Jump to content

raitu kosam collector ki call chesina CM.. ipudu ekkadiki poyadu?? revanth.. lol


Recommended Posts

Posted
ఆ విద్యార్థులకు ఉచితంగా రీవెరిఫికేషన్‌:కేసీఆర్‌

0240419kcr-1-brk.jpg

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌బోర్డు వ్యవహారంపై సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమీక్ష ముగిసింది. ప్రగతి భవన్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం.. అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష తప్పితే జీవితం ఆగిపోదని.. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కేసీఆర్‌ సూచించారు.

ఆ బాధ్యతలు జనార్దన్‌రెడ్డికి అప్పగింత

ఇంటర్‌ బోర్డుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నందున ఈ సమావేశంలో కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ చేయాలని ఇంటర్‌బోర్డును ఆదేశించారు. పాసైన విద్యార్థులు రీవెరిఫికేషన్‌ కోరినా చేయాలని.. ఈ అంశంలో గత విధానమే పాటించాలని సీఎం సూచించారు. రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ ప్రక్రియలను త్వరగా పూర్తి చేయాలన్నారు. నీట్, జేఈఈ లాంటి దేశవ్యాప్త ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరు కావాల్సి ఉన్నందున వీలైనంత త్వరగా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని ఆదేశించారు. విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ఇంటర్‌ ఫలితాల గందరగోళం విషయంలో బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌పై ఎక్కువగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌, సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డికి సీఎం అప్పగించారు. పరీక్షల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా వ్యూహాల్ని ఖరారు చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. 

టెండర్ల ద్వారానే ఏజెన్సీలను ఎంపిక

ఇంటర్ విద్యార్థుల డేటా ప్రాసెస్‌, పరీక్షల ఫలితాల వెల్లడికి సంబంధించి బోర్డుకు సహకారం అందించే ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల ఎంపిక, వాటి సామర్థ్యంపై అధికారులను కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. ఇ-ప్రొక్యూర్‌మెంట్‌ ప్రక్రియ ద్వారా టెండర్లను ఆహ్వానించి ఏజెన్సీలను ఎంపిక చేశామని, తక్కువ రేటు కోట్‌ చేసిన సంస్థకే బాధ్యతలు అప్పగించామని అధికారులు సీఎంకు చెప్పారు.  టెండర్లు వేసిన సంస్థల సామర్థ్యాన్ని సాంకేతిక నిఫుణులు, అనుభవజ్ఞులైన బోర్డు సభ్యులతో కూడిన కమిటీ మదింపు చేసిందని వారు వివరించారు. టెండర్ల ప్రక్రియ, సామర్థ్యాన్ని గణించడం తదితర ప్రక్రియలన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని అధికారులు కేసీఆర్‌కు తెలిపారు.

Posted

నేను మాట్లాడితే వరం
నేను మౌనంగా ఉంటే ధ్యానం
నేను చెప్పింది వేదం
ఇట్లా ఉంటుంది కేసీఆర్ తీరు....ఇంటర్ బోర్డు అవకతవకలకంటే కూడా తెలంగాణ సర్కారు, ఇంటర్ బోర్డు నిర్లక్ష్యపు మాటలు వారిని ఎక్కువ బాధపెట్టాయి. వారు ఎంత దారుణంగా మాట్లాడారంటే... ‘‘గ‌తంలో చేసుకున్న సూసైడ్ల‌తో పోలిస్తే.. ప్రస్తుత ప్ర‌భుత్వ హ‌యాంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న వారి సంఖ్య త‌క్కువ‌గా ఉంది‘‘ ఇంతకంటే దరిద్రపు వ్యాఖ్యలు ఎక్కడయినా ఉంటాయా?

Posted
Quote

ఇంటర్‌ ఫలితాల గందరగోళం విషయంలో బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌పై ఎక్కువగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌, సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డికి సీఎం అప్పగించారు. 

 

Posted

Pakkanodu chesthe PPT's, veedu chesthe accountability ani build up 10gina  kachara gadu , fail ayina students gurinchi enduku accountability teesukoteldhu..

gorrelu unnantha varaku eedu ilane chesthadu..

Posted

Ide voopu lo corporate colgs lo suicide matter kuda lepandi _-_ Vallu kuda students ye ye state aina kuda $s@d 

Posted
Just now, Sucker said:

Ide voopu lo corporate colgs lo suicide matter kuda lepandi _-_ Vallu kuda students ye ye state aina kuda $s@d 

That is vyabhicharam. So we won't touch it. 

Minister Narayana owned free chaitanya parayan colleges doing excellent job. aa students ki emi pani paata leka suicides sesukuntunnaru. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...