vatsayana Posted April 5, 2019 Report Share Posted April 5, 2019 https://telugu.gulte.com/tmovienews/32615/Sunny-Leone-recalls-the-ark-side-of-her-life-with-Karenjit-Kaur-shooting సన్నీ లియోన్ అందరికీ ఒక శృంగార తారగానే గుర్తుంటుంది. పోర్న్ సినిమాల్లో నటించడం వల్ల ఆమె మీద జనాలకు కొన్ని అభిప్రాయాలు బలపడిపోయాయి. పోర్న్ సినిమాలు దశాబ్దం కిందటే మానేసినా వాటి తాలూకు ఇమేజ్ మాత్రం సన్నీని విడిచి పోలేదు. ఆమెను ఆ కోణంలోనే చూస్తూ.. తనపై రకరకాల కామెంట్లు చేస్తుంటారు జనాలు. కానీ సన్నీలోని వేరే కోణాలు జనాలకు తెలియవు. ఆమె ఏ పరిస్థితుల్లో పోర్న్ సినిమాల వైపు అడుగులేసింది.. ఆర్థికంగా నిలదొక్కుకున్నాక ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నది జనాలకు పట్టదు. ఆమె జీవితంలోని విషాదకర కోణాల గురించీ జనాలు పట్టించుకోరు. ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సన్నీ ఈ కోణాలన్నింటినీ బయటపెట్టింది. చాలా ఎమోషనల్‌గా సాగిన ఆ ఇంటర్వ్యూలో సన్నీ ఏమందంటే.. ‘‘నా జీవితంలో చీకటితో కూడిన కొన్ని సంఘటనల్ని గుర్తు చేసుకోవడం అంత సులభం కాదు. అది ఓ పీడకల. మా అమ్మ చనిపోయిన తర్వాత నాన్నకు క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆయన కూడా కొన్ని రోజులకే మృతి చెందారు. అప్పుడు నేను నరకయాతన అనుభవించాను. తొలిసారి ఇండియాకు వచ్చినపుడు బాధాకర పరిస్థితుల్ని ఎదుర్కొన్నా. మళ్లీ ఆ రోజుల్ని గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ‘కరణ్‌జీత్ కౌర్’ షూటింగ్ సమయంలో పాత రోజుల్ని తలచుకుని ఎంతో కుమిలిపోయాను. తల్లిదండ్రుల్ని కోల్పోవడం నన్ను ఎంతో వేదనకు గురి చేసింది. అలాగే నా గత జీవితం నన్ను వెంటాడింది. కానీ ఈ పరిస్థితులన్నింటినీ అధిగమించి జీవితంలో ముందుకు సాగుతున్నాను’’ అని సన్నీ చెప్పింది. తాను దత్తత తీసుకున్న నిషా గురించి సన్నీ చెబుతూ.. ‘‘నిషాకు పెయింటింగ్ అంటే ఇష్టం. తన కోసం ఆర్ట్ టీచర్ ఉన్నారు. తనే ఇంటికి వచ్చి నిషాకు పెయింటింగ్ నేర్పిస్తుంటారు. రెండున్నరేళ్ల వయసులోనే తను పెయింటింగ్ బ్రెష్ పట్టుకునే విధానం, చేతులు-కళ్ల కో ఆర్డినేషన్, రంగులు చూసినప్పుడు స్పందించే తీరు అద్భుతం. మా కవల పిల్లలతో తను చక్కగా ఆడుకుంటోంది’’ అని సన్నీ తెలిపింది. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.