Jump to content

Leader and Dramoji enduku kalisaaru ?


Recommended Posts

Posted

Saakshit version 

బాబు, రామోజీ మధ్యలో రవిప్రకాశ్‌

May 16, 2019, 01:07 IST
 
 
 
 
 
 
Chandrababu Naidu Helping TV9 Ravi Prakash - Sakshi

టీవీ9 మాజీ సీఈవోను కాపాడేందుకు రంగంలోకి చంద్రబాబు

రామోజీరావుతో ఫిల్మ్‌సిటీలో 3 గంటలపాటు భేటీ

రామేశ్వరరావుతో రామోజీకున్న దోస్తీని అడ్డంపెట్టుకునే యత్నం

టీవీ9 కొత్త యాజమాన్యంలోని ఓ ప్రముఖుడికి బెదిరింపు

వినకపోవడంతో రామోజీతో తెరచాటు ఒత్తిడికి ప్రయత్నం

సాక్షి, హైదరాబాద్‌: ఫోర్జరీ కేసును ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. రవిప్రకాశ్‌ అరెస్టు కాకుండా చూడటంతో పాటు ఆయనను ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘ఈనాడు’చైర్మన్‌ రామోజీరావును కలిశారు. విజయవాడ నుంచి హెలికాప్టర్‌లో నేరుగా ఫిల్మ్‌సిటీకి వచ్చిన చంద్రబాబు దాదాపు 3 గంటల పాటు వివిధ అంశాలపై రామోజీరావుతో చర్చలు జరిపారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై అరెస్ట్‌ వారంట్‌ జారీచేస్తారన్న వార్తల నేపథ్యంలో బాబు, రామోజీరావు కలయిక అత్యంత ప్రాధాన్యత సంత రించుకుంది. టీవీ9 సీఈవోగా తన ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా ప్రాధాన్యత ఇవ్వకుండా వెనకేసుకొచ్చిన రవిప్రకాశ్‌పై కేసులు వద్దంటూ ఇప్పటికే రెండు, మూడు సార్లు టీవీ9 కొత్త యాజమాన్యానికి చంద్రబాబు సూచించారు.

కొత్త యాజమాన్యంలో ముఖ్యుడైన ఓ పారిశ్రామికవేత్తను విజయవాడకు పిలిపించి బెదిరించినట్లు కూడా తెలిసింది. అయినా కొత్త యాజమాన్యం తనమాట ఖాతరు చేయకపోవడంతో నేరుగా రంగంలోకి దిగారు. తను రాజగురు రామోజీరావు ద్వారా కొత్త యాజమాన్యానికి నచ్చజెప్పేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కొత్త యాజమాన్యంలో ప్రధాన భాగస్వామి రామేశ్వరరావుకు రామోజీరావుకు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు.. రామోజీరావు ద్వారా రాయబారం నెరుపుతున్నారు. పరారీలో ఉన్న రవిప్రకాశ్‌పై ఇప్పటికే ఉన్న ఫోర్జరీ కేసుతోపాటు నిధుల దుర్వినియోగంపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. టీవీ9 నిధులను యథేచ్చగా ఓ టీవీ ఛానల్‌ ఉద్యోగుల జీతభత్యాలకు, తాను వ్యక్తిగతంగా నడుపుతున్న ఓ పత్రిక ఖర్చులకు వినియోగించినట్లు ఫిర్యాదులున్నాయి. దీంతో రవిప్రకాశ్‌కు ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో చంద్రబాబు రంగంలోకి దిగినట్టున్నారని ఓ సీనియర్‌ పోలీసు అధికారి అన్నారు.
 
చంద్రబాబుకు ఎందుకంత ప్రేమ
చంద్రబాబుకు టీవీ9 సీఈవోగా రవిప్రకాశ్‌ అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడంతో పాటు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. అవసరమైన సందర్భాలలో రవిప్రకాశ్‌ ద్వారా టీవీ9ను వాడుకుంటూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా జగన్‌పై చంద్రబాబు దుష్ప్రచారానికి పాల్పడ్డారు. సీబీఐ దర్యాప్తు సమయంలోనూ జగన్‌ నివాసమైన లోటస్‌పాండ్‌లో స్విమ్మింగ్‌ పూల్‌ ఉందంటూ, ఇంట్లో బార్‌ ఉందంటూ టీవీ9 ద్వారా చంద్రబాబు అసత్య ప్రచారం చేయించారు. రాజకీయంగా ఎదురీదుతున్న సమయంలో తన ప్రత్యర్థి జగన్‌ను దెబ్బతీయడానికి రవిప్రకాశ్‌ జరిపిన అసత్య ప్రచారానికి బదులుగా.. ఇప్పుడు ఆయన్ను కాపాడేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రామేశ్వరరావుపై ఒత్తిడి తేవడానికి వీలుగా రామోజీరావును చంద్రబాబు ఎంచుకున్నాడు. అయితే, ఈ విషయంలో రామోజీరావు ఎంతమేరకు సహకరిస్తారన్నది వేచి చూడాల్సిందే.
 
