Jump to content

Recommended Posts

Posted

టీవీ చానల్ నిర్వహణ తన ఇష్టారాజ్యంగా జరగాలన్న పంతంతో కొత్త యాజమాన్యానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ, చివరకి  ఓ కీలక ఉద్యోగి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసే స్థాయికి దిగజారిన Tv9 సీఈవో రవిప్రకాశ్‌ను ఆ సంస్థ  సీఈవో పదవి నుంచి తొలగించాలని Tv9 యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

కంపెనీలో 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యానికి ఆ కంపెనీ నిర్వహణలో అడుగడుగునా అడ్డుపడుతూ, కంపెనీల చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కొత్త యాజమాన్యం ఆరోపించింది. మెజార్టీ వాటాదారుల హక్కులను అణగదొక్కే విధంగా కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారంటోంది అలందా మీడియా. సంస్థ నిర్వహణకు సంబంధించి రవిప్రకాశ్ పాల్పడిన అక్రమాలపై Tv9 యాజమాన్యం అతనిపై చీటింగ్ కేసు కూడా పెట్టింది.

సంస్థకు హాని కలిగించే ఉద్దేశంతో కొందరు వ్యక్తులతో కుమ్మక్కై ఫోర్జరీ పత్రాలు సృష్టించడమే కాక, కంపెనీ నిర్వహణలో యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని Tv9 యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ కేసు వివరాల్లోకి వెళితే..  టీవీ9 పేరుతో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, ఇంగ్లీషు, హిందీ ఛానళ్లు నిర్వహిస్తున్న అసోసియేటెడ్‌బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ABCL)ను వ్యాపారవేత్త శ్రీనిరాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ , ఐల్యాబ్స్ వెంచర్ కేపిటల్ ఫండ్ కలిపి ప్రారంభించాయి. ABCL కంపెనీలో ఈ రెండు సంస్థలకు కలిపి 90 శాతానికి పైగా వాటా ఉండగా, ఆ సంస్థలో ఓ ఉద్యోగిగా చేరి సీఈవో, డైరెక్టర్‌గా హోదా పొందిన రవిప్రకాశ్, ఆయన అసోసియేట్స్‌కు సంస్థలో దాదాపు 8 శాతం వాటా ఉంది.

ABCLలో 90 శాతానిపైగా వాటా ఉన్న రెండు సంస్థల నుంచి ఆ వాటాను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ప్రైవేట్ లిమిటెడ్ ఆగస్టు 23, 2018న ఒప్పందం కుదుర్చుకుని ఆగస్టు (24) 25న  డబ్బు కూడా చెల్లించింది.

దీనికి అనుగుణంగానే ఆ షేర్లు మొత్తం కూడా అలందా మీడియా పేరు మీద ఆగస్టు 27వ తేదీన డి-మ్యాట్ రూపంలో బదిలీ కూడా జరిగింది. దీంతో ABCL యాజమాన్యం అలందా చేతికి మారినట్లయ్యింది.  ఈ లావాదేవీని గుర్తిస్తూ, ABCL కంపెనీ తన రికార్డుల్లో నమోదు కూడా చేసుకుంది. సంబంధిత పత్రాలను రిజిస్ట్రార్ ఆఫ్‌కంపెనీస్‌కార్యాలయంలో దాఖలు కూడా చేశారు. ABCL యాజమాన్యం చేతులు మారడంతో అలందా మీడియా సంస్థ తరపున నలుగురు డైరెక్టర్లను ABCL డైరెక్టర్ల బోర్డులో నియమించేందుకు కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ అనుమతి కోరుతూ ABCL సంస్థ అక్టోబర్ 23, 2018న ఓసారి, జనవరి 30, 2019న మరోసారి డైరెక్టర్ల బోర్డు మీటింగ్‌లో తీర్మానాన్ని ఆమోదించి, ఆ తీర్మానాన్ని  ABCL సంస్థ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు అధికారికంగా పంపించింది. ఈ తీర్మానాల మీద ఒకసారి వి.రవిప్రకాశ్, మరోసారి ఎం.కె.వీ.ఎన్ మూర్తి అనే మరో డైరెక్టర్ ABCL డైరెక్టర్ల హోదాలో సంతకాలు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ మార్చి 29, 2019న అనుమతి మంజూరు చేస్తూ ABCLకు సమాచారం పంపింది.

