snoww Posted May 6, 2019 Report Posted May 6, 2019 పోలవరంపై బాబు గారి నాటకాలలో మరో వాయిదా అంకం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ‘పోలవరం’ పనులను పరిశీలించిన చంద్రబాబు అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం 2020 జూన్ నాటికి నీటిని విడుదల చేస్తామని మాట మార్చిన వైనం బాబు పెట్టిన గడువు నాటికి ప్రాజెక్టును పాక్షికంగా కూడా పూర్తి చేయడం అసాధ్యం తేల్చిచెబుతున్న సాగునీటి రంగ నిపుణులు, అధికార వర్గాలు వాస్తవానికి బాబు చేసింది చాలా తక్కువ.. ఇప్పటికీ పునాది స్థాయి దాటని ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్, జలవిద్యుత్ కేంద్రం పనులు పోలవరానికి 59 నెలల్లో ఖర్చు చేసింది రూ.11,358.26 కోట్లు మాత్రమే 2005 నుంచి 2009 వరకూ 44.84 శాతం పనులు పూర్తి చేసిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిదే కుడి, ఎడమ కాలువల పనులు వైఎస్ఆర్ హయాంలోనే దాదాపు పూర్తి కమీషన్ల కోసమే చంద్రబాబు పోలవరంలో పర్యటించారంటున్న అధికారులు సాక్షి, అమరావతి: ఎన్నికల్లో నెగ్గడానికి అడ్డగోలుగా హామీలిచ్చి, గద్దెనెక్కాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టే విద్యలో ఆరితేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చివరి రోజుల్లోనూ తన తీరు మార్చుకోవడం లేదు. అవే అబద్ధాలు.. అవే మోసపూరిత ప్రకటనలు. ఈ ఏడాది జూన్ నాటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి, గ్రావిటీపై కాలువలకు నీటిని విడుదల చేస్తామని ఇటీవల ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గొప్పగా ప్రచారం చేసుకోవడాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కానీ, ఈ ఏడాది పోలవరం నుంచి నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని చంద్రబాబు సోమవారం తేల్చిచెప్పారు. 2020 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పాక్షికంగా పూర్తిచేసి, గ్రావిటీపై ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామంటూ మాట మార్చారు. కేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పాక్షికంగా కూడా పూర్తి చేయడం అసాధ్యమని సాగునీటి రంగ నిపుణులు, జలవనరుల శాఖ అధికారులే కుండబద్దలు కొడుతున్నారు. అంటే అధికారాంతమున కూడా అబద్ధాల బాబు తన సహజ గుణాన్ని వదులుకోలేదని తేటతెల్లమవుతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి మరీ చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించారు. కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచి, తనకు రావాల్సిన కమీషన్లు వసూలు చేసుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పోలవరం పనులు పరిశీలించి, సమీక్షా సమావేశం నిర్వహించారని సాక్షాత్తూ అధికార వర్గాలే ఆరోపిస్తున్నాయి. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టు.. చంద్రబాబు చేతుల్లోకి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వంద శాతం ఖర్చుతో తామే నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తే కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకోలేమని భావించిన చంద్రబాబు.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే దక్కేలా చక్రం తిప్పారు. 