జాతీయ రాజకీయాలపైన చర్చ
ఏపీ శాసనసభ ఎన్నికలతో పాటు జాతీయ రాజకీయాలపైన చంద్రబాబు, రామోజీరావు మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో మళ్లీ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ వ్యూహం ఎలాగుంటే బాగుంటుందన్న అంశాన్నీ చర్చించినట్లు సమాచారం. ఎన్డీయే నుంచి బయటకు రావడంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని రామోజీరావు అభిప్రాయపడినట్లు తెలిసింది. మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తే కలిసిపోవడమే మంచిదనే అభిప్రాయం వీరిద్దరి మధ్య చర్చల్లో వ్యక్తమైనట్లు సమాచారం.
 
రవిప్రకాశ్‌కు ఎదురుదెబ్బ
టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై పోలీసులు సీఆర్‌పీసీ 154 కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను (భోజన విరామం) విచారణకు చేపట్టాలన్న ఆయన తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరమేమీ లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. సీఆర్‌పీసీలోని 154 సెక్షన్‌ చెల్లుబాటును ప్రశ్నిస్తే.. ఇప్పటికిప్పుడు విచారణ చేయాల్సిన అవసరమేమీ లేదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. అయితే.. రవిప్రకాశ్‌పై పోలీసులు 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని, పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తరపు న్యాయవాది చెప్పారు. అలాంటి పరిస్థితులు ఉంటే ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్న ధర్మాసనం.. విచారణను వచ్చే జూన్‌కు వాయిదా వేసింది.  

Posted

ee sakshit vadiki anni news telustayi kani ... bathroom lo babai ni evaru champaroo telyadu enduku antaru @3$%

Posted

eedi creativity ni 10go

asalu CBN ravi prakash gadini enduku save chesthadu

aa CM Ramesh gaadine pattinchukotledu

Posted

TDP ni kapadali ante malla Dramoji Ankul rangam loki digalsinde...

boothu kitti gadini nammukunte niluvuna munchi padesindu....

anduke, back to where it all started...

Posted
1 minute ago, mettastar said:

eedi creativity ni 10go

asalu CBN ravi prakash gadini enduku save chesthadu

aa CM Ramesh gaadine pattinchukotledu

@Langa btach ki ee news oka manchi beating material uncle @3$%

Posted
8 minutes ago, solman said:

ee sakshit vadiki anni news telustayi kani ... bathroom lo babai ni evaru champaroo telyadu enduku antaru @3$%

Yellow media lo enduku kalisaaro seppara vuncle. 

Posted

asalu TV9 ki TDP ki em sambandham

epudu favorable programs kuda cheyalega TV9 vadu TDP ki support chestha

Posted
3 minutes ago, mettastar said:

asalu TV9 ki TDP ki em sambandham

epudu favorable programs kuda cheyalega TV9 vadu TDP ki support chestha

em matladuthunnav vuncle. TV9 was part of yellow media. 

Posted

From Gas Andhra

రామోజీ బోధ : భాజపాకు జై కొడితే బెటర్!

May 15 , 2019 | UPDATED 21:07 IST
రామోజీ బోధ : భాజపాకు జై కొడితే బెటర్!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఈనాడు అధినేత రామోజీరావును బుధవారం కలిశారు. హెలికాప్టర్ లో రామోజీ ఫిలింసిటీకి వెళ్లిన చంద్రబాబు... విందు సహా, ఆయనతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. సమకాలీన రాజకీయాలను చర్చించారు. రామోజీరావు నివాసానికి సమీపంగా ఉండే హెలిపాడ్ వద్ద రామోజీరావు, ఆయన కుమారుడు కిరణ్.. చంద్రబాబుకు స్వాగతం పలికి తీసుకువెళ్లారు. ఇదంతా ఓకే... మరో వారంరోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్న తరుణంలో... చంద్రబాబునాయుడు- రామోజీరావు భేటీ వెనుక మతలబు ఏంటి?

విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి..
భాజపా ప్రేరేపణతోనే ఈ ‘రామోజీ-బాబు’ భేటీ ఏర్పాటు అయినట్లు తెలుస్తోంది. రామోజీరావు సాధారణంగా నరనరాన కాంగ్రెసు వ్యతిరేకత నిండినవ్యక్తి. పైగా పలు సమీకరణాల నేపథ్యంలో ఆయన భాజపా అగ్ర నాయకత్వంతో చాలా సన్నిహితంగా ఉంటారనే పేరుంది. అయితే... తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబునాయుడు... కొంతకాలంగా భాజపాపై కత్తులు నూరుతున్నారు. మోడీని విలన్ గా చిత్రీకరిస్తూ చెలరేగిపోతున్నారు. మోడీ విలనీ- ఈ ఎన్నికల్లో తనను గట్టెక్కిస్తుందని కూడా ఆయన ఉబలాటపడుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో రామోజీ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ఎటూ ఎన్నికల్లో మోడీ వ్యతిరేకతతో ప్రజల్ని బురిడీ కొట్టించే పర్వం ముగిసింది గనుక... ఇకనైనా భాజపా అనుకూలతను అందిపుచ్చుకోవాల్సిందిగా రామోజీ ద్వారా చంద్రబాబుకు సందేశం అందినట్లు సమాచారం. ఈ ఎజెండాతో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలకు ముక్తాయింపుగా బుధవారం వారి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీ రాజకీయాలకు సంబంధించి... జగన్ ఎటూ తమకు అనుకూలంగా ఉండగా, అటు చంద్రబాబు అనుకూలతను కూడా సంపాదించుకుంటే కేంద్రంలో తిరిగి సర్కారు ఏర్పడడానికి ఆటంకం ఉండదని భాజపా భావిస్తున్నట్లు సమాచారం.

