Jump to content

Recommended Posts

Posted
  • ప్రధానిని నిర్ణయించడంలో ముఖ్య పాత్ర
న్యూఢిల్లీ, మే 9 (ఆంధ్రజ్యోతి): చంద్రబాబు.. మమతా బెనర్జీ.. మాయావతి.. అఖిలేశ్‌ యాదవ్‌! రాబోయే కేంద్ర ప్రభుత్వంలో కాబోయే ప్రధాన మంత్రిని నిర్ణయించేది వీళ్లే! ఎన్డీయేకి మెజారిటీ రానిపక్షంలో వీళ్లు ఎవరికి మద్దతు పలికితే వాళ్లే ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్నారు! వీరిలో అత్యధికులు మోదీ మళ్లీ ప్రధాని కావడానికి సై అనే పరిస్థితి లేదు! ఇక, యూపీఏ సారథ్యంలో లేదా మూడో కూటమి తరఫున ఎవరు ప్రధాని కావాలన్నా వీరు ఓటు వేయాల్సిందే! ఐదు దశల ఎన్నికల తర్వాత ఇటు యూపీఏ, అటు ఎన్డీయేల్లో ఏ కూటమికీ పూర్తి మెజారిటీ రాదని విశ్లేషణలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఫలితాల అనంతర పరిస్థితిపై కాంగ్రెస్‌ వ్యూహకర్తలు అంచనాలు వేస్తున్నారు. ఆ నలుగురి ఏకాభిప్రాయంపైనే రాహుల్‌ గాంధీ కానీ, మరో నేత కాని ప్రధాని కావడం ఆధారపడి ఉంటుందని, రాహుల్‌ కూడా వారి సలహా ప్రకారం వెళ్లవచ్చునని భావిస్తున్నారు.
 
ఒకవేళ రాహుల్‌ నాయకత్వంపై ఏకాభిప్రాయం కుదరకపోతే, ఆ నలుగురు సూచించిన నేతకు పట్టం కట్టడానికే ఆయన సుముఖంగా ఉంటారని అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం మోదీని ప్రధాని కాకుండా అడ్డుకోవడమే రాహుల్‌ ధ్యేయం కావడమేనని గుర్తు చేస్తున్నారు. ఈనెల 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ వ్యూహకర్తలు దేశంలోని పలు పార్టీల నేతలతో సంప్రదింపులు ప్రారంభించారని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు ప్రారంభించామని, వివిధ సమీకరణల గురించి స్నేహపూర్వకంగా మంతనాలు జరుపుతున్నామని రాహుల్‌ గాంధీ సన్నిహితుడొకరు చెప్పారు. ‘‘యూపీఏకు కనీసం 190 సీట్లు వస్తాయని అంచనా వేశాం. మరో 85-90 మంది ఎంపీలు మద్దతు ఇస్తే రాహుల్‌ ప్రధాని కావడం ఖాయం. కాకపోయినా నలుగురు కీలక నేతలు సూచించిన వ్యక్తికి ప్రధాని పదవి దక్కుతుంది’’ అని ఆయన చెప్పారు. మమతా బెనర్జీ, మాయావతి కూడా ప్రధాని పదవి రేసులో ఉన్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.
 
యూపీఏలో ఇప్పటికే డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ కీలక భాగస్వాములుగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ నేతలు అఖిలేశ్‌ యాదవ్‌, మాయావతి, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తారని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నలుగురూ యూపీఏకు మద్దతు ప్రకటిస్తే చాలు, మిగతా పార్టీల నేతలు కూడా యూపీఏకే మద్దతు ఇస్తారని కాంగ్రెస్‌ వ్యూహకర్తల అంచనా. ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే లేదా అంతకు ముందు యూపీఏ, దానికి మద్దతు ఇచ్చే పార్టీల నేతలు తామంతా సంఘటితంగా ఉన్నామని, తాము చర్చించి నేతను ఎన్నుకుంటామని రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు లేఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. అదే జరిగితే సంఖ్యాబలం రీత్యా ఈ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానించక తప్పదని భావిస్తున్నారు. ఒకసారి యూపీఏ, ఇతర పక్షాలు సంఘటితమైతే మోదీ ప్రభుత్వ ఏర్పాటు అంత సులభం కాదని అంచనా వేశారు.
 
బుధవారం ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో చర్చలు జరిపిన చంద్రబాబు కూడా.. ఫలితాలకు రెండు రోజుల ముందుగా అంటే ఈనెల 21వ తేదీనే సమావేశమవుదామని, ఆ సమావేశంలో కూటమిపై నిర్ణయం తీసుకుందామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రధాని పదవి రేసులో లేనని ముందే ప్రకటించి ఆయన జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు కేంద్ర బిందువుగా మారారని, ఆయా పార్టీల నేతలందరితో మాట్లాడగలిగే సాన్నిహిత్యం ఉండడంతో ఆయన పాత్ర కీలకంగా మారుతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సుదీర్ఘ కాలంగా జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలతో కలిసిమెలిసి పనిచేసిన అనుభవం, రాజకీయంగా సీనియర్‌ కావడం ఆయనకు కలిసి 
Posted
2 minutes ago, Hydrockers said:

Vache 5 to 6 seats tho em pikutadu antunna @ARYA

Upa-3 pradhana manthti abhyarthi chandra babe

Posted
3 minutes ago, Hydrockers said:

Vache 5 to 6 seats tho em pikutadu antunna @ARYA

పది మంది Street rowdies ని lead చేయడానికే ఒక xxx కావలి కదా.. ఆ position istaremo లే.. Chairman UPA. 

Posted
5 minutes ago, TOM_BHAYYA said:

Upa-3 pradhana manthti abhyarthi chandra babe

Elagelaga adhe mata pedda pappu ni cheppamanu

Posted

Oh...Andhra Jyothi paper uh..!!! 

Makes sense...

Posted
Quote

చంద్రబాబు.. మమతా బెనర్జీ.. మాయావతి.. అఖిలేశ్‌ యాదవ్‌!

didi okka daanike koncham strong chances vunnayee. migatha mugguru not guaranteed 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...