Jump to content

Recommended Posts

Posted
Ravali Jagan Kavali Jagan Song History Creates In Youtube - Sakshi

యూట్యూబ్‌లో కోటిన్నర వ్యూస్‌ సాధించిన ‘రావాలి జగన్‌’ పాట

సామాజిక మాధ్యమాల్లో సంచలనం రేపుతున్న ప్రచార గీతం

క్షణక్షణానికి పెరిగిపోతున్న వ్యూస్‌..

పార్టీ ప్రచారగీతం ఈ స్థాయిలో ఆకర్షించడం ఆల్‌టైం రికార్డ్‌

సాక్షి, హైదరాబాద్‌: స్టార్‌ హీరోల టీజర్స్‌, సినిమా ట్రైలర్స్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేయడం ఈరోజుల్లో కామన్‌. కానీ వాటికి అతీతంగా ఓ రాజకీయ నాయకుడికి సంబంధించిన పొలిటికల్‌ సాంగ్‌ సోషల్‌ మీడియాలో సంచలనం రేపడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి రేర్‌ రికార్డ్‌ను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సొంత చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ రూపొందించిన ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ ప్రచార గీతం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన మారుమోగుతోంది. వైఎస్‌ జగన్‌ అభిమానులకు ఈ పాట తారకమంత్రంగా మారింది. అందుకే ఆ జోష్‌ యూట్యూబ్‌ వ్యూస్‌లో స్పష్టంగా కనిపిస్తోతోంది.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిన ఈ గీతం.. సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్‌ అవుతూ, సంచలనం రేపుతోంది. ఆదివారం నాటికి  యూట్యూబ్‌లో ఈ పాటను వీక్షించిన వారి సంఖ్య కోటిన్నరకు దాటి సరికొత్త చరిత్రను లిఖించింది. మార్చి 8న విడుదలైన ఈ పాట దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ ప్రచారగీతం ఈ స్థాయిలో ఆకర్షించడం ఆల్‌టైం రికార్డుగా చర్రిలొకెక్కింది. ప్రఖ్యాత సినీ రచయిత సుద్దాల అశోక్‌తేజ రచించిన ఈ పాటకు ఫిదా చిత్ర సంగీత దర్శకుడు శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం సమకూర్చగా.. గాయకుడు మనో ఆలపించారు. ఇప్పటికే ఈ పాటకు వస్తున్న ఆదరణపై జాతీయ ఆంగ్ల చానెళ్లు సైతం ప్రత్యేక కథనాలను ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.

గతంలో నిన్ను నమ్మం బాబు అని చంద్రబాబు మోసపూరిత పాలన గురించి పాటను రూపొందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ఎందుకు రావాలో ఈ పాటలో వివరించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే కార్యక్రమాలను పాట ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ వీడియోకు వస్తున్న అశేష స్పందన.. రానున్న ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్‌ సీపీ ఘన విజయానికి సంకేతమని పరిశీలకులు చెబుతున్నారు. వైఎస్‌ జగన్‌కు ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందన్నది ఈ వీడియో సృష్టించిన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా యువత ఎక్కువగా యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుంటారు.

Posted

15 million ey gaa. Rowdy baby 350 million akkada

Posted
12 minutes ago, Vaampire said:

15 million ey gaa. Rowdy baby 350 million akkada

Political songs ki 15 million chala ekkuva

Posted

This song is one of  the biggest plus points for YSRCP. Dummu leparu....

Posted
1 hour ago, JambaKrantu said:

Political songs ki 15 million chala ekkuva

 

Posted
2 hours ago, snoww said:

 

This campaign is done by IPAC owned by prashanth kishore 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...