Jump to content

Recommended Posts

Posted
 
636910033413227751.jpg
  • ఐటీ గ్రిడ్స్‌ సీఈవో అశోక్‌ కోసం వేట
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): డేటా చోరీ కేసులో ప్రధాన నిందితుడు, ఐటీ గ్రిడ్స్‌ సంస్థ సీఈవో అశోక్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వేట ముమ్మరం చేసింది. ప్రాథమిక విచారణ, కాల్‌ డేటా విశ్లేషణ ద్వారా అశోక్‌ ఏపీలో తలదాచుకున్నట్లు ఇదివరకే సిట్‌ గుర్తించింది.ఇప్పుడు అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏపీకి వెళ్లాయని, త్వరలోనే అశోక్‌ను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని సమాచారం. ఐటీ గ్రిడ్‌ కేసులో ఇప్పటికే మూడు సార్లు నోటీసులు జారీ చేసినా అశోక్‌ విచారణకు హాజరుకాకపోవడంతో తప్పనిసరి సరిస్థితుల్లో అరెస్ట్‌ చేసేందుకు సిట్‌ నిర్ణయించింది. ఏపీ, తెలంగాణలో ఎన్నికల వల్ల గత కొద్ది రోజులుగా ఫైల్‌ వర్క్‌కే సిట్‌ పరిమితమైంది. తాజాగా ఎన్నికలు ముగియడంతో దర్యాప్తులో దూకుడు పెంచింది. మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్స్‌ సంస్థ కార్యాలయంలో జరిపిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న హార్డ్‌ డిస్క్‌ ప్రాథమిక విశ్లేషణలో.. పెద్దమొత్తంలో ఆధార్‌ సమాచారం ఉన్నట్లు తేలిందని, పూర్తిస్థాయి విశ్లేషణ చేపట్టాల్సి ఉంటుందని ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలో పేర్కొంది.
 
  ఐటీ గ్రిడ్స్‌ హార్డ్‌ డిస్క్‌లలో 7,82,21,397 రికార్డులు ఉన్నాయని, అందులో ఏపీ, తెలంగాణకు సంబంధించిన డేటా ఉన్నట్లు సిట్‌ విచారణలో తేలింది. సెంట్రల్‌ ఐడెంటిటీ డేటా రిపోజిటరీ (సీఐడీఆర్‌), స్టేట్‌ రెసిడెంట్‌ డేటా హబ్స్‌ (ఎస్‌ఆర్‌డీఏఐ)లో మాత్రమే ఉండాల్సిన డేటా పెద్ద మొత్తంలో ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు ఎలా వచ్చిందని అధికారులు ఆరా తీస్తున్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ఆధార్‌ సంస్థ కూడా ఫిర్యాదు చేయాలని సిట్‌ అధికారులు ఢిల్లీలోని ఆ సంస్థ కేంద్ర కార్యాలయ అధికారులకు ఒక లేఖలో సూచించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆధార్‌ అధికారులు నాలుగు రోజుల క్రితం మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారం పెద్ద మొత్తంలో అమెజాన్‌ వెబ్‌ సర్వీ్‌సలో ఉంచడం ఆధార్‌ చట్టం ప్రకారం తీవ్రమైన నేరం కావడంతో ఆ కోణంలోనూ సిట్‌ దర్యాప్తు జరుపుతోంది. అమెజాన్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. వారి వివరణ ప్రకారం కేసులో తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది.
Posted
ఆధార్‌ చౌర్యం.. దర్యాప్తు వేగిరం