అన్ని అనుమతులు ఉన్నప్పటికీ, కొత్త డైరెక్టర్లతో బోర్డు మీటింగ్ నిర్వహించేందుకు రవిప్రకాశ్ శతవిధాలా అడ్డుపడుతూ వచ్చారు. దీంతో ABCLలో 90 శాతానికి పైగా వాటా పొందిన అలందా మీడియాకు చెందిన నలుగురు డైరెక్టర్లు ఏప్రిల్ 23, 2019న సమావేశమై తమ నియామకానికి చెందిన పత్రాలను రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కార్యాలయంలో దాఖలు చేయాల్సిందిగా ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న కంపెనీ సెక్రటరీని కోరారు. 
రవిప్రకాశ్, ఆయన సహచరులు కొందరు దీన్ని అడ్డుకునే దురుద్దేశంతో, ఆ కంపెనీ సెక్రటరీ రాజీనామా చేసినట్లు పాతతేదీతో ఫోర్జరీ డాక్యుమెంట్‌ను సృష్టించారు. ఇదే విషయాన్ని సదరు కంపెనీ సెక్రటరీ రాతపూర్వకంగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు ఫిర్యాదు చేయడమేకాక, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తాను రాజీనామా చేసినట్లు నకిలీ పత్రాన్ని సృష్టించారని వివరించారు.

ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌అధికారులు ABCLలో కొత్త డైరెక్టర్ల నియామకానికి సంబంధించిన పత్రాలను ఆమోదించారు. ఈ వ్యవహారంలో రవిప్రకాశ్ ఫోర్జరీ వ్యవహరాన్ని సీరియస్ గా తీసుకున్న యాజమాన్యం ఆయన్ను పదవి నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. కొత్త యాజమాన్యం చేతిలో 90 శాతానికి పైగా వాటా ఉండడంతో కంపెనీ నిర్వహణకు సంబంధించి చట్టప్రకారం వారికే పూర్తి నిర్ణయాధికారం ఉంటుంది. ఇందుకు అనుగుణంగా నిర్వహణ బాధ్యతలను కొత్త యాజమాన్యం చేపట్టింది. ABCL యాజమాన్యం మార్పును, కొత్త డైరెక్టర్ల నియామకాన్నీ అడ్డుకునేందుకు రవిప్రకాశ్ ఎన్నో అడ్డదారులు తొక్కారు.

ఇందుకు సంబంధించి రవిప్రకాశ్ పాల్పడిన మరికొన్ని అక్రమాలపై కూడా అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను చూస్తే... సంస్థకు హాని కలిగించే దురుద్దేశంతో, సినీనటుడు శొంఠినేని శివాజీతో దురుద్దేశ పూర్వకంగా కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా, సంస్థ యాజమాన్యానికి... కంపెనీ నిర్వాహణలో ఇబ్బందులు కల్పించేలా రవి ప్రకాశ్ ప్రయత్నిస్తున్నారని టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కుట్రలో భాగంగా కంపెనీకి చెందిన ముఖ్యమైన డాటాను తస్కరించడమేకాక, కంపెనీకి నష్టం చేసే దురుద్దేశంతో ఆ డేటాను బయటి వ్యక్తులకు చేరవేసినట్లు అనుమానాలు ఉన్నాయని కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. అలందా మీడియా ఫిర్యాదు ప్రకారం రవిప్రకాశ్, సినీనటుడు శివాజీతో కలిసి కుట్ర పూరితమైన చర్యలకు పాల్పడి ABCL యాజమాన్యానికి, కంపెనీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడ్డారు.

