Jump to content

Recommended Posts

Posted

ఇంటర్నెట్‌డెస్క్‌: మే1 నుంచి ఇరాన్‌ నుంచి భారత్‌ చమురు దిగుమతులు నిలిచిపోనున్నాయి. ఒక్క భారత్‌ మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా 8 దేశాలకు ఇప్పటి వరకు ఇచ్చిన మినహాయింపులను కూడా నిలిపివేసింది. దీంతో ఇరాన్‌  నుంచి ఆయా దేశాలు చమురు కొనుగోళ్లను నిలిపివేయనున్నాయి. ఒక్క చైనా, టర్కీ మాత్రం కొనసాగించనున్నట్లు వెల్లడించాయి. మిగిలిన దేశాలు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కొనే పనిలో పడ్డాయి. ప్రపంచంలోనే భారత్‌ అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటి. దీంతో భారత్‌పై ఈ ప్రభావం అధికంగా ఉండనుంది. చమురు అత్యధికం ఉత్పత్తి చేసే దేశాల్లో వెనుజువెలా, ఇరాన్‌ కీలకమైనవి. వీటి నుంచి ఎగుమతులు నిలిచిపోతే ఆమేరకు చమురు మార్కెట్‌పై ఒత్తిడి పెరిగిపోతుంది. డిమాండ్‌ పెరిగే కొద్దీ ముడి చమురు ధర చుక్కల్ని తాకుతుంది. ఇప్పటికే ఈ ఏడాది బ్రెంట్‌ క్రూడ్‌ ధర దాదాపు 33శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో అత్యధిక ధరకు సమీపంలో ఉంది.  ఫలితంగా ఇరాన్‌, వెనుజువెలా తప్ప మిగిలిన చమురు ఉత్పాదక దేశాల సంస్థలకు, ప్రభుత్వాలకు కనకవర్షం కురవనుంది. కానీ, దిగుమతి చేసుకొనే దేశాలు అధిక ధరల భారాన్ని మాత్రం మోయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది అంతిమంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటును దారుణంగా దెబ్బతీసే ప్రమాదముంది.

 ప్రపంచ ఆర్థికవృద్ధికి పెను ప్రమాదం
ప్రపంచ జనాభా ఆదాయ వ్యయాలను పెరుగుతున్న చమురు ధరలు దెబ్బతీస్తాయి. ద్రవ్యోల్బణాన్ని దెబ్బతీస్తాయి. ప్రపంచంలో అత్యధిక చమురు దిగుమతి చేసుకొనే చైనా కూడా దీని నుంచి ఇబ్బందులు ఎదుర్కోనుంది. యూరప్‌లోని చాలా దేశాలు చమురు దిగుమతులపైనా ఆధారపడ్డాయి. దీనికి తోడు యూరప్‌లో చలికాలంలో చమురుకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. అప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారనుంది. చమురు వ్యయాలు పెరిగి మిగిలిన వస్తువులకు డిమాండ్‌ తగ్గడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదముంది. 

మరోపక్క చమురు ధర వేగంగా 100 డాలర్ల పైకి చేరటం అనేది డాలర్‌ బలపడటంపై ఆధారపడి ఉంటుంది. 2019 చివరి నాటికి బ్రెంట్‌ క్రూడ్‌ ధర 100 డాలర్లకు చేరితే 2020 సంవత్సరానికి అంచనా వేసిన ప్రపంచ జీడీపీ వృద్ధిరేటు 0.6శాతం తగ్గుతుంది. మరోపక్క ప్రపంచ ద్రవ్యోల్బణం కూడా 0.7శాతం పెరుగుతుంది. ఇప్పటికైతే చమురు ఉత్పత్తిని పెంచుతామని అమెరికా మిత్రదేశాలు చెబుతున్నాయి. కానీ ఏదైనా సమస్య ఎదురై అక్కడ చమురు ఉత్పత్తి తగ్గితే మాత్రం ధరలు ఆకాశాన్నంటుతాయి.