2016 సెప్టెంబరు 7న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. ఆ మరుసటి రోజే పోలవరం హెడ్ వర్క్స్ వ్యయాన్ని చంద్రబాబు రూ.4,054 కోట్ల నుంచి రూ.5,535.41 కోట్లకు పెంచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే 2009 నాటికే దాదాపుగా పూర్తయిన కుడి కాలువ పనుల అంచనా వ్యయాన్ని రూ.2,240.86 కోట్ల నుంచి రూ.4,375.77 కోట్లకు, ఎడమ కాలువ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,954.74 కోట్ల నుంచి రూ.3,645.15 కోట్లకు చంద్రబాబు పెంచేశారు. ఆ తర్వాత హెడ్‌వర్క్స్‌తోపాటు కాలువ పనులన్నీ నామినేషన్‌పై అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి, ప్రతి సోమవారం వర్చువల్ రివ్యూలు నిర్వహించి, కమీషన్లు వసూలు చేసుకుంటూ వస్తున్నారనే విమర్శలు టీడీపీ వర్గాల నుంచే వ్యక్తమయ్యాయి. జనవరిలో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల నుంచి రూ.55,548.87 కోట్లకు పెంచేందుకు కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఎప్పటికప్పుడు గడువు పెంపు పోలవరం ప్రాజెక్టును 2018 జూన్ నాటికే పూర్తిచేసి, గ్రావిటీపై కాలువలకు నీటిని విడుదల చేస్తామని 2016 సెప్టెంబరు 9న శాసనసభ సాక్షిగా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయనకు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వంత పాడారు. 2018 జూన్ నాటికి పనులు కొలిక్కి రాకపోవడంతో గడువును 2018 డిసెంబర్‌కు పెంచారు. కానీ, అప్పటికీ పనులు ఒక దశకు చేరుకోకపోవడంతో 2019 జూన్ నాటికి ప్రాజెక్టు పనులు పాక్షికంగా పూర్తిచేసి, గ్రావిటీపై ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలోనూ.. రోడ్ షోలోనూ ఇదే విషయాన్ని చంద్రబాబు పదేపదే వల్లె వేశారు. తాజాగా పోలవరం పనులను స్వయంగా పరిశీలించిన చంద్రబాబు 2020 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తిచేసి, గ్రావిటీపై నీటిని విడుదల చేస్తామని చెప్పడం చూసి రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి... గత ఐదేళ్లలో అక్షరాలా 90 సార్లు వర్చువల్ రివ్యూలు.. 29 సార్లు క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా చంద్రబాబు పోలవరం పనులను పర్యవేక్షించారు. కానీ, ప్రాజెక్టు పనుల్లో ప్రధానమైన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్, జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులు పునాది స్థాయిని కూడా దాటలేదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతి లేకుండా ఎలాంటి సమీక్షలు, సమావేశాలు నిర్వహించకూడదు. కానీ, చంద్రబాబు ఏప్రిల్ 17న పోలవరం పనులను వర్చువల్ రివ్యూ ద్వారా సమీక్షించారు. తమ అనుమతి తీసుకోకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. సమీక్షా సమావేశంలో పాల్గొన్న జలవనరుల శాఖ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, సీఈ శ్రీధర్‌లను వివరణ కోరింది. కానీ, సీఎం చంద్రబాబు ఈసీ నోటీసులను ఖాతరు చేయకుండా సోమవారం పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండానే ఈఎస్ఈ ఎం.వెంకటేశ్వరరావు, సీఈ శ్రీధర్ తదితర అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. నత్త నడకన దిగువ కాఫర్ డ్యామ్ పనులు ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి వీలుగా దిగువన మరో కాఫర్ డ్యామ్‌ను 1,660 మీటర్ల పొడవు, 30.5 మీటర్ల ఎత్తుతో నిర్మించాలి. ఈ పనుల్లో 26.84 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులకుగానూ.. 4.47 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు మాత్రమే చేశారు. మిగతా 22.37 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు నత్త నడకను తలపిస్తున్నాయి. ఈ సీజన్లో అంటే జూన్ నాటికి ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులు పూర్తయ్యే అవకాశం లేదు. జూన్ నుంచి డిసెంబర్ రెండోవారం వరకూ గోదావరిలో వరద ప్రవాహం ఉండటం వల్ల పనులు చేయలేని పరిస్థితి. వీటిని పరిశీలిస్తే.