ఈ వివరాల్లోకి వెళితే, సినీనటుడు శివాజీ ఏప్రిల్ 19, 2019న హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)ని ఆశ్రయించారు.  NCLTలో శివాజీ దాఖలు చేసిన అఫిడవిట్‌ప్రకారం... ABCLలో రవిప్రకాశ్‌కు 20 లక్షల షేర్లు అంటే 8శాతం వాటా ఉంది. ఇందులోనుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు రవి ప్రకాశ్‌కు 20 లక్షల రూపాయలు చెల్లించి ఫిబ్రవరి 20, 2018న  ఒప్పందం కుదుర్చుకున్నానని, ఈ ఒప్పందం జరిగిన ఏడాదిలోగా షేర్లను తన పేరు మీద బదిలీ చేసేందుకు రవిప్రకాశ్ అంగీకరించారని, తాను అతని మీద నమ్మకం ఉంచానని శివాజీ పేర్కొన్నారు. అయితే, ABCLలో మార్పులకు సంబంధించి రవిప్రకాశ్ కొన్ని నిజాలను తనవద్ద దాచారని, మోసపూరితంగా వ్యవహరించారని శివాజీ ఆరోపించారు.

షేర్ల బదిలీ గురించి తాను పలుమార్లు రవిప్రకాశ్‌కు గుర్తుచేసినా ఏదో ఒకసాకు చూపుతూ, షేర్లు బదిలీ చేయలేదని, దీంతో తాను విసిగిపోయి ఫిబ్రవరి 15, 2019న రవిప్రకాశ్‌కు స్వయంగా నోటీసు అందజేశానని శివాజీ NCLT వద్ద దాఖలు చేసిన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దానికి రవి ప్రకాశ్‌ ఫిబ్రవరి 17న స్పందిస్తూ షేర్ల బదిలీలో జాప్యానికి NCLT జారీచేసిన ఒక మధ్యంతర ఉత్తర్వు కారణమని, NCLTలో ఉన్న ఈ వివాదం పరిష్కారం అయిన తర్వాత షేర్లు బదిలీ చేస్తానని సమాధానం ఇచ్చారు.

రవిప్రకాశ్, శివాజీల మధ్య 2018 ఫిబ్రవరిలో జరిగినట్లుగా చెబుతున్న షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కేవలం తెల్ల కాగితాలపై ఉండడం గమనార్హం. ఎవరైనా వాటా కొనుగోలు చేస్తే తక్షణం షేర్ల బదిలీ కోరుకుంటారు, కానీ, శివాజీ ఇందుకు ఏడాది గడువు ఇచ్చాననడం అనుమానాలను కలిగిస్తోంది. ఈ అనుమానాల వల్లే, శివాజీ, రవిప్రకాశ్ మధ్య కుదిరనట్లు చెబుతున్నది ఫోర్జరీ ఒప్పందంగా టీవీ9 కొత్త యాజమాన్యం భావిస్తోంది. కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే ఉద్దేశ్యంతో రవిప్రకాశ్, శివాజీతో కలిసి కుమ్మక్కై ఈ నాటకానికి తెరతీశారని ABCL కొత్త యాజమాన్యం తన ఫిర్యాదులో పేర్కొంది. దీనికి సంబంధించి కొంత లోతైన పరిశీలన చేస్తే రవిప్రకాశ్‌ దురుద్దేశ పూర్వక చర్యలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి.

1. ABCLలో పెట్టుబడికి సంబంధించి తలెత్తిన ఒక వివాదంలో మారిషస్‌కు చెందిన సైఫ్ త్రీ మారిషస్ కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ జనవరి, 2018లో NCLTని ఆశ్రయించింది. దీనిపై  విచారణ జరిపిన NCLT.. ABCL తన ఆస్తులను కానీ, షేర్లను కానీ అమ్మరాదని సెప్టెంబర్ 4, 2018న ఒక మధ్యంతర ఉత్తర్వును జారీచేసింది. ఈ ఆదేశాలను యదావిధిగా కొనసాగిస్తూ NCLT జనవరి 21, 2019న మరో మధ్యంతర ఉత్తర్వును ఇచ్చింది. ఆ తర్వాత శ్రీనిరాజుకు, సైఫ్ త్రీ మారిషస్‌ కంపెనీ లిమిటెడ్‌కు మధ్య సెటిల్‌మెంట్‌ ఒప్పందం కుదిరింది. ఇదే విషయాన్ని గత వారం NCLTకి తెలియపరిస్తూ, ఉపసంహరణ పిటిషన్‌ను ఇరుపక్షాలు దాఖలు చేశాయి. దీనికి సంబంధించి NCLT  తుది ఉత్తర్వులను వెలువరచాల్సి ఉంది. అయితే,  ABCL కంపెనీ షేర్లు కలిగి ఉన్న వ్యక్తుల మధ్య లావాదేవీలపై మాత్రం NCLT మధ్యంతర  ఉత్తర్వుల్లో ఎలాంటి ఆంక్షలు లేవు. అలాంటప్పుడు శివాజీకి వ్యక్తిగత హోదాలో తన వద్ద ఉన్న షేర్లు అమ్మేందుకు అంగీకరించిన రవిప్రకాశ్ ఈ ఉత్తర్వులను సాకుగా చూపించి షేర్ల బదిలీని నిలిపివేయడం వెనుక ఆంతర్యం ఏంటి?

2. NCLT ఉత్తర్వులు ఎప్పుడో సెప్టెంబర్ 4, 2018లో వెలువడగా, ఈ విషయం తనకు కొద్దిరోజుల ముందే తెలిసిందని ఆ కంపెనీ సీఈవో, డైరెక్టర్ గా ఉన్న రవిప్రకాశ్ మార్చి 17,2019న శివాజీకి లిఖిత పూర్వకంగా చెప్పడం ఈ వ్యవహారంలో ఉన్న మతలబును బయటపెడుతోంది.

3. కంపెనీకి సీఈవోగా, డైరెక్టర్‌గా రవిప్రకాశ్‌కు NCLT జారీచేసిన న్యాయపరమైన ఉత్తర్వులు తెలియకపోవడం ఏ మాత్రం నమ్మశక్యం కానిదిగా కనిపిస్తోంది. పైగా ఈ వ్యవధిలో కనీసం రెండుసార్లు ABCL బోర్డు సమావేశాలు జరగడం గమనార్హం.

4. NCLT ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా, కొత్త యాజమాన్యానికి సంబంధించిన నలుగురు డైరెక్టర్లను ABCL బోర్డులో చేర్చుకునేందుకు 2018 అక్టోబర్‌లో ఒకసారి, 2019 జనవరిలో మరోసారి బోర్డు మీటింగులు నిర్వహించి, కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ అనుమతి కోరేందుకు ఎలాంటి ఇబ్బందిలేని రవిప్రకాశ్‌కు... తన దగ్గర వ్యక్తిగత హోదాలో ఉన్న 40 వేల షేర్లను శివాజీకి బదలాయించడానికి ఉన్న అడ్డంకి ఏంటో అంతుపట్టనిదిగా ఉంది. పైగా ఈ వ్యవహారం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిందే కానీ, ఈ విషయంలో ABCLకి ఏమాత్రం ప్రమేయం లేదు.

వాస్తవం ఇలా ఉండగా, దీన్ని ఒక వివాదంగా సృష్టించి, న్యాయపరమైన చిక్కులు కల్పించి ABCL కొత్త యాజమాన్యానికి ఆ కంపెనీ నిర్వహణలో అడ్డంకులు కల్పించడమే రవిప్రకాశ్ దురుద్దేశ్యమని స్పష్టమవుతోంది. టీవీ9 నిర్వహణలో రవిప్రకాశ్ మొదట్నుంచీ వ్యవహరిస్తున్న తీరును చూస్తే, ఇందుకు సంబంధించి మరిన్ని అనుమానాలు కలగకమానవు.

అవేంటో చూద్దాం...
1. టీవీ9 స్థాపించినప్పటి నుంచీ ఆ కంపెనీలో అత్యధిక వాటా వేరే వారిది కాగా, నామమాత్రపు వాటా కలిగిన రవిప్రకాశ్ మాత్రం టీవీ9 తన సొంతది అన్నట్లుగా వ్యవహరించడం జగద్విదితం.

