snoww Posted April 25, 2019 Report Posted April 25, 2019 మరో 3 నెలలు కనకదుర్గ పైవంతెన గడువు నేడు సీఎస్ వద్ద సమీక్ష ఈనాడు, విజయవాడ వాస్తవానికి మార్చి31తో నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ అనధికారికంగా మే14వరకు గడువు ఇచ్చారు. ప్రస్తుతం మరె మూడు నెలలు పొడిగించాలని నిర్ణయించారు. స్వయంగా కేంద్ర రోడ్లు, రవాణా మంత్రిత్వ శాఖ (మోర్తా) మరో మూడు నెలల గడువు పొడించాలని ప్రతిపాదించింది. అంటే ఆగస్టు 15 నాటికి పూర్తి కావాల్సి ఉంది. అప్పటికైనా పూర్తవుతుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు నిర్మాణంతోనే అపసోపాలు పడుతుంటే.. మరోవైపు అధికారుల నిర్ణయాలతోనూ కష్టాలు ఎదురవుతున్నాయి. అనవసర భారం నిర్మాణ సంస్థపై పడుతోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కనకదుర్గ పైవంతెన నిర్మాణ తీరిది. ఎలాగైనా నిర్మాణ సంస్థతో పనులు చేయించుకోవాలని అధికారులు పట్టుదలతో ఉన్నారు. ఏమాత్రం అవకాశం లభించినా పనలు వదిలివేయాలనే ఆలోచనలో నిర్మాణ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. తమకు ఎదురవుతున్న సమస్యలను సాకుగా చూపి నష్టాల మూటకట్టుకోకుండా వదిలివేసే అవకాశం ఉందని తెలిసింది. కనకదుర్గ పైవంతెన నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు, పురోగతి సమీక్షలో భాగంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. బిల్లుల మంజూరుతో పాటు తమకు వృథాగా ఖర్చు పెంచుతున్న వైనంపై సంస్థ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం 75 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. మరో 25 శాతం పనులు రానున్న నాలుగు నెలల్లో ఏమేరకు పూర్తి చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఒక ఆకృతి సంతరించుకున్న కనకదుర్గ పైవంతెన నిర్మాణంలో తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. పడుతూ.. లేస్తూ..! మొదటి నుంచి వంతెన నిర్మాణంలో అవాంతరాలను అధిగమిస్తూ వచ్చారు. మొదట ఆక్రమణలను తొలగించడమే కాకుండా నదిలో నిర్మాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నదిలో నిర్మాణాలకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి. దీనిపై న్యాయస్థానాల ఆదేశాలు ఉండటంతో అంత త్వరగా అనుమతులు రాలేదు. ఇవన్నీ సాధించి 2015 నవంబరులో టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. భవానీపురం నుంచి కనకదుర్గ వారధి వరకు నాలుగు వరసల రహదారి, కుమ్మరిపాలెం నుంచి పీఎన్బీ వరకు పైవంతెన నిర్మాణం చేయాలని సూచించారు. ప్రస్తుతం కనకదుర్గ కొండ సమీపంలో ఒక పారాబ్రిడ్జి నిర్మాణం చేసి నాలుగు వరసల రహదారి వచ్చే విధంగా మార్పు చేశారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయింది. 