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులను 2020 నాటికి పూర్తి చేయడం సాధ్యం కాదని అధికార వర్గాలు తేల్చిచెబుతున్నాయి. వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే... పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులు పునాది దశను కూడా దాటకపోవడంతో చంద్రబాబు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని సోమవారం ప్రకటించారు. గత 59 నెలల్లో రూ.11,358.26 కోట్లు ఖర్చు చేసి అతి కొద్దిగా మాత్రమే పనులు చేశారు. ఈ మొత్తంలో రూ.6,727.26 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసింది. ఇచ్చిన నిధులకు లెక్కలు చెబితే మిగతా రూ.4,631 కోట్లు కూడా విడుదల చేస్తామని స్పష్టం చేసినా, చంద్రబాబు నోరెత్తడం లేదు. 2005 నుంచి 2009 వరకూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు పనులకు రూ.5,135.87 కోట్లు ఖర్చు చేసి, 44.84 శాతం పనులు పూర్తి చేయడం గమనార్హం. 2020 నాటికి పాక్షికంగా పూర్తి చేయడం అసాధ్యమే - పోలవరం జలాశయం పనుల్లో భాగంగా 2,454 మీటర్ల పొడవుతో, 53.32 మీటర్ల ఎత్తుతో ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్(ఈసీఆర్ఎఫ్)ను నిర్మించాలి. 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేసేది ఈసీఆర్‌ఎఫ్‌లోనే. ఈసీఆర్ఎఫ్ నిర్మాణంలో ఇప్పటివరకూ పునాది(డయాఫ్రమ్ వాల్) పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఆ పనులను నాసిరకంగానే చేశారు. వర్షాకాలంలో వచ్చిన చిన్నపాటి వరదలకే పునాది గోడలు బీటలు వారి.. కొన్నిచోట్ల శిథిలమయ్యాయి. - కుడి, ఎడమ కాలువలకు నీటిని సరఫరా చేసే అనుసంధానం (కనెక్టివిటీస్) పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారాయి. జలాశయం నుంచి కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయడానికి హెడ్ రెగ్యులేటర్లు.. కుడి వైపున రెండు టన్నెల్లు.. ఎడమ వైపు ఒక టన్నెల్ తవ్వాలి. కుడి వైపున అనుసంధానం పనులు 74.81 శాతం, ఎడమ వైపున అనుసంధానం పనులు 48.51 శాతమే పూర్తయ్యాయి. - పోలవరం కుడి కాలువలో 177.9 కిలోమీటర్లకు గానూ 145 కిలోమీటర్ల పొడవున లైనింగ్‌తో సహా.. ఎడమ కాలువ పనుల్లో 210.92 కిలోమీటర్లకు గానూ 134 కిలోమీటర్ల పనులను లైనింగ్‌తో సహా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేశారు. మట్టి పనులు అధిక శాతం అప్పట్లోనే పూర్తయ్యాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కుడి కాలువలో మిగిలిన మట్టి పనులు పూర్తి చేశారు. ఇప్పటికీ 19 కిలోమీటర్ల పొడవున కాలువను లైనింగ్ చేయాల్సి ఉంది. మరో 49 కాంక్రీట్ నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. ఎడమ కాలువలో ఇప్పటికీ 30.66 శాతం పనులు మిగిలిపోయాయి. వీటిని కూడా 2020 నాటికి పూర్తి చేయడం సాధ్యం కాదని అధికారులు వెల్లడిస్తున్నారు. - 2009 నాటికే లక్ష ఎకరాలను వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే సేకరించడం గమనార్హం. ఇంకా 55,599.35 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ముంపు గ్రామాలకు చెందిన 1,05,601 నిర్వాసిత కుటుంబాలకు గానూ 3,922 కుటుంబాలకు మాత్రమే ఇప్పటివరకూ పునరావాసం కల్పించారు. అంటే.. ఇంకా 1,01,679 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. భూసేకరణ, పునరావాసం పనులు 2020 నాటికి పూర్తయ్యే అవకాశాలే లేవని అధికారులు పేర్కొంటున్నారు. - పోలవరం జలాశయానికి అనుబంధంగా 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించాల్సిన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణ పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. - క్షేత్రస్థాయిలో పనుల తీరు ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం యథాప్రకారం 2020 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పాక్షికంగా పూర్తిచేసి, గ్రావిటీపై కాలువలకు నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంపై అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. చాలా సమయం పడుతుంది.. ‘‘పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే, స్పిల్ చానల్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులు పూర్తి కాలేదు. ఈ సీజన్లో కాఫర్ డ్యామ్‌లు పూర్తయ్యే అవకాశం లేదు. కాఫర్ డ్యామ్‌లు నిర్మించి, గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించాలంటే.. స్పిల్ వేకు 48 గేట్లు అమర్చాలి. స్పిల్ చానల్ నిర్మాణం పూర్తి చేయాలి. స్పిల్‌వే, స్పిల్ చానల్‌ను నాణ్యతగా పూర్తి చేయడం నెలల్లో అయ్యేది కాదు. వీటికి సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులు పూర్తి చేయడానికి కూడా ఏళ్లు పడుతుంది. కాలువలకు నీటిని విడుదల చేసే అనుసంధానాల పనులు, కాలువల్లో మిగిలిపోయిన పనులు, పునరావాసం పనులు పూర్తి చేయడం ఇప్పట్లో అయ్యేది కాదు. మూడేళ్ల కంటే ఎక్కువ సమయమే పడుతుంది. ఈ లెక్కన 2020 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడం అసాధ్యమే.’’ – సీతాపతిరావు, ప్రభుత్వ సాగునీటి శాఖ మాజీ సలహాదారు ఎగువ కాఫర్ డ్యామ్.. ఎప్పటికి పూర్తయ్యేనో..! ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి వీలుగా గోదావరి నదిని స్పిల్ వే మీదుగా మళ్లించడానికి ఎగువన 2,454 మీటర్ల పొడవున కాఫర్ డ్యామ్ నిర్మించాలి. దీన్నే 41.5 మీటర్ల ఎత్తుతో నిర్మించి, గ్రావిటీ ద్వారా కాలువలకు నీటిని విడుదల చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణంలో 72.56 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులకుగాను.. ఇప్పటిదాకా 21.51 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు మాత్రమే చేశారు. నత్తనడకన పనులు సాగుతుండటంతో మిగతా 51.05 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తకావడానికి ఎంతకాలం పడుతుందో అంచనాకు అందడం లేదు. స్పిల్‌వే పనులు పూర్తి కావడం కష్టమే పోలవరం ప్రాజెక్టులో నీటినిల్వ గరిష్ట స్థాయికి చేరిన తర్వాత వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయడానికి స్పిల్‌వే (కాంక్రీట్ ఆనకట్ట) నిర్మించాలి. స్పిల్‌వేను 1054.4 మీటర్ల పొడవున 53.32 మీటర్ల ఎత్తుతో నిర్మించాలి. స్పిల్‌వేకు 25.72 మీటర్ల వద్ద(క్రస్ట్ లెవల్) 48 చోట్ల.. 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తు అంటే 45.72 మీటర్ల వరకూ(ఎఫ్ఆర్ఎల్) గేట్లు ఏర్పాటు చేయాలి. ఈ స్పిల్‌వే పనుల్లో 38.88 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకుగానూ.. ఇప్పటివరకూ 26.28 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేశారు. మరో 12.60 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయాలి. స్పిల్ వేకు 48 గేట్లకుగానూ ఒకచోట మాత్రమే కేవలం స్కిన్ ప్లేట్‌ను అమర్చారు. ఒక్కో గేటును అమర్చడానికి 30 నుంచి 35 రోజుల సమయం పడుతుంది. గేట్లు ఎత్తడానికి దించడానికి వీలుగా ఒక్కో గేటుకు రెండు చొప్పున 96 హైడ్రాలిక్ హాయిస్ట్‌లను అమర్చాలి. వాటిని జర్మనీ నుంచి ఇంకా దిగుమతి చేసుకోలేదు. ఈ పనులు 2020 నాటికి పూర్తి కావడం సాధ్యం కాదని అధికార వర్గాలు అంటున్నాయి. పోలవరం నుంచి నీళ్ల విడుదలపై చంద్రబాబు మార్చిన గడువులు మొదటి గడువు జూన్ 2018 రెండో గడువు డిసెంబర్ 2018 మూడో గడువు జూన్ 2019 తాజా గడువు జూన్ 2020 Quote
snoww Posted May 6, 2019 Author Report Posted May 6, 2019 Quote పోలవరం నుంచి నీళ్ల విడుదలపై చంద్రబాబు మార్చిన గడువులు మొదటి గడువు జూన్ 2018 రెండో గడువు డిసెంబర్ 2018 మూడో గడువు జూన్ 2019 తాజా గడువు జూన్ 2020 Enni June lu postpone ina parledu antunna @psycopk Deadlines are joke in India antunna @futureofandhra Quote
