snoww Posted May 4, 2019 Report Posted May 4, 2019 ఇది తెలంగాణ కమాండ్ 4 భారీ టవర్లు.. రాష్ట్రానికే మణిహారం వేగంగా పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు వేగంగా భవన నిర్మాణ పనులు ఇది రాష్ట్రానికే మణిహారం చుట్టూ నాలుగు ఎత్తయిన టవర్లు లక్షలాది సీసీ కెమెరాల అనుసంధానం ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం వ్యయం రూ.350 కోట్లు.. డిసెంబరు నాటికి పూర్తి అత్యాధునిక సాంకేతికతతో ఆవిష్కృతమవుతున్న ఆకాశ హర్మ్యాలవి. రాష్ట్రంలో ఏ మూల ఎక్కడ ఏం జరిగినా.. ఈ కేంద్రం నుంచే సమీక్షించేలా సరికొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తోంది. రూ.350 కోట్ల వ్యయంతో ఏడెకరాల విస్తీర్ణంలో 6 లక్షల చదరపు అడుగుల్లో టవర్లు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. చుట్టూ నాలుగు టవర్ల మధ్య నాలుగు అంతస్తుల్లో కమాండ్ కంట్రోల్ కేంద్రం సిద్ధమవుతోంది. తెలంగాణ పోలీసు వ్యవస్థకు తలమానికంగా, చుక్కానిలా భాసిల్లనున్న ఈ కేంద్రానికి రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాలను అనుసంధానిస్తారు. రాష్ట్రంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోయేలా వ్యవస్థ ఉంటుంది. ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారంగా రాజధాని హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ వడివడిగా కొలువుదీరుతోంది. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయిన ఈ భవనం మరో ఏడెనిమిది నెలల్లో పూర్తిస్థాయిలో సేవలందించేందుకు సిద్ధమవుతోంది. ఉండ్రు నరసింహారావు ఈనాడు - సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి చూస్తేనే వావ్ అనిపించే కట్టడం.. రాష్ట్రానికే వన్నె తెచ్చే భవంతి.. చారిత్రక కట్టడాల సరసన నిలిచే కార్యాలయం. అదే దేశంలోనే అతి పెద్ద పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్.. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థను అంతటినీ ఇక్కడి నుంచే పాలించవచ్చు. వారందరికీ ఆదేశాలివ్వవచ్చు. తెలంగాణలో ఏమూల చీమ చిటుక్కుమన్నా సీసీ కెమెరాల ద్వారా క్షణాల్లో తెలుసుకోవచ్చు. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో బాధిత ప్రాంతానికి, అధికారులకు ఇక్కడి నుంచే సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. ఇన్ని సౌకర్యాలు కల్పించాలంటే అదే స్థాయిలో ఓ కార్యాలయం అవసరం. అదే ప్రస్తుతం శరవేగంగా హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లో ఏడెకరాల విస్తీర్ణంలో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మితమవుతోంది. నేపథ్యం ఇదీ.. ప్రస్తుతం తెలంగాణ పోలీసు శాఖకు ఆధునిక సంపత్తితో కూడిన ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ అంటూ ఏమీ లేదు. రాష్ట్ర పోలీసు డీజీపీ, నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలోనే చిన్నస్థాయిలో ఈ కేంద్రాలున్నాయి. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి అన్ని రకాలుగా సేవలందించడానికి ఆధునిక సంపత్తితో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటే బావుంటుందని డీజీపీ మహేందర్‌రెడ్డి కొన్నేళ్ల కిందట ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం వెంటనే స్పందించి దీని నిర్మాణానికి రూ.350 కోట్ల నిధులను మంజూరు చేసింది. వెంటనే టెండర్లు పిలవగా ఇందులో షాపూర్జీ-పల్లంజీ కంపెనీతో పాటు ఎల్అండ్టీ రెండు ప్యాకేజీల కింద పనులను దక్కించుకున్నాయి. అతి పెద్ద భవనాన్ని రెండు సంస్థలు నిర్మించడం వల్ల సమన్వయలోపం, సాంకేతిక ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో మొత్తం నిర్మాణం పనులను షాపూర్జీ సంస్థ ప్రారంభించింది. 2016 డిసెంబరులో నిర్మాణం ప్రారంభించామని.. ప్రస్తుతం వేగంగా చేస్తున్నామని క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్న ఆర్అండ్బీ ఈఈ అశోక్ ‘ఈనాడు’కు తెలిపారు. టవర్ ‘ఎ’ను 20 అంతస్తుల ఎత్తులో 1.40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇందులో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కార్యాలయంతో పాటు.. నగర పోలీసులకు సంబంధించి ఇతర విభాగాలకు కేటాయించాలని నిర్ణయించారు. ఈ టవర్ 20వ అంతస్తు పైభాగంలో హెలిప్యాడ్‌ను కూడా నిర్మిస్తున్నారు. 