kakatiya Posted May 6, 2019 Report Posted May 6, 2019 గుర్తు మార్చారంటూ నిరసన చర్ల, న్యూస్‌టుడే: మండలంలోని లక్ష్మీకాలనీ మప్రాని స్థానంలో జనసేన నుంచి పోటీ చేసిన తనకు బ్యాట్ గుర్తు కేటాయించాల్సిన అధికారులు స్వతంత్ర అభ్యర్థిగా చూపి ఎయిర్ కండిషనర్ గుర్తును కేటాయించారంటూ పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థి కుంజా లావణ్య జనసేన కార్యకర్తలు కొద్దిసేపు నిరసన తెలిపారు. నామినేషన్ దాఖలు సందర్భంగా తాను బీఫాం ఇచ్చానని లావణ్య పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారికి బీఫారం ఇచ్చిన తాను అదే నమ్మకంతో బ్యాట్ గుర్తుతో ప్రచారం చేసుకున్నానని తీరా అధికారులు తనకు ఎయిర్ కండిషనరు గుర్తును కేటాయించారని ఆందోళన నిర్వహించారు. గుర్తును మార్చిన అధికారులు పోలింగ్‌ను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని ఆందోళన చేశారు. సీఐ రాజగోపాల్, ఎస్సై రాజువర్మ ఆందోళన వద్దకు చేరుకొని అభ్యర్థితో మాట్లాడారు. ఫాం నెం-9లో ప్రచురించిన సందర్భంలో అభ్యంతరం పెట్టకుండా గుర్తు మారిందని ఆందోళన చేయడం సరికాదని అన్నారు. నిరసనకు దిగిన వారిని పోలీసులు అక్కడ నుంచి పంపించి వేశారు. ఎంపీడీవో కార్యాలయంలో కొద్దిసేపు కార్యకర్తలు నిరసన తెలిపారు. తాను సమర్పించిన నామినేషన్ పత్రాల్లో బీఫారం లేకుంటే తాము వెనుదిరిగి పోతామంటూ అభ్యర్థి లావణ్యతో పాటు కార్యకర్తలు అధికారులను నిలదీశారు. నామపత్రం దాఖలు సందర్భంలో బీఫాం ఇవ్వలేదని అందుకే స్వతంత్ర అభ్యర్థిగా ఫాం-9లో ప్రకటించామని రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించామని ఆర్వో తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఆందోళన వద్దకు చేరుకున్న ఎస్సై రాజువర్మ అక్కడి నుంచి ఆందోళన చేస్తున్న వారిని పంపించి వేశారు. Quote
Ram47 Posted May 7, 2019 Report Posted May 7, 2019 pk gaadu em settunnadu.. farm house lo kulukutunnada Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.