vatsayana Posted April 3, 2019 Report Share Posted April 3, 2019 https://telugu.gulte.com/tnews/32559/- కొన్ని నెలల కిందట ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద కొంచెం గట్టిగానే విమర్శలు చేశాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఐతే మధ్యలో కొంచెం స్వరం తగ్గినట్లు అనిపించింది. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేసుకున్న పవన్.. బాబు మీద ఫోకస్ తగ్గించాడు. ఐతే చంద్రబాబుతో పవన్ లాలూచీ పడ్డారని, పెద్దగా విమర్శించట్లేదని.. బాబు కూడా పవన్ మీద మెతకగా వ్యవహరిస్తున్నారని జగన్ అండ్ కో ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఎన్నికలు సమీపిస్తుండగా ఇటు చంద్రబాబు.. అటు పవన్ ఒకరినొకరు కొంచెం గట్టిగానే విమర్శించుకుంటున్నారు. పరస్పరం సెటైర్లు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ వ్యవహారాన్ని గుర్తు చేస్తూ అతనెప్పుడూ అత్తారింటికి మాత్రమే వెళ్తాడని.. అతడికి అదే పని అని చంద్రబాబు నిన్న సెటైర్ వేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యక్తిగత వ్యాఖ్య జనసేన మద్దతుదారులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఐతే చంద్రబాబును పవన్ ఏమీ తేలిగ్గా వదిలిపెట్టలేదు. తాజాగా ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో బాబు మీద పవన్ పంచ్‌లు బాగానే పేల్చాడు. మీరు రైతులకు అన్ని వేలిస్తాం.. వృద్ధులకు అన్ని వేలిస్తాం అంటూ భారీ హామీలు ఇస్తున్నారు కదా.. ఈ హామీలన్నీ అమలు చేయాలంటే భారీ బడ్జెట్ అవసరం అవుతుంది కదా అని పవన్‌ను అడిగితే.. చంద్రబాబు సర్కారు పుష్కరాల పేరుతో 2 వేల కోట్లు తగలబెట్టిందని.. ఇలా డబ్బులు తగలేయకుంటే ఎన్ని హామీలైనా అమలు చేయొచ్చని పవన్ బాబుకి ఒక బ్లాస్టింగ్ పంచ్ ఇచ్చాడు. మరి ఇంతకుముందు బాబుకి మీరు మద్దతు ఇచ్చారు కదా అని అడిగితే.. ఆయనకు అనుభవం ఉంది, రాష్ట్రాన్ని బాగు చేస్తారని ఇచ్చానని.. ఐతే అధికారం చేపట్టిన తర్వాత ఏడాదిన్నర వరకు బాబు పని తీరు చూస్తే నచ్చలేదని.. దీంతో నేరుగా ఆయన దగ్గరికే వెళ్లి తప్పులు జరుగుతున్నాయని, అవినీతి జరుగుతోందని చెప్పానని.. కానీ ఆయన పట్టించుకోలేదని.. దీంతో ఆయనకు మద్దతు ఉపసంహరించుకుని పోరాటం మొదలుపెట్టానని పవన్ చెప్పాడు. టీడీపీతో జనసేన కుమ్మక్కయిందన్న జగన్ ఆరోపణల గురించి ప్రస్తావించగా.. ఆయనకు మద్దతు ఇవ్వలేదన్న కడుపుమంటతో ఈ మాటలంటున్నారని పవన్ తేల్చేశాడు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.