Jump to content

Recommended Posts

Posted

https://www.ap7am.com/flash-news-645235-telugu.html

tnews-d70d696c7222de2a1b84d95c0fa8d785a1

  • మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్
  • చేయగలిగిన అంశాలను మాత్రమే చెబుతున్నా
  • అన్నీ నెరవేర్చి మరోసారి ఓటు అడుగుతా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విడుదల చేశారు. తమ మేనిఫెస్టో 2014లో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలా కులానికో పేజీతో, 650 హామీలతో పెద్ద పుస్తకంలా ఉండదని చెప్పారు. ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చని చంద్రబాబులా కాకుండా, ప్రజలకు తాను చేయబోయే అంశాలతో మాత్రమే దీన్ని తయారు చేశామని, ఐదేళ్ల తరువాత ఇవే హామీలను తాను నెరవేర్చానని చెబుతూ, మరోసారి ఓటు అడిగేలా ఉంటుందని అన్నారు. 

వైసీపీ మేనిఫెస్టో కొత్త అధ్యాయానికి తెరలేపేలా ఉంటుందని చెప్పారు. ఉగాది సందర్భంగా మేనిఫెస్టోను విడుదల చేస్తుండటం ఎంతో ఆనందదాయకమని, కొత్త యుగానికి, కొత్త అధ్యాయానికి నాంది పలికే రోజు ఇదని అన్నారు. ఓ పెద్ద పాంప్లెట్ సైజ్ లో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించారు. గతంలో జగన్ ప్రకటించిన నవరత్నాలన్నీ ఇందులో వున్నాయి. 

మేనిఫెస్టో ముఖ్యాంశాలు...

* ప్రతి రైతు కుటుంబానికీ పెట్టుబడి కోసం రూ. 50 వేలు.
* పంట వేసే సమయానికే మే నెలలో రూ. 12,500.
* పంట బీమా కోసం చెల్లించాల్సిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది.
* ఉచిత బోర్లు, పగటి పూట 9 గంటల కరెంట్, ఆక్వా రైతులకు యూనిట్ రూ. 1.50కే విద్యుత్.
* రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు.
* పంట వేసే ముందే రేటు, గిట్టుబాటు ధరకు గ్యారంటీ.
* రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తు నిధి.
* ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగి.
* రెండో ఏడాది నుంచి సహకార రైతుకు పాలు ఇచ్చే పాడి రైతుకు లీటరుకు రూ. 4 బోనస్.
* ప్రమాదమైనా, ఆత్మహత్య అయినా రూ. 7 లక్షల బీమా.
* ఆ డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టం.
* కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు. పంటకు సంబంధించిన రాయితీలు, ప్రయోజనాలు.
* వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ అమలు.
* అన్ని వర్గాలకూ వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే పథకం అమలు.
* ఎన్ని లక్షలు ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది.
* ఏ ప్రాంతంలో చికిత్స చేయించుకున్నా ఉచితమే.
* చికిత్స తరువాత కోలుకునేంత వరకూ కుటుంబానికి సాయం.
* పిల్లల చదువులన్నీ ఉచితం.
* బిడ్డను బడికి పంపే తల్లికి సంవత్సరానికి రూ. 15 వేలు.
* పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు వసతి కోసం విద్యార్థికి ఏటా రూ. 20 వేలు.
* పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గింపు.
* వికలాంగులకు, వృద్ధులకు రూ. 3 వేల పెన్షన్.
* ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు.
* స్థలం లేని వారికి ఉచిత స్థలం. మహిళల పేరిట రిజిస్ట్రేషన్.
* ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ అలుపెరగని పోరు.
* ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు.
* 50 ఇళ్లకు ఒకరి చొప్పున నెలకు రూ. 5 వేల గౌరవ వేతనంతో వాలంటీర్ల నియామకం.
* అన్ని ప్రభుత్వ పథకాలనూ ఇంటి వద్దకే చేరుస్తాం.
* ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటు
* గవర్నమెంట్ కాంట్రాక్టులు నిరుద్యోగ యువతకు ఇచ్చేలా చట్ట సవరణ.
* సబ్సిడీపై యువతకు కావాల్సిన మౌలిక వసతులు.
* వైఎస్ఆర్ ఆసరా ద్వారా మహిళల రుణాలు దశలవారీగా మాఫీ
* మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు.
* మూడు దశల్లో మద్యపాన నిషేధం.
* మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ కు మాత్రమే పరిమితం చేస్తాం.
* అగ్రీ గోల్డ్ బాధితులకు రూ. 1100 కోట్ల కేటాయింపు.
* తిరుమల శ్రీవారి ఆలయం తలుపులను సన్నిధి గొల్లలు తెరిచే సంప్రదాయ పునరుద్ధరణ.
* సొంత ఆటో, టాక్సీ నడిపేవారికి సంవత్సరానికి రూ. 10 వేలు.
* 18 నుంచి 60 ఏళ్ల వయసువారికి రూ. లక్ష బీమా
* సహజమరణమైనా కుటుంబానికి ఆ డబ్బు చెల్లిస్తాం.
* ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు పారదర్శకంగా ఉండేలా చూస్తాం.
* ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తాండాల్లో ఏడాదికి 2 వేల యూనిట్ల ఉచిత కరెంట్ లేదా రూ. 6 వేలు.
* ప్రతి ఐటీడీఏ పరిధిలో ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
* గిరిజనులకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన అన్ని హామీల అమలు.
* మాతృభాష పరిరక్షణకై విద్యార్థులకు తెలుగు తప్పనిసరి.
* జర్నలిస్టులకు వారి ప్రాంతాల్లోనే ఇంటి స్థలాలు.
* అర్చకుల పదవీ విరమణ నిబంధన రద్దు.
* అర్చకులకు ఇళ్ల స్థలాల కేటాయింపు.
* దేవాలయాల్లో ధూప, దీప నైవేద్యాల కోసం నిధులు.
* దేవాలయాలకు పంచాయతీ జనాభా ప్రకారం రూ. 10 వేల నుంచి రూ. 35 వేలు.
* మైనారిటీల ఆస్తులను సర్వే చేయించి డిజిటలైజేషన్.
* ప్రభుత్వ ఉద్యోగుల ఇబ్బందులు తొలగించేందుకు కృషి.
* సీపీఎస్ ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ.
* ఉద్యోగులు కోరుకున్న విధంగా 26 శాతం ఐఆర్, సకాలంలో పీఆర్సీ అమలు.
* అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్.
* సీనియారిటీ, అర్హతలను బట్టి రెగ్యులరైజేషన్.
* పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు.
* ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునే స్నేహపూర్వక వాతావరణం.
* అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు తెలంగాణ ఇస్తున్న వేతనం కన్నా రూ. 1000 అదనంగా జీతం.
* ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలం లేకుంటే, వారి ప్రాంతంలో ఇళ్ల స్థలం.
* పరిశ్రమల కోసం మరిన్ని ప్రోత్సాహకాలు.
* నిరుద్యోగ యువకులకు సబ్సిడీ ఇచ్చి పరిశ్రమలు పెట్టిస్తాం.

Posted
Just now, DrBeta said:

Laksha kotlu bhi free iyyarade? 

Ila all free ani chupinchi.. Inko laksha kotlu dochukune bapathu.. endhuku isthad laksha kotlu vaapas 

Posted
2 minutes ago, DrBeta said:

Laksha kotlu bhi free iyyarade? 

Nee pellam fuk free iyarade

Posted
Just now, cosmopolitan said:

Ila all free ani chupinchi.. Inko laksha kotlu dochukune bapathu.. endhuku isthad laksha kotlu vaapas 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...