Jump to content

Recommended Posts

Posted
10 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? 

నల్లధనం తెస్తానన్నారు.. ఏం చేశారు? 
పేదల ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తానన్నారు.. 15 రూపాయలైనా వేశారా? 
సీఎంలను వ్యక్తిగతంగా విమర్శించడమేంటి? 
హిందూ, ముస్లిం అని ప్రధాని మాట్లాడొచ్చా? 
నిర్మల్‌ సభలో మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజం 
దేశం మెచ్చే రెవెన్యూ చట్టం తెస్తామని వెల్లడి 
ఈనాడు - హైదరాబాద్‌

7main1a_1.jpg

పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తాం. బెజ్జూరు నుంచి ఆదిలాబాద్‌కు, బాసర నుంచి ఆదిలాబాద్‌ రావడానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించాం. కేసీఆర్‌ సీఎం కాకుంటే, ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిగా ఉండకపోతే ఇవన్నీ సాధ్యమవుతుండేనా. గత ఎన్నికల్లో నా కోరికను నిలబెట్టారు. మీ అందరికీ ధన్యవాదాలు.

-నిర్మల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు

భూములపైన సాధారణ రైతులకు ఏవిధమైన హక్కులు ఉంటాయో.. పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికీ అదేవిధమైన హక్కులు కల్పిస్తాం. 
ఆదివాసీ బిడ్డలకు గతంలో అన్యాయం జరిగింది. న్యాయం చేయడానికి కృషి చేస్తా. ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు వారికి ప్రత్యేకమైన హక్కులు కల్పించి ఆదుకుంటాం.

‘‘దేశంలో భాజపా వాళ్లే హిందువులా.. మేం కాదా? హిందూ దేవుళ్లను మేము కాపాడటం లేదా.. హిందూ, ముస్లింలంటూ పంచాయతీలు పెట్టి ఓట్లు దండుకోవాలని ఎందుకు చూస్తున్నారు? దేశ ప్రధాని అయి ఉండి హిందూ, ముస్లిం అని మాట్లాడొచ్చా’’ అని ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. అన్ని కులాలు, మతాలు కలిసి మెలిసి జీవించే తెలంగాణ గడ్డపై ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు ఏ పాతాళంలో ఉన్నా  నల్లధనాన్ని తీసుకొస్తానని చెప్పారు. పేదల బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షలు చొప్పున వేస్తానన్నారు.. కనీసం రూ. 15 అయినా వేశారా.. 10 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు కదా.. ఇవన్ని ఎక్కడిచ్చారో, ఎవరికిచ్చారో ప్రధాని చెప్పాలని కేసీఆర్‌ డిమాండు చేశారు.. ఎన్నికల సమయంలోనే మీకు హిందువులు, ముస్లింలు, పాకిస్థాన్‌ వంటివి గుర్తుకొస్తాయా? వారి మధ్య పంచాయతీలు పెట్టి ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారని.. తెలంగాణలో ఇలాంటివి కుదరవని స్పష్టం చేశారు. 
‘‘ఏ మతమైనా, కులమైనా అందరి రక్తం ఒక్కటే.. కూలీకి వెళ్లే వారు కూడా దేవుడికి దండం పెట్టుకొని పనులు మొదలుపెడతారు. నాగోబా జాతరలాంటివి జరగడం లేదా.. భాజపా వాళ్లు చెబితేనే జరుగుతున్నాయా? వీరు సమాజాన్ని, ప్రజల భావాలను కలుషితం చేస్తున్నారు. మన పక్కదేశమైన చైనాలో కులం, మతం, వర్గ విభేదాలు లేకుండా అంతా అన్ని రకాల పనులు చేసుకుంటారు. ఇది ఆడవాళ్లు చేసే పని.. ఇది మగవాళ్లు చేసే పని అంటూ అక్కడ ఉండవు. మోదీ ఏ రాష్ట్రానికి పోతే అక్కడ సీఎంలను వ్యక్తిగతంగా విమర్శించడమేంటి? పిడికిలి బిగించి పనిచేస్తే మన దేశం కూడా బాగుపడుతుంది. మన దేశంలో దళితులు, గిరిజనులకు గౌరవం పెరగాలి. మహిళలకు సమానహక్కులపై చర్చ జరగాలి. ఇటువంటి వాటిపైన చర్చించకుండా ఏమైన అంటే కేసీఆర్‌ ముక్కు పెద్దగా ఉందని... జాతకాలు చెప్పించుకుంటారు అని మాట్లాడుతున్నారు. ఇవా ప్రధాని మాట్లాడే మాటలు? నేను జాతకాలు చూపించుకుంటే నీ ముల్లేం పోతది? ఇంత చిల్లర ప్రధానమంత్రిని ఎప్పుడూ చూడలేదు. పాలసీ గురించి మాట్లాడాలి. విద్యా, వైద్యం గురించి మాట్లాడాలి. కానీ వాటన్నింటినీ పక్కన పెట్టారు. దేశంలో ఉన్న జాతీయ రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ఇతర దేశాల్లో రవాణా వాహనాల సగటు వేగం గంటకు 80 కి.మీ. ఉంటే మన దేశంలో 20. కి.మీ. మాత్రమే. అక్కడ గూడ్సు రైలు వేగం గంటకు 85 కి.మీ. ఉంటే ఇక్కడ 32 కి.మీ. మాత్రమే. 7,500 కి.మీ. సముద్రతీరం ఉన్న భారతదేశంలో టూరిజం అభివృద్ధి చేయడం చేతకాదు కాని.. ఇక్కడి వనరులను వినియోగించుకోకుండా సింగపూర్‌ గురించి మాట్లాడుతుంటారు వాళ్లంతా. దీనిపై యువకులు, విద్యావంతులు ఆలోచించాలి. భారతదేశం బాగుపడటానికి దశ, దిశ చూపిస్తాం. అందుకోసమే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నా. కేంద్రంలో అనుకూలమైన ప్రభుత్వం వస్తుంది. దేశవ్యాప్తంగా చాలామందితో మాట్లాడినా. సెక్యూలర్‌ భావాలు కలిగిన ప్రభుత్వాలు రావాలి. తెలంగాణలో 16 సీట్లు గెలిస్తే దేశానికి దిశానిర్దేశం చేస్తే శక్తి వస్తుంది.