snoww Posted May 6, 2019 Author Report Posted May 6, 2019 వచ్చే ఏడాదే ‘గ్రావిటీ’! 07-05-2019 03:06:33 ఈ ఖరీఫ్‌కు పోలవరం నీరివ్వలేం కేంద్రం సహాయ నిరాకరణే కారణం: సీఎం ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటన కీలక పనుల పురోగతిపై ప్రత్యక్ష పరిశీలన అధికార్లు, ఇంజనీర్లతో సమీక్ష జూన్ నెలాఖరుకు కాఫర్ డ్యాంలు పూర్తి 4,727 కోట్లు రీయింబర్స్ రావాలి నిర్వాసితులకు తక్షణమే 2,800 కోట్లు కావాలి తుది అంచనాలకు మోక్షమెప్పుడు: సీఎం రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ‘పూర్తి’ లక్ష్యం మరో ఏడాది వాయిదా పడింది. ఈ ఖరీఫ్‌లోనే గ్రావిటీ ద్వారా నీరివ్వాలని, ఈ ఏడాది చివరికి ప్రాజెక్టు పూర్తి చేయాలని గట్టిగా భావించినప్పటికీ.... కేంద్ర సహాయ నిరాకరణ, నిధుల కొరత, ఇతర సాంకేతిక సమస్యలు అడ్డంకిగా నిలిచాయి. సవరించిన అంచనాలను అంగీకరించకుండా ఐదేళ్లుగా సాగదీయడం కేంద్రం వైఖరికి నిదర్శనమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అమరావతి, మే 6 (ఆంధ్రజ్యోతి): కేంద్రం సహాయ నిరాకరణ చేయడంతో పోలవరం నుంచి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో గ్రావిటీతో నీటిని ఇవ్వలేకపోతున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. ఇది ఆయనకు 31వ క్షేత్రస్థాయి పర్యటన కావడం గమనార్హం. ప్రాజెక్టు వద్ద హెలికాప్టర్ దిగుతూనే హోమం వద్దకు చేరి పూజలో పాల్గొన్నారు. అనంతరం కాఫర్ డ్యాం పనులను సమీక్షించారు. పనుల్లో జాప్యానికి కారణాలు తెలుసుకున్నారు. పనుల వేగం పెంచాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. గత నెలలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) క్షేత్రస్థాయి పర్యటన.. 24, 25 తేదీల్లో విజయవాడలో నిర్వహించిన సమీక్షలకు సంబంధించిన వివరాలను ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ శ్రీధర్, నవయుగ ఎండీ శ్రీధర్ ఆయనకు వివరించారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. రాష్ట్రాభివృద్ధితో సహా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఎక్కడ నిధుల సమస్య రాకుండా చూస్తున్నామని తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా శరవేగంగా నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. ‘ప్రాజెక్టు కోసం ఇప్పటిదాకా రూ.16,493 కోట్లు ఖర్చుచేశాం. ఇందులో రాష్ట్ర వాటా రూ.5,138 కోట్లు పోను.. రూ.11,357 కోట్లు కేంద్ర వ్యయం కిందకు వస్తుంది. మనకు ఇంకా రూ.4,727 కోట్లు రీయింబర్స్మెంట్ కింద రావలసి ఉంది.నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు తక్షణంరూ.2,800 కోట్లు కావాలి’ అని చెప్పారు. కేంద్రం నిధులిచ్చి సహకరిస్తే ఈపాటికి ప్రాజెక్టు పూర్తయి ఉండేదన్నారు. ప్రాజెక్టు తుది అంచనా వ్యయం రూ.55,892 కోట్లకు కేంద్ర జల వనరుల శాఖ పరిధిలోని సాంకేతిక సలహా మండలి (టీఏసీ) ఆమోదం తెలిపినా ఇప్పటికీ కేంద్ర జల వనరుల శాఖ, కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలపలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్రమే ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వాల్సి ఉందని గుర్తుచేశారు. 2015 నుంచి పనుల్లో వేగం ప్రాజెక్టు పనుల్లో వేగం 2015 నుంచి పెరిగిందని ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే నెల 15 నాటికి ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులు సేఫ్ (భద్రతా) స్థాయిలోకి వచ్చేస్తాయన్నారు. జూన్ నెలాఖరుకు ఈ డ్యాంలు పూర్తవుతాయని స్పష్టం చేశారు. ‘ఇవి పూర్తయ్యాక.. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణం పనులు చేపడతాం. కేంద్రం సహకరించి ఉంటే ఈ సీజన్లోనే గ్రావిటీ ద్వారా నీటిని అందించి ఉండేవాళ్లం. 24 గంటల్లో 32 వేల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు చేపట్టి గిన్నీస్ రికార్డులకు పోలవరం ఎక్కింది. 2020 నాటికి గ్రావిటీ ద్వారా నీటిని విడుదల చేస్తాం’ అని హామీఇచ్చారు. 