Jump to content

Telugu Cinema drug scandal cases


Recommended Posts

Posted
అధికారులకు ఏమైందో?

సంచలనం రేపిన మత్తుమందుల కేసుల్ని ఎందుకు అటకెక్కించారో?
నాడు తెలుగు సినీ ప్రముఖుల్ని విచారించిన ఆబ్కారీ శాఖ
రెండేళ్లుగా అతీగతీ లేని కేసుల దర్యాప్తు
ఎందుకు నిలిచిపోయిందో ఎవరికీ తెలియని వైనం

ఈనాడు, హైదరాబాద్‌: రెండేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాదకద్రవ్యాల కేసు మూలనపడింది. 12 కేసులు నమోదు చేసిన అధికారులు ఇప్పటి వరకూ కేవలం నాలుగు అభియోగపత్రాలు దాఖలు చేశారు. మిగతా కేసులలో దర్యాప్తు ఇంచుమించు నిలిచిపోయింది. 2017 జూన్‌ నెలలో పెను దుమారం రేపిన మత్తుమందుల కేసు గురించి ఇప్పుడు పట్టించుకున్న వారే లేరు. పాఠశాల విద్యార్థులకు మత్తుమందులు అమ్ముతున్నారన్న అనుమానంతో నిఘా పెట్టిన ఆబ్కారీ అధికారులకు పెద్దచేపలే చిక్కాయి. తొలుత కెల్విన్‌ మాస్కరెనాస్‌ను అధికారులు పట్టుకున్నారు. అతన్ని విచారించినప్పుడు అనేక విషయాలు బయట పడ్డాయి. విదేశాల నుంచి కొరియర్‌ ద్వారా మత్తుమందుల దిగుమతి జరుగుతోందని, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేక మందికి తాను మాదకద్రవ్యాలు సరఫరా చేసేవాడినని కెల్విన్‌ చెప్పడంతో వారందర్నీ అధికారులు విచారణకు పిలిచారు. కేసు తీవ్రత దృష్ట్యా ఆబ్కారీ అధికారుల ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేశారు. రోజుకు ఒకరు చొప్పున కేసుతో సంబంధం ఉందని భావించిన వారందర్నీ అధికారులు విచారించారు. ఇందులో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పూరీ జగన్నాథ్‌, రవితేజ, తరుణ్‌, చార్మి, ముమైత్‌ఖాన్‌, సుబ్బరాజు వంటి వారు ఉండటంతో ఎక్కడ చూసినా ఈ కేసు గురించే చర్చించుకోవడం కనిపించింది. ఆబ్కారీ అధికారుల దెబ్బకి రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల జరుగుతున్న నష్టాలపై ప్రజల్లో చైతన్యం వచ్చింది. అనేక స్వచ్ఛంద సంస్థలు మాదకద్రవ్యాల వాడకంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సదస్సులు, ర్యాలీలు నిర్వహించాయి. క్రమంగా ఈ కేసుల దర్యాప్తు బలహీనపడింది. ఆబ్కారీ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంచాలకునిగా ఉన్న అకున్‌సబర్వాల్‌ను ప్రభుత్వం పౌరసరఫరాల శాఖకు బదిలీ చేసింది. ఆబ్కారీశాఖను అదనపు బాధ్యతగా అప్పగించింది. మొత్తం 12 కేసులు నమోదు చేసి, 62 మందిని విచారించిన అధికారులు అతికష్టంమీద ఇప్పటి వరకూ 4 కేసులలో మాత్రమే అభియోగపత్రాలు దాఖలు చేయగలిగారు. వీటిలో రెండు కేసులు ముంబయి నుంచి విమానం ద్వారా మత్తుమందులు తరలిస్తున్నవయితే మరో రెండు స్థానికంగా గంజాయి, ఎండీఎంఏ అనే మత్తుమందును స్వాధీనం చేసుకున్న కేసులకు సంబంధించినవి. తెలుగు సినీపరిశ్రమకు సంబంధించిన కేసులు అతీగతీ లేవు. వీటి దర్యాప్తు ఎందుకు నిలిచిపోయిందో ఎవరికీ తెలియదు. రెండేళ్లు కావస్తున్నా మొక్కుబడిగా నాలుగు అభియోగపత్రాలు దాఖలు చేసి మిగతా కేసుల దర్యాప్తు పక్కన పెట్టేయడంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా మిగిలిపోయిన కేసుల దర్యాప్తు పూర్తిచేసి అభియోగపత్రాలు దాఖలు చేయడం ద్వారా వీటికి హేతుబద్ధమైన ముగింపు ఇవ్వాల్సి ఉంది.

సిట్‌ను తప్పించండి: పద్మనాభరెడ్డి
రెండేళ్లుగా మాదకద్రవ్యాల కేసు కొలిక్కి రాకపోవడంపై సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. ఈ కేసును సిట్‌ నుంచి తప్పించి అవినీతి నిరోధకశాఖ లేదా ఇతర సంస్థలు వేటితో అయినా దర్యాప్తు చేయించాలన్నారు. ఈ కేసుల పురోగతిపై సుపరిపాలన వేదిక ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సినీరంగానికి చెందిన ప్రముఖులు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన వెంటనే కేసు నీరుగారటం మొదలైందని ఆరోపించారు. ఇటీవల తాను సీఎస్‌ ఎస్‌.కె.జోషిని కలిసి దీనిపై వినతిపత్రం సమర్పించానన్నారు.

Posted

total of 12 cases were registered in this regard and based on information provided by the accused, the SIT officials after interrogation of accused examined 62 persons connected to the Tollywood. But none of the 62 film celebrities were named in the four charge-sheets filed by them. The facts came to light when the Excise officials provided the information regarding the investigation till now to M Padmanabha Reddy, secretary for Forum for Good Governance, who earlier filed an appeal through RTI Act and asked the latest status of the case.

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...