Paidithalli Posted May 19, 2019 Report Posted May 19, 2019 మీదే పెద్దన్న పాత్ర చంద్రబాబుకు మాయావతి సూచన దిల్లీ, లఖ్‌నవూల్లో కీలక భేటీలు రాహుల్‌గాంధీ, మాయావతి, అఖిలేష్‌లతో వేర్వేరు సమావేశాలు శరద్ పవార్, శరద్ యాదవ్, సురవరంలతోనూ సమాలోచనలు ఈనాడు - దిల్లీ మీరు నాకు పెద్దన్నయ్యలాంటివారు. ఎప్పుడూ గౌరవిస్తూ వస్తున్నారు. అందువల్ల మీ మాటను నేను గౌరవిస్తాను. మోదీకి వ్యతిరేకంగా దేశంలోని మిగతా పక్షాలను కలిపే బాధ్యతను మీరే తీసుకోవాలి. పెద్దన్న పాత్ర పోషించాలి. - మాయావతి మోదీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఎన్డీయేతర పక్షాలను ఏకతాటిపైకి తేవడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు సానుకూల దిశలో సాగుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత అందరూ ఒక్కతాటిపై నడవాలన్న ఆయన ప్రతిపాదనను రాహుల్‌గాంధీ, మాయావతి, అఖిలేష్‌యాదవ్, శరద్‌పవార్‌లు అంగీకరించినట్లు తెలిసింది. రాహుల్‌గాంధీ ‘ఉయ్ ఆర్ వన్’ అని చెప్పగా, మాయావతి మీరు పెద్దన్నయ్య పాత్ర పోషించి అందర్నీ కలిపే బాధ్యతను భుజానకెత్తుకోవాలని సూచించినట్లు సమాచారం. శుక్రవారం దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం తీరిక లేకుండా చర్చల్లో మునిగారు. ఉదయం దిల్లీలో రాహుల్‌గాంధీతో, సాయంత్రం ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌లతో కీలక సమాలోచనలు చేశారు. అంతకు ముందు దిల్లీలో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఎంపీ డి.రాజా, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్, ఎల్‌జేడీ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ నెల 23వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే నాటికి ఎన్డీయేతర కూటమి, దాని నాయకత్వానికి ఒక స్పష్టమైన రూపు తీసుకురావాలన్న కృతనిశ్చయంతో ఉన్న చంద్రబాబునాయుడు దానిపై అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కూటమిలో కీలక భూమిక నిర్వహించబోయేందుకు అవకాశం ఉన్న పార్టీ అధినేతల అభిప్రాయాల ఆధారంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలన్న భావనతో ఆయన కార్యాచరణ మొదలుపెట్టారు. ఉదయం రాహుల్‌గాంధీతో సమావేశమైనప్పుడు ఆయన ‘ఉయ్ ఆర్ వన్ (మనం అంతా ఒక్కటే)’ అన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దాన్నిబట్టి చంద్రబాబు జరిపే సమావేశాలు, వాటి ఆధారంగా తీసుకొనే నిర్ణయాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందనే భావనను రాహుల్ వ్యక్తం చేసినట్టయ్యిందన్న అభిప్రాయం తెదేపాలో వ్యక్తమవుతోంది. మధ్యాహ్నం 2.30 గంటలకు లఖ్‌నవూ బయలుదేరి వెళ్లి తొలుత ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, తర్వాత బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిని కలిశారు. 