battu Posted April 18, 2019 Report Posted April 18, 2019 సెంటర్లలో సిబ్బందికి పార్టీల కోత సగం మంది ఉద్యోగులతో కొనసాగింపు ఆకస్మిక నిర్ణయంతో గందరగోళ పరిస్థితి కొత్త ఉద్యోగాల వెతుకులాటలో యువత హైదరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): ఎటు చూసినా కోలాహలం.. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలకు దీటుగా ప్రతివ్యూహాలు.. ఎత్తులను చిత్తు చేస్తూ సోషల్‌మీడియా వేదికగా పోస్టింగ్‌లు.. ఎన్నికల ముందు వరకూ రాజకీయ పార్టీల ఐటీ సెంటర్లలో ఉద్యోగుల హడావుడి ఇది. ఎన్నికలు ఇలా ముగిశాయో..లేదో.. ఆయా పార్టీల ఐటీ సెంటర్లు మూగబోయాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కష్టాలు మొదలయ్యాయి. ఖర్చుకు భయపడి చాలా పార్టీలు సిబ్బందికి ఉద్వాసన పలుకుతుండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియా ప్రచారం, అధికారిక సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ కోసం పలు రాజకీయ పార్టీలు భారీ స్థాయిలో సిబ్బందిని నియమించుకున్నాయి. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ఐటీ సెంటర్లను అట్టహాసంగా ప్రారంభించాయి. స్థాయి, పనితనం ఆధారంగా సిబ్బందికి భారీగా వేతనాలు ఇచ్చాయి. అయితే, ఎన్నికలు ముగియడంతో ఐటీ సెంటర్లలోని సిబ్బందికి అన్ని పార్టీలు ఉద్వాసన పలుకుతున్నాయి. సగానికి సగం మందిని విధుల నుంచి తొలగించేస్తున్నాయి. దీంతో అర్ధంతరంగా పని కోల్పోయిన వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గులాబీ అభ్యర్థులకు ఏజెన్సీల సేవలు రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు ప్రత్యేకంగా ఐటీ సెంటర్ లేదు. పార్టీ సానుభూతిపరులు, ఆసక్తి కలిగిన నాయకులే సోషల్‌మీడియా బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ కేంద్రంగా వంద మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. వారిలో దాదాపుగా అందరూ స్వచ్ఛందంగా పని చేయడానికి వచ్చిన వాళ్లే. లోక్‌సభ ఎన్నికల సమయంలో మాత్రం తమకే ఓటేయాలని కోరేందుకు పలువురు అభ్యర్థులు వివిధ ఏజెన్సీల తరఫున టెలీకాలర్లను నియమించుకున్నారు. ఇందుకోసం ఆయా ఏజెన్సీలు టెలీకాలర్లు, ఫొటోషాప్ డిజైనర్లను నియమించుకున్నాయి. ఎన్నికలు ముగియడంతో ఆయా ఏజెన్సీలు కొందరిని తొలగించి, మిగిలిన వాళ్లను ఇతర పనుల కోసం ఉపయోగించుకుంటున్నాయి. కార్యకర్తలతోనే కాంగ్రెస్ ప్రచారం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ఐటీ విభాగం ఉంది. పార్టీకి చెందిన నాయకులే ఈ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. తమ పార్టీ కార్యకర్తలతోనే దీన్ని నడిపిస్తున్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో పలువురు తమ ప్రచారం కోసం వ్యక్తిగతంగా ఫేస్‌బుక్, వాట్సా్‌పల్లో సోషల్ ఆర్మీ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు. వాటిలో వలంటీర్లుగా చేరిన వాళ్లకు ఆన్‌లైన్ గిఫ్టు ఓచర్లను అందజేశారు. తద్వారా సోషల్‌మీడియాలో తమకు అనుకూలంగా వారితో ప్రచారం చేయించుకున్నారు. సోషల్ ఆర్మీల్లో వలంటీర్లుగా స్థానిక యువకులు, పార్టీ కార్యకర్తలనే ఎక్కువగా ఉపయోగించుకున్నారు. జనసేన ఐటీ సెంటర్‌కు టు-లెట్ బోర్డు జనసేన పార్టీ ఐటీ సెంటర్ కోసం రాయదుర్గంలోని ఖాజాగూడ సమీపంలో మూడంతుస్థుల భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. దాదాపు 500పైచిలుకు మందిని నియమించుకున్నారు. దీన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించగా.. పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ సమన్వయ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికలు ముగిసి వారం కూడా గడవకముందే ఐటీ సెంటర్‌లోని మెజార్టీ సిబ్బందికి ఉద్వాసన పలికారు. దాదాపు 350 మందిని విధుల్లోంచి తొలగించారు. మూడంతస్థుల భవనంలో ఒక అంతస్థు మాత్రమే ఉంచుకుని మిగతా రెండింటిని జనసేన ఖాళీ చేయడంతో టు-లెట్ బోర్డు ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో 100-150 మంది ఉద్యోగులతోనే ఐటీ సెంటర్ నిర్వహించాలని భావిస్తున్నామని, మళ్లీ ఎన్నికల వరకూ ఈ సెంటర్‌తో అంతగా పని ఉండబోదని జనసేన నేత ఒకరు తెలిపారు. వైసీపీ ఐటీ సెంటర్‌లో భారీ ఉద్వాసన ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి చెందిన ఐటీ సెంటర్‌లో అధిక సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. హైదరాబాద్‌లోని లోట్‌సపాండ్ సమీపంలో ఉన్న ఐటీ సెంటర్ ద్వారా పార్టీ ప్రచారం కోసం పలు యూట్యూబ్ చానళ్లు సైతం నిర్వహించారు. సెంటర్‌కు సంబంధించిన పనులను వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి స్వయంగా పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. వైసీపీ సోషల్‌మీడియా ఖాతాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహించారు. ఇందుకోసంటెలీకాలర్లు, కంటెంట్ రైటర్లు, ఫొటోషాప్ డిజైనర్లను అధిక సంఖ్యలో నియమించుకున్నారు. వైసీపీ అభ్యర్థులను గెలిపించాలంటూ టెలీకాలర్లకు లక్ష్యాలు విధించారు. పార్టీ వార్తలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన వాళ్లకు... ఎన్నికలు ముగియడంతోనే చేదు వార్త అందింది. ఇక, విధుల్లోకి రావాల్సిన అవసరం లేదని నిర్వాహకులు చెప్పేశారు. Quote
Hydrockers Posted April 18, 2019 Report Posted April 18, 2019 2014 lo ntr trust bhavan lo ayyindi kuda same to same kadha Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.