whatsapp Posted May 15, 2019 Report Posted May 15, 2019 This thread thought of opening on friday but cant wait till the time ..as the post is very good. Please update this thread on friday with funny forwards ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్ లో అతిపెద్ద మాల్ లో ఒక సేల్స్ మాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు. అది ప్రపంచంలోనే అతి పె ద్ద మాల్. అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. "ఇంతకు ముందు సేల్స్ మాన్ గా ఎక్కడైనా పనిచేసావా ?" అడిగాడు బాస్. "చెయ్యలేదు" "సరే ! రేపు వచ్చి జాయిన్ అవ్వు. నీ పెర్ఫార్మన్స్ నేను స్వయంగా చూస్తా! ". తర్వాతి రోజు చాలా భారంగా నడిచింది తనకి. చివరకి సాయంత్రం ఆరు గంటలకి బాస్ వచ్చాడు. "ఈ రోజు ఎంత మంది custermurs కి సేల్స్ చేశావు?". "సర్ ! కేవలం ఒకరు" అని బదులిచ్చాడు తను. "ఒకటేనా ! నువ్వు ఇక్కడ గమనించావా, అందరూ 40 నుండి 50 సేల్స్ చేస్తారు. సరే, ఎంత ఖరీదైన సేల్ నువ్వు చేశావో చెప్పు?" "8,009,770 పౌండ్స్" చెప్పాడు మన సేల్స్ మాన్. "వాట్ !!" అదిరిపడ్డాడు బాస్. "అంత పెద్ద సేల్ ఏమి చేశావు?" అడిగాడు. "వినండి. ఒక పెద్దాయనకి ఒక చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను." "గాలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ ఖరీదు కాదే? " అన్నాడు బాస్. "పూర్తిగా వినండి, తర్వాత ఆ గాలానికి సరిపడే రాడ్, ఒక గేర్ అమ్మాను. ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నారో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పారు. దాని కన్నా ఒక బోట్ లో వెళుతూ నది మధ్య చేపలు పడితే బాగుంటుందని ఒప్పించి బోట్ స్టోర్లో ఒక షూనర్ బోట్ డబల్ ఇంజన్ ఉన్నది కొనిపించాను. ఆ పెద్దమనిషి తన జీప్ కెపాసిటీ తక్కువ ఈ బోట్ ని తీసుకు పోలేదు అన్నారు. అప్పుడు ఆటొమోబైల్ డిపార్ట్మెంట్ లో ఒక కొత్త 4 * 4 డీలెక్స్ బ్లాజర్ కొనిపించాను.తరువాత అక్కడే నది ఒడ్డున ఉండటానికి కాంపింగ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా ఒచ్చిన ఆరు స్లీపర్ల ఇగ్లూ కాంప్ టెంట్ దానిలో ఉండటానికి కావల్సిన భోజన సామగ్రి పాక్ చేయించాను.” బాస్ ఆశ్చర్యంతో రెండు అడుగులు వెనక్కి వేశాడు. "ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా !!!" "లేదు సార్ !" బదులు ఇచ్చాడు సేల్స్ మాన్. "మరి ? " అన్నాడు బాస్. " ఆయన నిజానికి ఒక తల నొప్పి టాబ్లెట్ కోసం వచ్చారు. తలనొప్పికి టాబ్లెట్ కన్నా చేపలు పట్టే హాబీ ద్వారా తగ్గించుకోవచ్చు అని ఒప్పించాను." బాస్: " అరే యార్ …!! ఇంతకీ నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి?" అప్పుడు ఆ సేల్స్ మాన్ చెప్పాడు " చైతన్య -నారాయణ, కార్పొరేట్ స్కూల్ లో టీచర్ ఉద్యోగం చేసేవాణ్ణి సార్."టీచర్ కి, సేల్స్ కు,ఏంటి రిలేషన్?? అడిగాడు బాస్ ఏబిసిడి లు నేర్పమని వస్తే ,పదేళ్ల తర్వాత వచ్చే ఐఐటి -నీట్-సివిల్స్ ,రాంక్ పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం... అని ఆన్సర్ ఇచ్చాడు😃😃😃 👆👆అదిరిపోయే కామెడీ👆 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.