Jump to content

Recommended Posts

Posted
Heavy Rain and Windy winds In Capital Amaravati Area - Sakshi

సచివాలయం నాలుగో బ్లాక్‌ మధ్యలో కూలిన స్మార్ట్‌పోల్‌

రాజధాని ప్రాంతంలో బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం 

భయభ్రాంతులకు గురైన ఉద్యోగులు, సందర్శకులు

కూలిన ‘రూ.25 లక్షల’ స్మార్ట్‌పోల్‌

గాలికి సచివాలయంలోని బ్లాకులపై ఎగిరిపోయిన రేకులు 

పోలీసుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, షెడ్లు ధ్వంసం  

నిర్మాణ దశలో ఉన్నభవనాల వద్ద గందరగోళం 

నేలపాడులోని తాత్కాలిక హైకోర్టు వద్దా అదే పరిస్థితి

కృష్ణా జిల్లాలో చెట్టు కూలి ఒకరు, గుంటూరు జిల్లాలో

పిడుగు పడి మరొకరు మృతి

సాక్షి నెట్‌వర్క్‌: భారీ వర్షం, ఈదురు గాలుల బీభత్సానికి రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతం చిగురుటాకులా వణికిపోయింది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సందర్శకులు భయభ్రాంతులకు గురయ్యారు. బలమైన గాలులతో కూడిన వర్షం రావడంతో రాజధానిలో నిర్మాణ దశలో ఉన్న భవనాల వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వెంటనే ఈదురు గాలులతో కూడిన వర్షం మొదలైంది. తాత్కాలిక సచివాలయం వద్ద రూ.25 లక్షల వ్యయంతో ఇటీవలే ఏర్పాటు చేసిన స్మార్ట్‌పోల్‌ గాలుల ధాటికి కుప్పకూలిపోయింది. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సచివాలయంలోని బ్లాకులపై ఏర్పాటు చేసిన రేకులు ఎగిరిపోయాయి. సచివాలయం ప్రవేశ మార్గం వద్ద పోలీసుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, షెడ్లు నేలకూలాయి. భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పోల్స్‌ కూడా నేలకొరిగాయి. కేవలం పది నిమిషాల పాటు కురిసిన గాలివానకే తాత్కాలిక సచివాలయం వద్ద భారీగా ఆస్తినష్టం వాటిల్లడం గమనార్హం. గతంలో వర్షాలకు తాత్కాలిక సచివాలయంలోని వివిధ బ్లాకుల్లో నీరు కారడమే కాకుండా పెచ్చులూడి కింద పడిన సంగతి తెలిసిందే. 
Untitled-3.gifగాలి వానకు హైకోర్టు ప్రాంగణంలోని పడిపోయిన సందర్శకుల షెడ్లు   

తాత్కాలిక హైకోర్టు వద్ద భయానక వాతావరణం 
రాజధాని ప్రాంతంలోని నేలపాడులో నిర్మించిన తాత్కాలిక హైకోర్టు వద్ద గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. గాలి తీవ్రతకు ప్రధాన ద్వారం వద్ద పెద్ద గాజు తలుపు పగిలిపోయింది. హైకోర్టు ఎదురుగా వాహనాల పార్కింగ్‌ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీటిపై ఉన్న రేకులన్నీ ఎగిరిపోయాయి. హైకోర్టు పైన చుట్టూ ఏర్పాటు చేస్తున్న ఇనుప షీట్లు కూడా గాలికి కొట్టుకుపోయాయి. హైకోర్టు గోడలకు అమర్చిన రాజస్థాన్‌ టైల్స్‌ ముక్కలు ముక్కలయ్యాయి. హైకోర్టు సమీపంలోని అన్న క్యాంటీన్‌ అద్దాలు విరిగిపోయాయి. ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో న్యాయవాదులెవరూ లేరు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. 

మహిళకు తీవ్ర గాయాలు 
sf.gifగాలి తీవ్రతకు తాత్కాలిక హైకోర్టు వద్ద ఇనుప రేకులు గాల్లోకి ఎగిరాయి. అక్కడ పనిచేస్తున్న రమణమ్మ అనే మహిళపై ఇనుప రేకు పడడంతో తీవ్రంగా గాయపడింది. తలకు సైతం బలమైన గాయం కావడంతో రక్తస్రావమైంది. బాధితురాలిని పోలీసులు ‘108’ వాహనంలో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రమణమ్మ తలకు వైద్యులు 8 కుట్లు వేశారు.  

 
Posted
Quote

కూలిన ‘రూ.25 లక్షల’ స్మార్ట్‌పోల్‌

@3$%

Posted
8 minutes ago, snoww said:

@3$%

Dinner avasaram ledhu Eeroju nindipoyindhi

Posted
3 minutes ago, tom bhayya said:

Dinner avasaram ledhu Eeroju nindipoyindhi

Hyderabad brand image ani CBN sollu vaagithe ilanti posts ee padathayee 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...