2. టీవీ9 సంస్థను విక్రయించేందుకు ఆ సంస్థ పాత యాజమాన్యం గత కొన్ని సంవత్సరాలుగా చేసిన  ప్రయత్నాలు, వివిధ సంస్థలతో జరిపిన చర్చలు ఫలప్రదం కాకుండా రవిప్రకాశ్ తనదైన ధోరణిలో వ్యవహిరంచారని మీడియా వర్గాల్లో విస్తృత ప్రచారం ఉంది.

3. గత ఏడాది ఆగష్టులో జరిగిన లావాదేవీ ద్వారా టీవీ9 సంస్థ... కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోవడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని రవిప్రకాశ్, టీవీ9లో ఎప్పటికీ చక్రం తిప్పాలన్న దురుద్దేశంతో అన్నిరకాల యత్నాలు చేస్తున్న విషయం కూడా మీడియా వర్గాల్లో విస్తృత ప్రచారంలో ఉంది.

4. టీవీ9 సంస్థ నిర్వహణకు సీఈవో హోదాలో గుడిలోకి పూజారి మాదిరిగా వచ్చిన రవిప్రకాశ్... చివరికి తానే దేవుణ్ణి అన్నట్లుగా ఆయన వ్యవహారశైలి మారిపోయింది. పదిశాతం కూడా వాటా లేని రవిప్రకాశ్.. 90 శాతం వాటా కలిగి ఉన్న యాజమాన్యానికి అడ్డంకులు కలిగిస్తున్న తీరుచూస్తే..  ఏకు మేకై కూర్చోవడం లాగా కనిపిస్తోంది.

ఈ మొత్తం వివాదంలో తలెత్తుతున్న అనుమానాస్పద అంశాలను ఓసారి పరిశీలిద్దాం...

1. టీవీ9 స్థాపించినప్పటి నుంచీ రవిప్రకాశ్‌ది మైనార్టీ వాటానే. ప్రధాన పెట్టుబడి అంతా ఇతర వ్యక్తులు, సంస్థల నుంచే వచ్చింది. అయినప్పటికీ రవిప్రకాశ్ అంతా తానై వ్యవహరించడం మొదట్నుంచీ వివాదాస్పదంగానే ఉంది.

2. కంపెనీలను అమ్మడం, కొనడం కార్పొరేట్ రంగంలో సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ అయినప్పుడు... టీవీ9లో మైనార్టీ వాటా ఉన్న రవిప్రకాశ్, ఈ సంస్థలో మెజార్టీ వాటా ఉన్న యాజమాన్యానికి అడ్డంకులు సృష్టించడం వెనుక ఆంతర్యం ఏంటి?

3. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకునే టెలివిజన్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నానని గొప్పగా చెప్పుకునే రవిప్రకాశ్‌... తాను సీఈవోగా, డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న టీవీ9కి సంబంధించి NCLT జారీచేసిన ఉత్తర్వులు నెలల తరబడి తెలియని స్థితిలో ఉన్నారంటే... నమ్మశక్యమా..?

4. టీవీ9 నిర్వహణలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయన్న అనుమానాలు బలంగా ఉన్న నేపథ్యంలో, ఈ బండారం బయటపడుతుందన్న భయంతోనే... కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారా..?

5. టీవీ9.. కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోవడానికి వ్యతిరేకంగా కొన్ని వెబ్‌సైట్లలో, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న హస్తం ఎవరిది? దీనివల్ల ప్రయోజనం ఎవరికి? ఈ ప్రక్రియలో భాగంగా, కంపెనీకి సంబంధించిన రహస్య సమాచారం కూడా బయటకు పొక్కడానికి బాధ్యులెవరు?

6. వ్యక్తిగత హోదాలో డబ్బులు తీసుకుని, షేర్లను బదలాయించకుండా ఉంది రవిప్రకాశ్ అయితే, ఈ వివాదంలోకి ABCLను శివాజీ లాగడం వెనుక మర్మమేంటి? ఓ వైపు రవిప్రకాశ్‌ తనను నమ్మించి మోసం చేశారని ఆరోపిస్తున్న శివాజీ, మరోవైపు మాత్రం టీవీ9 నిర్వహణలో యదాతథస్థితిని (అంటే రవిప్రకాశ్ నేతృత్వంలోనే టీవీ9 పనిచేయాలని) కొనసాగించేలా ఆదేశించాలని NCLT ని కోరడం వెనుక ఉద్దేశ్యం ఏంటి?

- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్టు

Posted
9 minutes ago, mmharshaa said:

Matter in 1 line pls

TV9 Ravi Prakash parari lo unnadu

Posted

Ravi Prakash, Chief Executive Officer (CEO) of popular Telugu television channel TV9, has been sacked from his post by the channel’s new management.

Alanda Media Entertainment Private Limited, a joint venture of My Home Group headed by Jupalli Rameshwar Rao and Megha Engineering and Infrastructure Private Limited (MEIL) Krishna Reddy, which bought over majority of the stakes in the Associated Broadcasting Company Limited that owned TV9, reportedly removed Ravi Prakash from the CEO post.

In his place, Singa Rao, presently CEO of 10TV, also promoted by My Home Group, has been appointed as the new CEO of TV9.

What is more, Alanda Media also filed a complaint with the Cybercrime police of Hyderabad, alleging that Ravi Prakash had siphoned off huge funds from ABCL into his own media venture Mojo TV.

It further alleged that Ravi Prakash had indulged in forgery of Alanda Media’s director Koushik Rao, in a bid to stall the appointment of new directors on the board by My Home group and MEIL. Thus, it is alleged Ravi Prakash tried to prevent Alanda from taking control of TV9 channel from him.

The Cybercrime police have been conducting searches in the offices of TV9 amidst tight police bandobust.

Alanda Media bought 90 per cent of the stakes from ABCL recently, thereby liberating the TV9 channel from Ravi Prakash’s clutches. It got the permission from Union ministry of information and broadcasting for appointing four full-time directors.

However, Ravi Prakash tried to stall the formation of the new board. So, he wrote to the the Centre allegedly forging the signature Kaushik Rao opposing the appointment of new directors.

This led to the Cybercrime police booking a case against him. Apparently, Ravi Prakash and his team have allegedly stolen some hard discs and other documents pertaining to share transactions.

What is worse, Ravi Prakash also sought to create troubles to the new management through actor Shivaji, who claimed to have bought 10,000 shares in the channel. However, it is believed that Shivaji only held benami shares of Ravi Prakash.

The company law board is examining the case now.

Posted

Endi aa Raviprakash gurinchi intha disco, its jaagabokka the hole

Posted
Quote

6. వ్యక్తిగత హోదాలో డబ్బులు తీసుకుని, షేర్లను బదలాయించకుండా ఉంది రవిప్రకాశ్ అయితే, ఈ వివాదంలోకి ABCLను శివాజీ లాగడం వెనుక మర్మమేంటి? ఓ వైపు రవిప్రకాశ్‌ తనను నమ్మించి మోసం చేశారని ఆరోపిస్తున్న శివాజీ, మరోవైపు మాత్రం టీవీ9 నిర్వహణలో యదాతథస్థితిని (అంటే రవిప్రకాశ్ నేతృత్వంలోనే టీవీ9 పనిచేయాలని) కొనసాగించేలా ఆదేశించాలని NCLT ని కోరడం వెనుక ఉద్దేశ్యం ఏంటి?

Sendral saar script

Posted
46 minutes ago, captainAF said:

Kadanta kada...

 

moham lo aa bayam and restless ness. @3$%

Thank you Dora 

Posted
1 hour ago, captainAF said:

Kadanta kada...

 

face lo bhayam clearly visible no...he is not able to make eye contact with camera..

Posted
1 hour ago, captainAF said:

Kadanta kada...

 

-ve things ni news telecast chesthamu ani cheppi bedhirinchi avi veyyakunda undataniki dabbulu theesukone veedu kooda viluvalu, paradarsakatha gurinchi matlatathadu...emito mana state ki pattina kharma..malla veedidi no 1 news channel for a decade^&H^&H^&H^&H

Posted
8 minutes ago, AntheKada said:

what kind of person has this EGO Like a DON of a Mafia 

 

 

Appatilo God PK mother of all shows soopostha Ani seppi utter flop show soopettadu.

Dora assalu Ina mother of all shows soopettadu ippudu. Thank you Dora

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...