snoww Posted April 25, 2019 Report Posted April 25, 2019 ఉప్పొంగిన గోదారి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం 6వ ప్యాకేజీలో మొదటి పంపు ప్రయోగాత్మక పరిశీలన విజయవంతం రెండో పంపు ట్రయల్ రన్‌ను నేడు ప్రారంభించనున్న సీఎస్ జోషి మే నెలాఖరుకల్లా మిగిలిన 3 పంపుల పనులు పూర్తి తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా మెదడును కరిగించాం. అనేక రకాలుగా ఆలోచించాం. చివరికి ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత కాళేశ్వరం దగ్గర మాత్రమే నీటి లభ్యత ఉందని నిర్ధారించుకున్నాం. అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయడం మినహా మరో గత్యంతరం లేదని తీర్మానించుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి పంపు వెట్‌రన్ విజయవంతం కావడం నాకు అత్యంత ఆనందం కలిగించింది.పనుల్లో రేయింబవళ్లు కష్టపడుతున్న అధికారులు, ఇంజనీర్లకు హృదయపూర్వక అభినందనలు. - ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనాడు, హైదరాబాద్, ధర్మారం-న్యూస్‌టుడే, ఈనాడు డిజిటల్-పెద్దపల్లి: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో బుధవారం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పథకంలోనే మొట్టమొదటి ఎత్తిపోతలను ప్రయోగాత్మకంగా ప్రారంభించగా విజయవంతమైంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని ఆరో ప్యాకేజీ పంప్‌హౌస్ ఇందుకు వేదికైంది. ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 12:02 గంటలకు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ కంప్యూటరు మీట నొక్కి మొదటి పంపును ప్రారంభించారు. సర్జ్‌పూల్ నుంచి పరుగులు పెట్టిన గోదావరి జలాలు మేడారం జలాశయంలోకి చేరడంతో అధికారులు, ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. స్మితా సబర్వాల్ ముందుగా ఆరో ప్యాకేజీలోని ఏడు మోటార్లలో ఇప్పటికే పూర్తయిన 4 మోటార్లతో పాటు మిగిలిన 3 మోటార్లను పరిశీలించారు. మే నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 30 నిమిషాల పాటు ఎత్తిపోతలు పంపు వేగం పుంజుకోగానే (200 ఆర్పీఎం) 12:17 నిమిషాలకు డెలివరీ సిస్టర్న్‌ల నుంచి నురగలు కక్కుతూ జలాలు బయటకు వెలువడ్డాయి. లీడ్‌ఛానల్ నుంచి ఏడో ప్యాకేజీలో భాగంగా అభివృద్ధి చేసిన నందిమేడారం రిజర్వాయరులోకి పరుగుతీశాయి. డెలీవరీ సిస్టర్న్‌ల నుంచి నీళ్లు బయటకు రాగానే అక్కడ ఎదురుచూస్తున్న వారందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు లీడ్ ఛానల్‌లో నీటి ప్రవాహానికి పూజలు చేసి పూజాద్రవ్యాలు వదిలారు. అనంతరం మిఠాయిలు పంచుకుని పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. పంపును 30 నిమిషాలు నడిపించిన అనంతరం నిలిపివేశారు. 124.4 మెగావాట్ల సామర్థం గల ఈ పంపును 30 నిమిషాల సేపు నడపడానికి 115 మెగావాట్ల విద్యుత్తు అవసరమైనట్లు సంబంధిత ఇంజినీర్లు తెలిపారు. దీంతో కీలకమైన మరో మైలు రాయిని అధిగమించినట్లయ్యింది. మళ్లీ సాయంత్రం 5.30 గంటలకు మరోసారి నిర్వహించారు. మేడారం పంప్‌హౌస్‌లో మొత్తం ఏడు పంపులకు గాను ప్రస్తుతం నాలుగు పంపులు వెట్‌రన్ (ప్రయోగాత్మక పరిశీలన)కు సిద్ధంగా ఉన్నాయి. రెండో పంపు ట్రయల్ రన్‌ను గురువారం సీఎస్ శైలేంద్రకుమార్ జోషి ప్రారంభించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిగతా మూడు పంపుల బిగింపు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒక్కో పంపు సామర్థ్యం 124.4 మెగావాట్ల సామర్థ్యం కాగా 3200 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది.ఈ పంపులు 105.45 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తాయి. ప్రత్యేక అధికారి శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు, ఎస్.ఇ సుధాకర్‌రెడ్డి, ఇ.ఇ నూనె శ్రీధ]ర్, ట్రాన్స్‌కో డైరెక్టర్ సూర్యప్రకాశ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్‌రావు, కరీంనగర్ ప్రాజెక్టుల ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్‌కుమార్, అంతర్ రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజినీర్ నరసింహారావు, నవయుగ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్, డైరెక్టర్ వెంకట రామారావు , విశ్రాంత ఇంజినీర్ల సంఘం నాయకులు శ్యాం ప్రసాద్‌రెడ్డి, ఇతర అధికారులు, ఇంజినీర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.నీటిపారుదల శాఖ అధికారులు, సంబంధిత ఇంజినీర్లు, గుత్తేదార్లు ఇలా అందరూ సమన్వయంతో పని చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హరీశ్‌రావు అభినందనలు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని ఆరవ ప్యాకేజీలో మొదటి పంపు నీటితో చేపట్టిన ప్రయోగాత్మకంగా విజయవంతం అయిన సందర్భంగా కష్టపడ్డ ఇంజినీర్లందరికీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా తన సందేశాన్ని పంపారు. రోజుకు రెండు టీఎంసీల నీరు మళ్లించేలా.. దేశంలోనే అతి భారీ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా రోజుకు రెండు టీఎంసీల నీటిని మళ్లించేలా పనులను ప్రభుత్వం చేపట్టింది. మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు నీటిని మళ్లించే పనులను పూర్తి చేసి ఈ ఖరీఫ్ నాటికి నీటిని మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకొంది. మేడిగడ్డ ,అన్నారం, సుందిళ్ల బ్యారేజీ పనులు, పంపుహౌస్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీ పనులు పూర్తి కాగా, మేడిగడ్డ బ్యారేజి పనులు జరుగుతున్నాయి. ఈ మూడు బ్యారేజీల వద్ద మూడు పంపుహౌస్‌లలో కొన్ని పంపులు, మోటార్లు అమర్చే కార్యక్రమం పూర్తయ్యింది. ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరుకు నీటిని మళ్లించడానికి రెండుచోట్ల పంపుహౌస్‌ల నిర్మాణం జరుగుతోంది.ఇందులో నందిమేడారం వద్ద నిర్మించిన మొదటి పంపుహౌస్‌లో నాలుగు మోటార్లు, పంపులు అమర్చే కార్యక్రమం పూర్తికాగా, మరో మూడింటి పనులు జరుగుతున్నాయి. ఈ పంపుహౌస్ నుంచి వదిలిన నీరు మేడారం రిజర్వాయర్, కొత్తగా నిర్మించిన సొరంగమార్గాల ద్వారా మరో పంపుహస్‌లోకి (8వ ప్యాకేజీ) చేరతాయి. ఈ పంపుహౌస్ ద్వారా ఎత్తిపోసేనీరు వరద కాలువ ద్వారా మిడ్‌మానేరుకు చేరుతుంది. చరిత్రాత్మకమైన రోజు తెలంగాణకు ఈ రోజు చరిత్రాత్మకమైనది. ఇంజినీర్లు, అన్ని ప్రభుత్వ విభాగాలు కలసికట్టుగా లక్ష్య సాధన కోసం నిర్విరామంగా పని చేసినందువల్లే ఇది సాధ్యమైంది. మిగతా పనులు త్వరలోనే పూర్తవుతాయి. ఈ పథకంతో రాష్ట్రానికి చాలా ప్రయోజనం చేకూరుతుంది. - స్మితాసబర్వాల్, సీఎంవో కార్యదర్శి వర్షాకాలం నుంచే సాగునీరు ముఖ్యమంత్రి నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేశాం. పంపును ప్రారంభించేందుకు చేయాల్సిన కసరత్తును గత బుధవారం నుంచే ప్రారంభించాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ప్రోత్సహించారు. నీటిపారుదల శాఖ, ట్రాన్స్‌కో, జెన్‌కోలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు ఐకమత్యంగా పని చేసినందువల్లే ట్రయల్‌రన్ విజయవంతమైంది. మరో మూడు పంపుల పనులు పూర్తయి వెట్‌రన్‌కు సిద్ధంగా ఉన్నాయి. మే నెలాఖరులోగా ఎనిమిదో ప్యాకేజీ పంప్‌హౌస్‌లోని పంపులకూ ట్రయల్‌రన్ నిర్వహిస్తాం. వచ్చే వర్షాకాలం నుంచి రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోసుకునే విధంగా సన్నద్ధమవుతున్నాం. -నల్ల వెంకటేశ్వర్లు, ఈఎన్‌సీ Quote
