snoww Posted April 27, 2019 Report Posted April 27, 2019 పసుపు - కుంకుమ ఏది? 4/27/2019 2:24:27 AM పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం నగరంలో 35 శాతం మందికి నేటికీ అందని చెక్కులు రెండు నెలలుగా చెక్కుల పంపిణీని పట్టించుకోని సీవోలు, సోషల్ వర్కర్లు కమీషన్ల కోసమే చెక్కులు దాచారంటూ ఆరోపణలు సమాచారం లేదంటున్న యూసీడీ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్న మహిళలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసిన పసుపు-కుంకుమ మహిళలకు వరంగా మారగా కొందరికి మాత్రం చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. రెండు నెలల క్రితం ఇచ్చిన చెక్కులు నేటికీ కొంతమంది డ్వాక్వా గ్రూపు మహిళలకు అందలేదు. అదేమని కార్పొరేషన్ అధికారులను అడిగితే కుంటి సాకులు చెపుతున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రజ్యోతి, విజయవాడ : విజయవాడలో 35 శాతం డ్వాక్వా గ్రూపు మహిళలకు పసుపు కుంకుమ చెక్కులు అందలేదన్న వార్త ఇపుడు కలకలం రేపుతోంది. రోజూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మమే తప్ప చెక్కులు ఇవ్వడం లేదని డ్వాక్వా మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటుండగా.. అలాంటి వాళ్ల వివరాలు తమకివ్వాలని యూసీడీ (అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్) పీవో (ప్రాజెక్టు ఆఫీసర్) అంటున్నారు. ఉదాహరణకు 49వ డివిజన్లోనే సుమారు 7 నుంచి 10 గ్రూపులకు చెక్కులు అందలేదని ఆయా గ్రూపు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమీషన్లకు కక్కుర్తి పడుతూ పలువురు అధికారులు తమ చెక్కులను దాచిపెడుతున్నారని వారి ఆరోపణ. ఈ విషయమై స్థానిక కమ్యూనిటీ ఆఫీసర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ సదరు వ్యవహారాన్ని నేటికీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడం గమనార్హం. ఫిబ్రవరిలో పసుపు-కుంకుమ పథకం కింద గ్రూపులోని ఒక్కో మహిళకు రూ.పది వేల చొప్పున పది మంది మహిళలకూ కలిపి రూ.లక్ష మూడు దశల్లో బ్యాంకుల ద్వారా మంజూరయ్యేలా చెక్కులను తేదీలతో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. కానీ కొన్ని వందల చెక్కులు నేటికీ స్థానిక సోషల్ వర్కర్లు, కమ్యూనిటీ ఆఫీసర్ల వద్దే మగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకివ్వలేక పోతున్నారన్న ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. ఽస్థానిక కార్పొరేటర్లను అడిగితే బ్యాంకులు మారిన కారణంగా, గ్రూపులు యాక్టివ్‌గా లేని కారణంగానే చెక్కులు రాలేదని చెబుతున్నారు. గ్రూపులు యాక్టివ్‌గా లేకపోతే వచ్చాయి.. వచ్చేస్తున్నాయన్న సమాధానాలతో స్థానిక సోషల్ వర్కర్లు ఎందుకు మభ్యపెడుతున్నారన్నది ప్రశ్నగా మారింది. మూడు నెలల క్రితం జరిగిన పంపిణీ వివరాలు నేటికీ అందలేదని యూసీడీ విభాగం వారు సమాధానం చెబుతున్నారు. నగరంలో ఎన్ని గ్రూపులున్నాయి, ఆయా గ్రూపుల్లోని మహిళల పేర్లు కూడా యూసీడీ విభాగం సిద్ధం చేయించుకోలేక పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే డ్వాక్వా గ్రూపు మహిళలకు సమాచారం చెప్పాల్సిన ఒక సోషల్ వర్కర్ (49వ డివిజన్) అందు బాటులో ఉండక పోగా కనీసం ఫోన్లకు కూడా దొరకడంలేదని ఆ డివిజన్ డ్వాక్వా గ్రూపు మహిళలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిందట! కళ్లు మూసి తెరిచేంతలోనే ఎన్నికల కోడ్ వచ్చేసిందని, అందుకే చెక్కుల పంపిణీకి, పరిశీలనకు ఆలస్యమైందని వీఎంసీ అధికారులు మాట దాటేస్తున్నారు. నిజానికి పసుపు- కుంకుమ పథకం చెక్కుల పంపిణీ ముగిసిన తరువాతే ఎన్నికల కోడ్‌ను, తేదీని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 11న ఎన్నికలు ముగిశాక మరో మూడు రోజుల పాటు ఎలక్షన్ పనులు కొనసాగగా.. అనంతరం ఎవరి విధుల్లోకి ఆయాశాఖాధికారులు చేరుకున్నారు. కానీ దాదాపు 49 రోజులు పసుపు-కుంకుమ పథకంపై పనిచేసిన యూసీడీ విభాగం చెక్కుల పంపిణీ పూర్తి చేయకపోగా, కనీసం ఎవరెవరకి అందించాలన్న జాబితాలను కూడా సిద్ధం చేసుకోలేక చతికిల పడింది. ఎన్నికలు ముగిసినా నేటికీ ఎన్నికల కోడ్ (రిలాక్స్ మూడ్) నుంచి బయట పడని చాలా మంది అధికారుల్లాగే యూసీడీ అధికారులు కూడా సాకులు చెప్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూసీడీ ఎందుకు చర్యలు తీసుకోలేదు చెక్కులు చాలా మందికి అందలేదన్న విషయం తెలిసి కూడా యూసీడీ విభాగం చర్యలను ఎందుకు వేగవంతం చేయ లేదు. డ్వాక్వా మహిళల ఇబ్బందులపై స్పందిస్తూ ఇప్పటికే ప్రకటన చేసి బాధితులు కార్పొరేషన్‌కు రావాలనో, లేదా కమిషనర్‌ను సంప్రదించాలనో కనీస ప్రకటన కూడా ఎందుకు చేయలేదో అధికారులే సమాధానం చెప్పాలి. ఆ వివరాలేమన్నా ఉంటే ఇవ్వండి నగరంలో చాలా గ్రూపులకు ఇంకా చెక్కులు అందలేదని తెలుస్తోంది. కానీ ఎవరూ మా దగ్గరకు రావడం లేదు. ఆయా సమస్యలపై స్థానిక సీవో, సోషల్ వర్కర్లు కూడా చెప్పలేదు. చెక్కులు అందకపోతే కార్యాలయానికి వచ్చి వివరాలు తెలియజేస్తే సమస్యను పరిశీలించి పరిష్కరిస్తాం. -ప్రకాశరావు, యూసీడీ ప్రాజెక్టు ఆఫీసర్ Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.