vatsayana Posted April 3, 2019 Report Share Posted April 3, 2019 https://www.ap7am.com/flash-news-644913-telugu.html ఎవరేం చేయాలో చెప్పడానికి విజయసాయిరెడ్డి ఎవరు? ఎవరైనా బాబుకు లేదా జగన్ కు ఊడిగం చేయాలి లేకపోతే, వాళ్లను అవకాశవాదిగా చిత్రీకరిస్తారు టీడీపీతో జనసేన పార్టీ ముసుగులో పొత్తు పెట్టుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల ఓ వ్యాఖ్య చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విశాఖపట్టణం జిల్లాలోని గాజువాక, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రచారం నిర్వహించి, పవన్ పై విమర్శలు చేయాలని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ విషయమై ‘టీవీ 99’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ని ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ, అసలు, ఎవరేం చేయాలో చెప్పడానికి విజయసాయిరెడ్డి ఎవరు చెప్పడానికి, ఆయన పని ఆయన చూసుకోవాలని హితవు పలికారు. ఏ పార్టీ ఎలా ఉండాలో చెప్పడాని విజయసాయిరెడ్డి, జగన్, చంద్రబాబు ఎవరు చెప్పడానికి? అని ప్రశ్నించారు. పిచ్చిమాటలు మాట్లాడేవారికి కాలమే తగిన సమాధానం చెబుతుందని అన్నారు. చంద్రబాబుకు లేదా జగన్ కు ఊడిగం చేయకపోతే ఎవరినైనా అవకాశవాదిగానే చిత్రీకరిస్తారని, ‘మేము ఏంటో వీళ్లిద్దరికీ చూపిస్తా’ అని పవన్ వ్యాఖ్యానించారు. Quote Link to comment Share on other sites More sharing options...
LastManStanding Posted April 3, 2019 Report Share Posted April 3, 2019 panendi ? Visas ivvatama ? Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.