crude-oil.jpg

మార్కెట్‌పై ఇరాన్‌, ట్రంప్‌ ప్రభావం
ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో చమురు మార్కెట్‌పై చెప్పుకోదగ్గ ప్రభావం ఉంటుంది. రోజుకు దాదాపు 8,00,000 పీపాల చమురును ఇరాన్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ మేరకు చమురు కొరతను ఎదుర్కోవడానికి ఏర్పాట్లు చేసాయి. భౌగోళిక రాజకీయ మార్పులు ఈ కొరతను మరింత ఎగదోయవచ్చు. సౌదీఅరేబియా, యూఏఈతో కలిసి ఎటువంటి కొరత లేకుండా చూస్తామని అమెరికా హామీ ఇచ్చినా.. అమెరికాలో ఉత్పత్తి చేసే చమురు అక్కడి వినియోగానికే సరిపోతుంది. దీంతో సౌదీ, యూఏఈల ఉత్పత్తిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. 

అంతిమంగా లాభం ఎవరికీ.. నష్టం ఎవరికీ..?
చమురు ధరల పతనంతో అవస్థపడిన దేశాలు ఇప్పుడు లబ్ధిపొందే అవకాశాలు ఉన్నాయి. సౌదీ అరేబియా, రష్యా, నార్వే, నైజిరియా, ఈక్వెడార్‌ బాగా లబ్ధిపొందనున్నాయి. ఇరాన్‌ - అమెరికా విభేదాలతో చమురు ధరల పెరుగుదల కారణంగా సౌదీకి చెందిన పెట్రో దిగ్గజం అరామ్‌కో భారీగా లాభాలను మూటగట్టుకోనుంది.

అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో కీలకమైన విదేశీ మారకద్రవ్యం తరలిపోనుంది. కరెంటు ఖాతా లోటు, ద్రవ్యలోటు తలెత్తే ప్రమాదం ఉంది. ఫారెక్స్‌ నిల్వల్లోని డాలర్లు తరలిపోతుండటంతో దేశీయ కరెన్సీలు పతనం తప్పదు. దీంతో ఆయా దేశాల కేంద్ర బ్యాంకలు వడ్డీరేట్లను పెంచాల్సి వస్తుంది. ముఖ్యంగా టర్కీ, ఉక్రెయిన్‌, భారత్‌ నష్టపోయే దేశాల జాబితాలో ఉన్నాయి. 

దీంతోపాటు ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రబ్యాంక్‌లు కూడా వడ్డీ రేట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. వృద్ధిరేటు మందగించడంపై నుంచి దృష్టిని ద్రవ్యోల్బణం వైపు మళ్లించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికే ఐఎంఎఫ్‌ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు  అత్యంత సున్నితమైన దశలో ఉందని తెలిపింది. 

Posted

edho sollu mingaru gaa appataloo beef batch... USA lo emi fekina kooda India vall Iran nunche kontaru ani... ippudu emindhi raa Beef batch @3$%

Posted
Just now, solman said:

edho sollu mingaru gaa appataloo beef batch... USA lo emi fekina kooda India vall Iran nunche kontaru ani... ippudu emindhi raa Beef batch @3$%

we want usd =80inr ante 

Posted
Just now, kevinUsa said:

we want usd =80inr ante 

nope

100 kavali

Posted
Just now, solman said:

nope

100 kavali

thats awwesome 

Posted
Just now, kevinUsa said:

thats awwesome 

@3$%

Posted
17 minutes ago, kevinUsa said:

thats awwesome 

Manaku awesome , India lo unna vallaki Assaam

Posted
Just now, bhaigan said:

Manaku awesome , India lo unna vallaki Assaam

who cares uncle @3$%

Posted

Malli petrol rate lu peuguthayi May 1st nunchi

I already told about it nenu thread kuda vesa

Posted
Just now, bhaigan said:

Malli petrol rate lu peuguthayi May 1st nunchi

elections ayyipoganee start avutayi pergadam _-_

Posted
1 minute ago, Paidithalli said:

Hopefully it should raise to more than 75 

+_(

 

22 minutes ago, solman said:

nope

100 kavali

 

Posted
1 minute ago, solman said:

elections ayyipoganee start avutayi pergadam _-_

Doubt aa kachitanga peruguthayi

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...