అయితే చంద్రబాబు ఇన్నాళ్లు తిట్టిన మోడీ పట్ల మళ్లీ భజన ఎలా చేయగలరు? ఎన్డీయే ప్రభుత్వం రాగల పరిస్థితి వస్తే.. మోడీ-యేతర సర్కారు ఏర్పడేట్లయితే చంద్రబాబు మద్దతు ఇవ్వవచ్చు. తదనుగుణంగా ఆయన మంగళవారం నాడే కొన్ని సంకేతాలు ఇచ్చారు. అలా కాని పక్షంలో సంక్లిష్ట పరిస్థితి ఏర్పడితే గనుక.. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె ఎక్కడానికి చంద్రబాబు చురుగ్గా వ్యవహరించకుండా ఉండేలా కోరడానికే రామోజీ ద్వారా ఈ సమావేశం ఏర్పాటైందని తెలుస్తోంది. అందుకు తగిన ప్రతిఫలం చంద్రబాబుకు ఉంటుందని దానికి సంబంధించిన డీల్ మొత్తం రామోజీ ద్వారా భాజపా తెలియజేయదలచుకున్నదని గుసగుసలు వినిపిస్తున్నాయి

Posted
 

ఆర్ ఎఫ్ సి..లో ఏం జరిగింది?

May 15 , 2019 | UPDATED 18:56 IST
ఆర్ ఎఫ్ సి..లో ఏం జరిగింది?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆపద్భాంధవ ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన హెలికాప్టర్ లో రామోజీ ఫిల్మ్ సిటీకి ఏల రావలె? మీడియా టైకూన్ రామోజీరావును ఏల కలవవలె? ఇద్దరి మధ్య అర్జెంట్ గా లంచ్ మీటింగ్ సారాంశమేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం అంత సులువుకాదు. ఎందుకంటే ఆర్ ఎఫ్ సిలోకి మీడియాకు అనుమతి వుండదు. పైగా బాబుగారు ఒక్కరే వచ్చారు. భోజనం చేసారు. ఓ గంట ముచ్చటించుకున్నారు, వెళ్లిపోయారు. ఇదీ వినిపిస్తున్న సంగతి.

మరి ఈ గంట ముచ్చటేమిటి? ఇప్పుడు భోజనం మీటింగ్ అకేషన్ ఏమిటి? అసలు మీటింగ్ ఫోటోలు కానీ వార్తలు కానీ ఈనాడు వెబ్ సైట్ లో ఎందుకు లేవు? ఎంత ప్రయివేట్ మీట్ అయినా వుండాలి కదా? రామోజీ మనవరాలి పెళ్లి ప్రయివేటు వేడుకే. కానీ వెబ్ సైట్ లో ప్రింట్ లో బోలెడు ఫొటోలు వచ్చాయి కదా?

ఇప్పటివరకు ఇదెందుకు రాలేదు? అంత రహస్యమేమిటి? ఎన్నికలు అయిపోయాయి. కౌంటింగ్ ఎనిమిది రోజుల దూరంలో వుంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది? ఏమిటీ వ్యూహరచన? ఇలా చాలా ప్రశ్నలే. సమాధానాలు మాత్రం తెలియవు. ఒక్కటే తెలిసిన విషయం. రామోజీ పిలిచారో? బాబు వస్తా అన్నారో? మొత్తానికి ఓ లంచ్ మీటింగ్ జరిగింది. అంతే.

Posted

ఎటూ ఎన్నికల్లో మోడీ వ్యతిరేకతతో ప్రజల్ని బురిడీ కొట్టించే పర్వం ముగిసింది గనుక... ఇకనైనా భాజపా అనుకూలతనుఅందిపుచ్చుకోవాల్సిందిగా రామోజీ ద్వారాచంద్రబాబుకు సందేశం అందినట్లు సమాచారం

 

Posted

అయితే చంద్రబాబు ఇన్నాళ్లు తిట్టిన మోడీ పట్ల మళ్లీ భజన ఎలా చేయగలరు? ఎన్డీయే ప్రభుత్వం రాగల పరిస్థితి వస్తే.. మోడీ-యేతర సర్కారు ఏర్పడేట్లయితే చంద్రబాబు మద్దతు ఇవ్వవచ్చు.

Posted
16 hours ago, solman said:

ee sakshit vadiki anni news telustayi kani ... bathroom lo babai ni evaru champaroo telyadu enduku antaru @3$%

enduku teliyadhu kani , enduku natakalu adutharu....eppudu sendri tho tiragani mee adi ippudu athukoni tiruguthunadu , enduku okasari poi kanuko po @3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...