14 సీటర్ల సామర్థ్యం గల హెలికాప్టర్ దీనిపై సునాయాసంగా దిగొచ్చు. టవర్ ‘బి, సి, డి’లను ఒక్కొక్కటి 16 అంతస్తుల ఎత్తులో 1.12 లక్షల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ‘బి’ టవర్‌లో పోలీసు శాఖకు చెందిన మొత్తం ఐటీ వ్యవస్థ కొలువై ఉంటుంది. ఇందులోనే వివిధ ఇతర శాఖల ఉన్నతాధికారులకు కార్యాలయాలు కేటాయించనున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినపుడు అన్ని శాఖల అధికారులు ఇక్కడికి చేరి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని సమీక్షించి ఆదేశాలివ్వడానికి వీలవుతుందని అధికారులు తెలిపారు. టవర్ ‘సి’లో 500 మంది కూర్చుని సమావేశాలు, సమీక్షలు ఇతరత్రా శిక్షణ కార్యాలయాలను నిర్వహించుకోవడానికి ఆడిటోరియం కూడా నిర్మిస్తున్నారు. ఈ టవర్‌లో ఎక్కువ భాగం లిప్ట్‌లు ఉన్నాయి. టవర్ ‘డి’ కింది భాగంలో మీడియా లాంజ్, కెఫెటేరియాతో పాటు పోలీసుల శిక్షణ కేంద్రం తదితరాలు ఉంటాయి. మరికొన్ని కార్యకలాపాల కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు. నాలుగు టవర్ల మధ్య ఉన్న స్థలంలో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మధ్యలో కింది ఖాళీ భాగాన్ని వివిధ అవసరాలకు ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. కమాండ్ సెంటర్ కోసం నాలుగంతస్తులను 44 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఒక్కో అంతస్తు 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. నాలుగో అంతస్తు డేటా సెంటర్ కాగా అయిదారు అంతస్తులను కమాండ్ కంట్రోల్ సెంటర్‌గా తీర్చిదిద్దారు. ఆకాశమార్గం ఈ భవనంలోని నాలుగు టవర్లను కలుపుతూ ఆకాశమార్గం ఏర్పాటు చేశారు. టవర్ ‘బి’లోని 14వ అంతస్తులో తెలంగాణ గొప్పతనాన్ని తెలియజేసే మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నారు. టవర్ ‘డి’ నుంచి ఈ ఆకాశమార్గంలోకి సందర్శకులు వచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను చూసి మ్యూజియంను సందర్శించేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. గాజు పలకలతో గోడలు ఈ మొత్తం భవనాల చుట్టూ ఎక్కడా సిమెంట్ గోడలు కనిపించవు. అన్ని టవర్లకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు 3 లక్షల చదరపు అడుగుల గాజు పలకలతో గోడలను నిర్మిస్తున్నారు. 5200 గాజు ప్యానళ్లను గోడల కింద వినియోగిస్తున్నారు. 0.53 మెగావాట్ సౌర విద్యుత్తు కూడా ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. రోజూ 180 కిలోలీటర్ల మురుగును శుద్ధి చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 630 కార్ల పార్కింగ్ కోసం రెండు సెల్లార్లను ఏర్పాటు చేశారు. వాచ్ టవర్లు కమాండ్ కంట్రోల్ సెంటర్ రక్షణకు ఈ కేంద్రం చుట్టూ ఎత్తయిన నలువైపులా నాలుగు వాచ్ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. కేబీఆర్ పార్కుకు ఆనుకుని ఉన్న ఈ భవనాల సముదాయం హైదరాబాద్‌లోనే ఎత్తయినదని చెబుతున్నారు. కార్యకలాపాలు ఇలా.. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 10 వేల సీసీ కెమెరాలను ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. మరో 90 వేలు ఏర్పాటు చేస్తున్నారు. నగర ప్రజలు, కాలనీ ఇతర సంఘాలు 2.90 లక్షల సీసీ కెమెరాలను కాలనీల్లో అమర్చుకున్నారు. రాష్ట్రంలోనూ కెమెరాలను ఈ కేంద్రానికి అనుసంధానిస్తారు. రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లు కూడా అనుసంధానమవుతాయి. డిసెంబరు నాటికి పూర్తి డిసెంబరు నాటికి కమాండ్ కంట్రోల్ సెంటర్ సముదాయం నిర్మాణం పనులను పూర్తి చేస్తాం. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయి. నిర్మాణం సంస్థ రేయింబవళ్లు పనులు చేయిస్తోంది. ఈఈ అశోక్‌తో పాటు ఇతర తమశాఖ ఇంజినీర్లు ఇక్కడే ఉండి పనులు వేగంగా చేపట్టడానికి కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌కు ఇదో చారిత్రక భవనం అవుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. - గణపతిరెడ్డి, ఆర్అండ్బీ ఈఎన్సీ రాష్ట్రానికే వన్నె తెస్తుంది కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ రాష్ట్రానికే వన్నె తెస్తుంది. ప్రభుత్వం కృషి వల్లే ఈ కేంద్రం వేగంగా నిర్మితమవుతోంది. పోలీసు శాఖకు ఈ కేంద్రం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. నేర నిరోధానికి తక్షణ చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని అనుకుంటున్నాం. - మహేందర్ రెడ్డి, డీజీపీ Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.