పట్టు బిగిస్తున్న సిట్‌

ఈనాడు, హైదరాబాద్‌ : డేటా చౌర్యం కేసులో తెలంగాణ సిట్‌ పట్టు బిగిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో పలు అంశాలు వెల్లడికాగా.. ఇప్పుడు ఆధార్‌ అధికారులు కూడా తోడవడంతో రాబోయే రోజుల్లో ఇది మరింత సంచలనాత్మకంగా మారే అవకాశం ఉంది. తమ సమాచారం చౌర్యం చేయడంతోపాటు దాన్ని విదేశాల్లో నిల్వ ఉంచడం తీవ్రమైన చర్య అని, ఇది దేశభద్రతకే ప్రమాదకరమనేది ఆధార్‌ అధికారుల వాదన. మరోవైపు నిందితుడు అశోక్‌ను పట్టుకోవడంతోపాటు  ప్రభుత్వం వద్ద మాత్రమే ఉండాల్సిన సున్నితమైన ఈ డేటా ఎలా బయటకు వచ్చిందన్న అంశాలను విచారించేందుకు సిట్‌ అధికారులు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఆధార్‌ సమాచారం చోరీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రగిల్చిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తరఫున సేవామిత్ర యాప్‌ నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్‌ కేంద్రంగా సమాచార చౌర్యం జరిగినట్లు ఆరోపణలు రావడంతో తెలంగాణ సిట్‌ అధికారులు ఆ సంస్థలో సోదాలు నిర్వహించి హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మొదట్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన పౌరుల సమాచారం మాత్రమే ఇందులో ఉందని భావించారు. కానీ స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్కులను ఫోరెన్సిక్‌ ల్యాబొరెటరీలో విశ్లేషించినప్పుడు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం కూడా ఉన్నట్లు తేలింది. అంతేకాక అచ్చంగా ఆధార్‌ సంస్థ వద్ద ఏ పద్ధతిలో అయితే సమాచారం నిక్షిప్తమై ఉందో, ఐటీ గ్రిడ్‌ నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్కులలోనూ అదే విధంగా నిక్షిప్తమై ఉందని ఫోరెన్సిక్‌ విశ్లేషణలో తేలింది. అంటే కచ్చితంగా ఇది ఆధార్‌ సర్వర్‌ నుంచి చోరీ చేసినట్లేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ‘స్టేట్‌ రెసిటెండ్‌ డేటా హబ్స్‌’ (ఎస్‌.ఆర్‌.డి.హెచ్‌) ఉంటాయి. ఇవి దేశవ్యాప్తంగా ఆధార్‌ సమాచారం నిక్షిప్తం చేసుకున్న ‘సెంట్రల్‌ ఐడెంటిటీ డేటా రెపోసిటరీ (సి.ఐ.డి.ఆర్‌)తో అనుసంధానమై ఉంటాయి. ఐటీ గ్రిడ్‌ సంస్థకు ఎస్‌.ఆర్‌.డి.హెచ్‌ ద్వారానే ఆధార్‌ సమాచారం అంది ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని నిర్ధారించేందుకు సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు విశ్లేషణ జరుపుతున్నారు. ఇప్పుడు ఆధార్‌ అధికారులు కూడా రంగంలోకి దిగడంతో ఏ ఐపీ చిరునామాల ద్వారా ఐటీ గ్రిడ్‌ సంస్థకు సమాచారం చేరిందనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది తేలితే అసలు ఐటీ గ్రిడ్‌ సంస్థకు ఎక్కడ నుంచి సమాచారం వచ్చిందనేది స్పష్టమవుతుంది. ఎస్‌.ఆర్‌.డి.హెచ్‌ ద్వారానే ఐటీ గ్రిడ్‌కు సమాచారం ఇచ్చినట్లు బయటపడితే సంబంధిత అధికారులు కూడా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా ఐటీ గ్రిడ్‌ సంస్థ సేకరించిన ఆధార్‌ సమాచారాన్ని అమెరికాలోని అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌లో నిల్వ ఉంచారని తేలింది. భారత పౌరుల సమాచారం ఇతర దేశాల్లో నిల్వ ఉంచడాన్ని ఆధార్‌ అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. శత్రుదేశాలు, లేదంటే అంతర్జాతీయ నేర ముఠాలు దీన్ని దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉంటుందనేది వారి అభ్యంతరం. అందుకే తమ వద్ద నిల్వ ఉండాల్సిన సమాచారం చోరీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆధార్‌ అధికారులు ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్‌కు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. దీంతో సున్నితమైన సమాచారం ప్రైవేటు సంస్థకు చేరవేయడంలో సహకరించిన అసలు నిందితులు ఎవరన్నది త్వరలోనే తేలుతుందని భావిస్తున్నారు.

Posted
Quote

ఎస్‌.ఆర్‌.డి.హెచ్‌ ద్వారానే ఐటీ గ్రిడ్‌కు సమాచారం ఇచ్చినట్లు బయటపడితే సంబంధిత అధికారులు కూడా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

AP Government employees bakra's motham episode lo 

Posted

Pulkas party chesina kotla pentalo idi okati. Pacha media peru chepukoni inninrojulu bratikesaru. Next 5 years media bajana/ last five years dochukuna dabbu tho caselu mafi chesukuntaru.

Posted
ఐటీ గ్రిడ్‌ కేసులో కీలక మలుపు
16-04-2019 18:01:15
 
హైదరాబాద్‌: ఐటీ గ్రిడ్‌ కేసులో కీలక మలుపు తిరిగింది. తెలంగాణ సిట్‌ చేతికి ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌ అందింది. 40 హార్ట్‌డిస్క్‌లను ఎఫ్‌ఎస్‌ఎల్‌ అధికారులు విశ్లేషించారు. హార్ట్‌డిస్క్‌లో ఏపీ, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల డేటా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక ఆధారంగా దర్యాప్తును సిట్ ముమ్మరం చేసింది. ఐటీ గ్రిడ్‌ సీఈవో అశోక్‌ కోసం సిట్‌ పోలీసులు గాలిస్తున్నారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...