75 శాతానికి చేరుకున్న కాంక్రీట్ పనులు ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు పనులు 70.99 శాతం పూర్తయ్యాయి. ఇందులో హెడ్‌వర్క్స్ పనులు 62.55 శాతం, మట్టి తవ్వకం పనులు 85.50 శాతం, కాంక్రీట్ పనులు 74.80 (దాదాపు 75 శాతం) జరిగాయి. అత్యంత ప్రధానమైన రేడియల్ గేట్ల బిగింపు పనుల 69.14 శాతం వరకూ జరిగాయి. డయాఫ్రం వాల్, జెట్ గ్రౌటింగ్ పనులు ఇప్పటికే సంపూర్ణమయ్యాయి. ఎగువ కాఫర్ డ్యాం 51.60 శాతం, దిగువ కాఫర్ డ్యాం పనులు 29.96 శాతం వరకూ జరిగాయి. ఎడమ కాలువ కనెక్టివిటీ పనులు 48.57, కుడి కాలువ కనెక్టివిటీ పనులు 76.58 శాతం దాకా జరిగాయి. కుడి ప్రధాన కాలువ పనులు 91.14 శాతం, ఎడమ ప్రధాన కాలువ పనులు 48.57 శాతం మేర జరిగాయని ప్రాజెక్టు అధికారులు సీఎంకు నివేదించారు. జూన్ నాటికి చింతలపూడి పూర్తయి తీరాలి ఈ ఏడాది జూన్ నాటికి చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి కావలసిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతం వద్ద ప్రాధాన్య ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. చింతలపూడి పథకం పనుల జాప్యంపై ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనులను వచ్చే నెలాఖరునాటికి పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు. Quote
snoww Posted May 6, 2019 Author Report Posted May 6, 2019 Quote ఈ ఖరీఫ్‌కు పోలవరం నీరివ్వలేం కేంద్రం సహాయ నిరాకరణే కారణం: సీఎం ee mukka 2 weeks back theliyada 2019 june lopu water istham ani sollu seppinappudu elections speeches lo Quote
Android_Halwa Posted May 6, 2019 Report Posted May 6, 2019 Sendranna daridralu anni inni kaavu le... I saw his interview from Polavaram, He said Polavaram is life line for AP and is the most prestigious project to be built in India after Independence... eedi bonda..1995-2004 varaku CM ga vundi, central support vundi kuda Polavaram file ni okka inch kuda move cheyalekapoindu....YSR moolaki padina ie project ni revive chesi initiate chesi, construction start ayinaka eedu malli CM ayyi, timepass ki Polavaraniki poi kathalu padukunta , inauguiratuons chesukunta , paisal dobbi poroject ni delay chesi. ip[udemo as usual 'Kendram Mondicheyyi' ani edupu.. induke, Nakka anedi Quote
thamudu_satyam Posted May 7, 2019 Report Posted May 7, 2019 45 minutes ago, solman said: ravali ravali @Langa gallu... Irrespective of Langas or gorres as you have addressed them commenting against/abusing you, the mere fact your pea sized intellect still cannot fathom what is right or wrong still baffles me. I should definitely meet the visa officer who issued your visa, the university admissions committee who approved ur I-20 . Would like to meet and discuss how those individuals who deemed a pea sized intelllect who blindly follows a Charlatan without having the sense of reality can be considered worthy of an admission to university. Before your pea sized intellect tries to even think, let me decipher it for you . I joined DB recently and i dont subscribe to any party/religion/caste/creed/region. My only intention is bashing brainwashed pea sized intellect pulkas. Now go ahead and call me fake as pulkas usually do. That is the only defense mechanism imbecile pulkas can come up with. You are so afraid of the truth being told about the wily old fox, you think by posting the above you'll discourage ppl . Time and again pulkas prove their pea sized brain is programmed to only believe ABN and the charlatan . pea sized brains of pulkas can never muster courage to argue logically or accept the truth. Your pea sized brain cannot come up with anything other than tagging others or calling names. Go ahead do the same. 1 Quote