249 మీటర్లు దాదాపు నదిలోకి విస్తరించి ఈ వంతెన నిర్మాణం చేశారు. కనకదుర్గ పైవంతెన ఇంద్రకీలాద్రి వద్ద నదిలో నిర్మాణం చేయాల్సి వచ్చింది. నదిలోనే పిల్లర్లను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ స్పాన్లు ఒకవైపు నిర్మాణం చేసేవిధంగా ఆకృతులను మార్చారు. నదిలో ఆక్రమణలు లేకుండా డిజైన్లు మార్చారు. కనకదుర్గ పైవంతెన ఆకృతి ప్రకారం అత్యంత పటిష్టంగా నిర్మాణం చేయాల్సి ఉంది. బెంజిసర్కిల్ పైవంతెన 1.3 కిలోమీటర్లకు గాను దాదాపు 49 పిల్లర్లను నిర్మాణం చేస్తున్నారు. ఇవి దగ్గర దగ్గరగా ఉన్నాయి. పైవంతెన కూడా మూడు వరసలు మాత్రమే. అదే కనకదుర్గ పైవంతెన పొడవు 2.600 కిలోమీటర్లు. దీనికి కేవలం 49 పిల్లర్లను నిర్మాణం చేస్తున్నారు. ఈ పిల్లర్లపై ఆరువరసల రహదారి వస్తుంది. ఈ పైవంతెన నిర్మాణంలో ప్రీ ఫాబ్రికేషన్ పద్ధతిలో యార్డులో గడ్డర్లు, స్పాన్లు, వింగ్స్ నిర్మాణాలు చేసి అమర్చుతున్నారు. పూర్తికాకముందే ఎఫ్1హెచ్2ఓ పేరుతో రూ.కోట్లు వెచ్చించి పార్కు నిర్మాణం చేశారు. కనకదుర్గ గుడి సమీపంలో 24, 25 పిల్లర్ల వద్ద సమస్య ఎదురవుతోంది. ఇక్కడ దాదాపు పరిహారంగా రూ.80లక్షల వరకు చెల్లించారు. కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. కాలువల్లో పిల్లర్ల నిర్మాణానికి జాప్యం జరిగింది. ప్రస్తుతం స్లాబ్లు వేస్తున్నారు. ప్రస్తుతం ట్రాష్బారియర్ అధునాతన యంత్రాన్ని తీసుకువచ్చారు. దీంతో తుది మెరుగులు దిద్దుతున్నారు. నాలుగు బస్స్టాప్లు..! కనకదుర్గ పైవంతెన నిర్మాణ ప్రాంతంలో నాలుగు బస్ షెల్టర్లను ఏర్పాటు చేయనున్నామని రహదారులు-భవనాలుశాఖ డిప్యూటీ ఈఎన్సీ జాన్మోషే వెల్లడించారు. కుమ్మరిపాలెం, సీ11, నగరపాలకసంస్థ కార్యాలయం సమీపంలో వయాడక్టు, దుర్గాఘాట్ వద్ద ఇవి నిర్మిస్తారు. ఇక పైవంతెనపై గ్రీనరీ (పచ్చదనం) పెంచనున్నారు. దీనికి 1.2మీటర్ల డివైడర్ను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 4అడుగులు ఉంటుంది. రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రారంభించారు. ఇటీవల కేంద్ర రోడ్లు, రవాణా మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ బాలకృష్ణ వంతెన నిర్మాణాన్ని పరిశీలించారు. ఆగస్టు15 వరకు గడువు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. నాలుగు వరసల రహదారి దాదాపు 5280 మీటర్ల దూరం నిర్మాణం చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 1675 మీటర్ల నిర్మాణం చేశారు. ఇంకా 3605 మీటర్లు నిర్మాణం చేయాల్సి ఉంది. అంటే పైవంతెన, కింద మరో రెండు వరసల బీసీ పొర వేయాల్సి ఉంది. పైవంతెన నిర్మాణం పూర్తయితే ఈ రహదారిని పూర్తి చేస్తారు. అప్పటివరకు పెండింగ్లో ఉంది. 2219 మీటర్ల డ్రైనుకుగాను 1830 మీటర్ల దూరం నిర్మాణం చేయాల్సి ఉంది. Quote
tom bhayya Posted April 25, 2019 Report Posted April 25, 2019 Jagan anna chethula meedhuga opening jaragaali ani raasi petti undhi ani kreesthurajupuram pastor last year ey cheppadu andhukey inka finish kaledhu Quote
snoww Posted April 25, 2019 Author Report Posted April 25, 2019 47 minutes ago, tom bhayya said: Jagan anna chethula meedhuga opening jaragaali ani raasi petti undhi ani kreesthurajupuram pastor last year ey cheppadu andhukey inka finish kaledhu Raavali jagan. Kaavali flyover finish Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.