snoww Posted May 5, 2019 Report Posted May 5, 2019 జూలైలో కాళేశ్వరం 06-05-2019 02:32:21 లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ 4200 కోట్లు విడుదల 1200 చెక్‌డ్యాములు 3000 తూములు ఆ వెంటనే నీటి పంపింగ్‌కు శ్రీకారం వచ్చే వరద నీటి తరలింపునకు ఏర్పాట్లు పనుల పూర్తికి ఇంజనీర్లకు ఆదేశాలు చెరువులు, కుంటల్లోకి గోదావరి నీరు సరికొత్త గొలుసుకట్టు వ్యవస్థకు శ్రీకారం చెక్‌డ్యాములు, తూములకు నిధులు త్వరలోనే పనులు ప్రారంభం 45 రోజుల్లో తూములు సిద్ధం కావాలి తొమ్మిది నెలల్లో చెక్‌డ్యాంలు పూర్తవ్వాలి నిర్మాణాలకు సీఎం కేసీఆర్ గడువు కాళేశ్వరం పరిధిలో డిస్ర్టిబ్యూటరీ వ్యవస్థ అమల్లోకి రావడానికి సమయంపడుతుంది. కాళేశ్వరం నీటిని కొంతకాలం నేరుగా చెరువులు, కుంటల్లోకి వదలనున్నారు. ఇందుకోసం చిన్న చిన్న వాగులు, వంకలపై చెక్‌డ్యాంలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిని ఈ వాగుల్లోకి విడుదల చేస్తే.. చెక్‌డ్యాంలు, చెరువులు నిండి దిగువకు వెళతాయి. తద్వారా, రాష్ట్రంలో మరో గొలుసుకట్టు వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్, మే 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది జూలైలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ వెంటనే నీటి పంపింగ్ మొదలవుతుంది. ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించడానికి వీలుగా ఇంజనీర్లు నిర్మాణ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. జూలైనాటికి రాష్ట్రంలో వర్షాలు మొదలై, గోదావరి నదిలో వరద ప్రవాహం నమోదవుతుంది. ఈ వరద నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి దీని ద్వారా ఆయకట్టుకు సాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దాంతో, జూలై నుంచి నీటి పంపింగ్‌కు చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం నుంచి గ్రావిటీ కెనాల్‌ను పరీక్షించి, ప్రొటోకాల్ ఇన్‌స్పెక్షన్‌ను పూర్తి చేయనున్నారు. తర్వాత పంపులను నడిపించి నీటిని కెనాల్‌లోకి ఎత్తిపోయాలని భావిస్తున్నారు. ఇందుకు గోదావరి నదిలో కాఫర్ డ్యాంను ఏర్పాటు చేస్తున్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు దాదాపు పూర్తి కావచ్చాయి. దాంతో, మేడిగడ్డ నుంచి లిప్టు చేసే నీటిని ఈ రెండు బ్యారేజీల్లో నింపడానికి అవకాశం ఉంది. అనంతరం, ఈ నీటిని ఎల్లంపల్లికి తరలించనున్నారు. త్వరలోనే ప్యాకేజీ-7లోని టన్నెళ్లను కూడా పరీక్షించనున్నారు. ఇక, ప్యాకేజీ-8లోని పంపుల నిర్మాణం పూర్తయింది. అంటే.. మేడిగడ్డ నుంచి లిఫ్టు చేసే నీటిని అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు తీసుకురావడానికి అనుగుణంగా నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మిడ్‌మానేరుకు చేరుకున్న నీటిలో కొంత అక్కడి ఆయకట్టుకు అందించి, మిగిలిన నీటిని మల్లన్నసాగర్ వరకు తీసుకు రావడానికి వీలుగా పంప్‌హౌజ్‌లు, బ్యారేజీలు, కెనాల్ నిర్మాణ పనుల్ని నిర్వహిస్తున్నారు. వీటన్నిటినీ జూలై మొదటి వారానికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. 1200 చెక్‌డ్యాములు.. 3000 తూములు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తీసుకొచ్చే గోదావరి నీటిని కుంటలు, చెరువుల్లో నింపడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు పెద్దఎత్తున చెక్‌డ్యాములు, తూములు నిర్మిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏకంగా 1200 చెక్‌డ్యాములు, 3000 తూములు నిర్మించాలని నిర్ణయించింది. తూములను కేవలం 45 రోజుల్లో పూర్తి చేయాలని, చెక్‌డ్యాములను మాత్రం రాబోయే తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది. వీటికి సంబంధించిన పనులను ఈ నెలలోనే ప్రారంభించనుంది. సంబంధిత ప్రణాళికను ఖరారు చేశారు. వీటి నిర్మాణాల కోసం సుమారు రూ.4,200 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులను జారీ చేశారు. ఇప్పటికే ఉన్న చెరువులు, కుంటల్లో నీటిని నిండుగా ఉంచడానికి ప్రత్యేకంగా తూముల నిర్మాణాలను చేపట్టనున్నారు. ఇందుకు రూ.460 కోట్లను వ్యయం చేయనున్నారు. వీటి నిర్మాణాలను మరో పక్షం రోజుల్లో ప్రారంభించనున్నారు. అలాగే, రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న వాగులు, వంకలను అనుసంధానించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు వీటిపై వరుసగా 1200 చె క్‌డ్యాంలను నిర్మిస్తోంది. వీటి నిర్మాణాల కోసం సుమారు రూ.3,740 కోట్లను వ్యయం చేయనుంది. ఈనెల 25 లోపు వీటి నిర్మాణాలను ప్రారంభిస్తారు. రాబోయే 9 నెలల్లో వీటిని పూర్తి చేయాలని ఇంజనీర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన టెండర్ల ఖరారు ప్రక్రియపై ఇంజనీర్లు దృష్టిసారించారు. మరో గొలుసుకట్టు వ్యవస్థ ఇప్పటికే నీటిని సరఫరా చేస్తున్న కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, దేవాదుల వంటి పలు ప్రాజెక్టుల పరిధిలో ఇంకా పూర్తిస్థాయి డిస్ర్టిబ్యూటరీ వ్యవస్థ అందుబాటులోకి రాలేదు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో కూడా డిస్ర్టిబ్యూటరీ వ్యవస్థ అమల్లోకి రావడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే, ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిని నేరుగా చెరువులు, కుంటల్లోకి వదులుతున్నారు. కాళేశ్వరం నీటిని కూడా కొంతకాలం ఇలాగే వదిలి పెట్టనున్నారు. ఈ క్రమంలో వాగులు, వంకలపై చెక్‌డ్యాంలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిని ఈ వాగుల్లోకి విడుదల చేస్తే.. చెక్‌డ్యాంలు, చెరువులు నిండి దిగువకు వెళతాయి. తద్వారా, రాష్ట్రంలో మరో గొలుసుకట్టు వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఇలా దిగువకు నీటిని పంపిస్తే.. అన్ని ప్రాంతాల్లోనూ పంటలను పండించడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.