Hydrockers Posted May 7, 2019 Report Posted May 7, 2019 1 hour ago, snoww said: ee mukka 2 weeks back theliyada 2019 june lopu water istham ani sollu seppinappudu elections speeches lo Adhi Edo believe in babu anta Rei come with fact ante malli mutton Biryani ani eduru dadi Quote
snoww Posted May 7, 2019 Author Report Posted May 7, 2019 43 minutes ago, Hydrockers said: Adhi Edo believe in babu anta Rei come with fact ante malli mutton Biryani ani eduru dadi Time ledu samara Quote
Idassamed Posted May 7, 2019 Report Posted May 7, 2019 1 hour ago, Hydrockers said: Adhi Edo believe in babu anta Rei come with fact ante malli mutton Biryani ani eduru dadi Leave the politics to the leader samara Quote
JambaKrantu Posted May 7, 2019 Report Posted May 7, 2019 2 hours ago, thamudu_satyam said: Irrespective of Langas or gorres as you have addressed them commenting against/abusing you, the mere fact your pea sized intellect still cannot fathom what is right or wrong still baffles me. I should definitely meet the visa officer who issued your visa, the university admissions committee who approved ur I-20 . Would like to meet and discuss how those individuals who deemed a pea sized intelllect who blindly follows a Charlatan without having the sense of reality can be considered worthy of an admission to university. Before your pea sized intellect tries to even think, let me decipher it for you . I joined DB recently and i dont subscribe to any party/religion/caste/creed/region. My only intention is bashing brainwashed pea sized intellect pulkas. Now go ahead and call me fake as pulkas usually do. That is the only defense mechanism imbecile pulkas can come up with. You are so afraid of the truth being told about the wily old fox, you think by posting the above you'll discourage ppl . Time and again pulkas prove their pea sized brain is programmed to only believe ABN and the charlatan . pea sized brains of pulkas can never muster courage to argue logically or accept the truth. Your pea sized brain cannot come up with anything other than tagging others or calling names. Go ahead do the same. aadoka db fichi fook gaad le.. Comedy ni enjoy cheyy baa.. 1 Quote
bhaigan Posted May 7, 2019 Report Posted May 7, 2019 4 hours ago, Android_Halwa said: Sendranna daridralu anni inni kaavu le... I saw his interview from Polavaram, He said Polavaram is life line for AP and is the most prestigious project to be built in India after Independence... eedi bonda..1995-2004 varaku CM ga vundi, central support vundi kuda Polavaram file ni okka inch kuda move cheyalekapoindu....YSR moolaki padina ie project ni revive chesi initiate chesi, construction start ayinaka eedu malli CM ayyi, timepass ki Polavaraniki poi kathalu padukunta , inauguiratuons chesukunta , paisal dobbi poroject ni delay chesi. ip[udemo as usual 'Kendram Mondicheyyi' ani edupu.. induke, Nakka anedi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.