snoww Posted April 25, 2019 Author Report Posted April 25, 2019 one such project which would never have been became a reality in combined AP state Quote
DrBeta Posted April 25, 2019 Report Posted April 25, 2019 4 minutes ago, Anta Assamey said: Run, lepote drownutaavu. Quote
snoww Posted April 25, 2019 Author Report Posted April 25, 2019 భారీ పంపుల వినియోగం సక్సెస్ 25-04-2019 02:35:49 తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుంది వెట్ రన్ సక్సె్‌సపై సీఎం కేసీఆర్ అధికారులు, ఇంజనీర్లకు అభినందనలు హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 124.4 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులతో 105 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే పంపింగ్ విజయవంతమైందని, ఇది అత్యంత ఆనందకరమైన విషయమని సీఎం పేర్కొన్నారు. ఇంతటి భారీ సామర్థ్యం కలిగిన పంపులను విజయవంతంగా వినియోగించడం ద్వారా ఆసియాలోనే ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా భారత్, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతాయని ముఖ్యమంత్రి చెప్పారు. ‘‘తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా మెదడును కరిగించాం. అనేక రకాలుగా ఆలోచించాం. ఎంతో శోధించి, చివరికి ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత కాళేశ్వరం దగ్గర మాత్రమే నీటి లభ్యత ఉందని నిర్ధారించుకున్నాం. అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయడం మినహా గత్యంతరం లేదని తీర్మానించుకున్నాం. అలా నీటిని ఎత్తిపోసి తెలంగాణలోని 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్ ప్రణాళిక తయారు చేయడానికి నెలల తరబడి కసరత్తు చేశాం. రక్షణ శాఖ అనుమతి తీసుకుని మరీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా లైడార్ సర్వే నిర్వహించి, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. గోదావరి నుంచి నీటిని తోడడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా 139 మెగావాట్ల భారీ సామర్థ్యం కలిగిన పంపుసెట్లను వినియోగించడానికి డిజైన్ చేశాం. గతంలో తెలంగాణలో 80-85 మీటర్ల వరకే ఎత్తిపోసిన అనుభవం ఉంది. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో పంపు గరిష్ఠంగా 120 మీటర్ల ఎత్తు వరకు నీటిని పంపింగ్ చేసే ప్రణాళిక ఉంది. ఇందుకోసం ఇంజనీర్లు, అధికారులు విదేశాలకు కూడా వెళ్లారు. సంపూర్ణ అధ్యయనం చేశాకే పనులు చేపట్టారు. భగవంతుడి ఆశీస్సుల వల్ల అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతుల తలరాత మార్చే అదృష్టం. ప్రాజెక్టు పనుల్లో రేయింబవళ్లు కష్టపడుతున్న అధికారులు, ఇంజనీర్లకు హృదయపూర్వక అభినందనలు’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇంజనీర్లకు హరీశ్ అభినందనలు కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 6లో మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడంపై నీటిపారుదల శాఖ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కోసం కష్టపడిన ఇంజనీర్లకు బుధవారం ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. వెట్ రన్ విజయవంతమైన సందర్భంగా సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.