మద్దతు ఇవ్వడం లేదని చరణ్, వరుణ్ తదితరులపై పవన్ ఫాన్స్ మండి పడుతున్నారు. కారణం ఏమిటో గానీ మెగా హీరోలు అందరూ జనసేన విషయంలో గప్‌చుప్‌గా వుంటున్నారు. అయితే మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల మాత్రం తన తండ్రి, బాబాయ్ కోసం కదిలి వచ్చింది. నర్సాపురం ఎంపీ నాగబాబు తన తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పోటీ చేస్తోన్న భీమవరంలో ప్రచారం చేస్తున్నపుడు నిహారిక తండ్రి పక్కన నిలబడింది. భారీ స్టేట్‌మెంట్లు ఏమీ ఇవ్వలేదు కానీ తండ్రి, బాబాయ్ గెలుపుని కాంక్షించింది. నాగబాబు భార్య కూడా ఆయన కోసం నియోజికవర్గంలో జోరుగా ప్రచారం చేస్తుండగా, ఆయన తనయుడు వరుణ్ తేజ్ మాత్రం రాజకీయాలకి, తెలుగు రాష్ట్రాలకీ చాలా దూరంగా విదేశాల్లో తదుపరి చిత్రం కోసం కసరత్తులు చేసే పనిలో బిజీగా వున్నాడు. మెగా హీరోల కంటే నిహారిక నయం అని సోషల్ మీడియాలో 'సూర్యకాంతం'పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. Quote
solman Posted April 3, 2019 Report Posted April 3, 2019 akkada adhi vachindhi dani babu kosam.. not for PK ani @ARYA uncle telling Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.