 

7main1b_1.jpg

ప్రకృతి ఇచ్చిన సంపద ఆదిలాబాద్‌ సొంతం. తెలంగాణ కశ్మీరం లాంటి ఈ జిల్లాలో అద్భుతమైన పంటలు పండే సారవంతమైన భూములు ఉన్నాయి. వాటన్నింటినీ బాగు చేయాలి. కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తాం. ఆదిలాబాద్‌ను కశ్మీర్‌ చేసే బాధ్యత నాది. కాళేశ్వరం ద్వారా ఎస్సారెస్పీ నుంచి లక్షల ఎకరాలకు త్వరలో సాగునీరు అందిస్తాం.. మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాలకు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మించి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ఏడాదిన్నరలో కశ్మీర్‌లో కళకళలాడే పంటలు ఇక్కడ పండించేలా చేస్తామని హామీ ఇస్తున్నా

-నిర్మల్‌ ప్రచార సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

Posted
1 minute ago, boeing747 said:

eelekkana BJP ki tg lo 1 seat kuda raadu anukunta

Dora target adhe no

Posted
6 minutes ago, boeing747 said:

eelekkana BJP ki tg lo 1 seat kuda raadu anukunta

All teddy's are shifting to BJP ade trend happening...not this time but for next elections BJP might emerge as opponent

Posted
27 minutes ago, panipoori said:

All teddy's are shifting to BJP ade trend happening...not this time but for next elections BJP might emerge as opponent

anta scene ledu...how we look at hinduism down south is different from north, we are more of live let live kind of people. progression, development and reforms are our peoples agenda not some mandir or masjid like northern parts

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...