23వ తేదీ ఫలితాల తర్వాత వారు ఏం చేయాలనుకుంటున్నారు? జాతీయ రాజకీయాల్లో ఏ పాత్ర పోషించాలనుకుంటున్నారు? అన్న అభిప్రాయాలను చంద్రబాబువారి నుంచి రాబట్టే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ప్రస్తుత పరిణామాలను బట్టిచూస్తే అఖిలేష్‌యాదవ్ యూపీ రాజకీయాలపైనే ప్రధానంగా దృష్టిసారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మాయావతి మాత్రం జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడానికి సిద్ధమయ్యారు. అందువల్ల ఆమె మనోభావాలను కూలంకషంగా తెలుసుకొని వాటిని రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌లాంటి వారితో పంచుకుని తదనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెదేపా వర్గాలు పేర్కొన్నాయి. దీనితో చంద్రబాబు శనివారం రాత్రికి విజయవాడ వెళ్లాల్సి ఉన్నా దాన్ని మానుకొని తిరిగి దిల్లీకి చేరుకున్నారు. ఆదివారం ఆయన మరోసారి రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌లతో సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అఖిలేష్, మాయావతిలతో జరిపిన చర్చల సారాంశాన్ని వారికి చెప్పి స్పష్టమైన వైఖరికి వచ్చిన తర్వాత మిగతా అన్ని మిత్రపక్షాలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయొచ్చని తెదేపా వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలతో ముందుకు.. ఆదివారం సాయంత్రం వెలువడే ఎగ్జిట్‌పోల్స్ అంచనాలతో భవిష్యత్తు ఫలితాలపై ఒక స్పష్టమైన సరళి వెలువడే అవకాశం ఉన్నందున దాని ఆధారంగా కూటమికి ఎవరు నేతృత్వం వహించాలి, ఎవరి మద్దతు తీసుకోవాలి అన్న దానిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. కాంగ్రెస్‌కు 2004లో మాదిరి 145 సీట్ల దాకా వస్తే దాని నేతృత్వంలో కూటమి ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. మిగతా ఏ ప్రాంతీయపార్టీకీ అన్ని సీట్లు వచ్చే అవకాశం లేనందున తప్పనిసరిగా కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి వస్తుందని, దానివల్ల మిత్రపక్షాలు త్వరగా కాంగ్రెస్‌తో కలిసి నడవానికి మానసికంగా సిద్ధమవుతాయని పేర్కొంటున్నారు. అలాకాకుండా కాంగ్రెస్ 100 సీట్ల దగ్గర ఆగిపోయి, యూపీలో ఎస్పీ, బీఎస్పీలకు 50కిపైగా సీట్లు వస్తే కర్ణాటక తరహా పరిస్థితులు వస్తాయని, అప్పుడు కాంగ్రెస్ పెద్దపార్టీగా ఉన్నప్పటికీ భాజపాను దూరంగా పెట్టడానికి విధిలేని పరిస్థితుల్లో ప్రాంతీయపార్టీలకు మద్దతిచ్చి అండగా నిలబడాల్సి వస్తుందని చెబుతున్నారు. అందువల్ల ఇందులో ఏ పరిస్థితి ఎదురైనా పక్కకు మళ్లకుండా అందరూ కలిసికట్టుగా నడిచేలా ప్రతిపక్షాలను మానసికంగా సిద్ధం చేసే పనిని చంద్రబాబు చేస్తున్నట్లు తెదేపా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఫలితాల తర్వాత సంఖ్యాబలాన్ని బట్టి ఎవరు ఏపాత్రనైనా పోషించవచ్చని, అయితే పాత్రలు మారాయన్న కారణంతో కూటమి నుంచి దూరం కాకుండా కలిసికట్టుగా ఉండటానికే సిద్ధమైతే బాగుంటుందన్న భావనను చంద్రబాబు ఇప్పుడు అఖిలేష్, మాయావతి ముందు వ్యక్తంచేసినట్లు సమాచారం. అందుకు వారిద్దరూ సుముఖత వ్యక్తంచేసినట్లు తెలిసింది. మాయావతి ఏది చెబితే తాను దాంతో ఏకీభవిస్తానని అఖిలేష్‌యాదవ్ చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు సమాచారం. సుమారు గంటసేపు అఖిలేష్‌తో మాట్లాడినప్పుడు ఆయన మిత్రధర్మానికి కట్టుబడి మాయావతి మాటకు తాను గౌరవం ఇస్తానని, ప్రస్తుతం ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా ఏకీభవిస్తానని, అందులో రెండో మాటకు తావులేదని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత చంద్రబాబు మాయావతి నివాసానికి వెళ్లి సుమారు గంటన్నరపాటు సమావేశం అయి దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, ఏయే పార్టీలకు ఎంతమేరకు అవకాశం ఉందన్న విషయాన్ని వివరించి 23 తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ భాజపాకు మెజార్టీ రాదు కాబట్టి మోదీ అధికారం చేపట్టకుండా ఎన్డీయేతర కూటమి పక్షాలకు మద్దతివ్వాలని ఆమెను కోరినట్లు తెలిసింది. అందుకు ఆమెకూడా సుముఖత వ్యక్తంచేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో నాయకత్వాల గురించి కాకుండా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎన్డీయేతరపక్షాలన్నీ ఒక్కతాటిపై నడవాలన్నదానిపైనే వీరి మధ్య ప్రధాన చర్చ జరిగిందని, అందుకు అందరూ ఏకాభిప్రాయం వ్యక్తంచేసినట్లు తెలిసింది. Quote
snoww Posted May 19, 2019 Report Posted May 19, 2019 యునైటెడ్ యత్నం 19-05-2019 03:17:33 తలో దిక్కంటే అంతే సంగతులు మైనారిటీలో ఉన్నా మోదీ ఆగరు మళ్లీ ఆయనే పీఠమెక్కుతారు విపక్షాలకు చంద్రబాబు హెచ్చరిక రాహుల్, పవార్, అఖిలేశ్, మాయా, సురవరంతో భేటీ సమయం లేదు... ఏకమవ్వాల్సిందే ఫలితాలు రాగానే రాష్ట్రపతి వద్దకు బాబుసూచనకు విపక్ష నేతలు ఓకే రెండోరోజూ ఢిల్లీలో రాయబారం 23న మోదీ వ్యతిరేక పక్షాల భేటీ న్యూఢిల్లీ, మే 18 (ఆంధ్రజ్యోతి): ‘‘సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈరోజు (ఆదివారం) ముగుస్తోంది. రెండోసారి అధికారం దిశగా నరేంద్ర మోదీ రంగం సిద్ధం చేసుకున్నారు. ఎన్‌డీయేకు మెజారిటీ రాకున్నా మైనారిటీలో ఉన్నా ఆయన ఆగరు. ప్రభుత్వ ఏర్పాటుకు కుయుక్తులు పన్నుతారు. మనం ఆపాలి. మన శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించి నిరోధించాలి. దీనికి ఒకే ఒక మార్గం మనం యునైటెడ్‌గా (సమైక్యంగా) కనిపించడం! మనం ఒక్క మాట మీద ఉన్నామని గ్రహిస్తే ఆయన పాచికలేవీ పారవు. ఇందుకు కలిసి రండి... ఆలస్యం వద్దు. ఏమాత్రం జాగు చేసినా మోదీ వచ్చేస్తారు...’’ ఇదీ స్థూలంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అఽధినేత చంద్రబాబునాయుడు జాతీయ విపక్ష నేతలకు చెప్పిన మాట. ఆయన మాటను విన్న ఆ నేతలంతా దానితో ఏకీభవించారు. ఒక మాటపై ఉండేందుకు అంగీకరించినట్లు సమాచారం. జాతీయస్థాయిలో ఎన్డీయేకు బలమైన ప్రత్యామ్నాయ ఏర్పాటు దిశగా ఏర్పాట్లు శనివారంనాడు ఊపందుకున్నాయి. వీటికి చంద్రబాబే సంధానకర్త. ఢిల్లీలో ఆయన విపక్ష నేతలందరినీ కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పరిశీలన ప్రకారం ప్రస్తుతం విపక్ష శిబిరం నాలుగు రకాలుగా చీలి ఉంది. (1)యూపీఏ (2)యూపీఏకు అనుకూలంగా ఉన్న టీడీపీ తదితర పార్టీలు. (3)తృణమూల్, బీజేడీ, టీఆర్‌ఎస్, వైసీపీలాంటి పార్టీల తటస్థ, ఫెడరల్-ఫ్రంట్ అనుకూల కూటమి (4)ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహాకూటమి(ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ). ఈ పార్టీలన్నింటినీ ఒకచోట చేర్చే పనిని చంద్రబాబు భుజానికెత్తుకున్నారు. ఆయా నాయకులందరి దగ్గరికీ తానే స్వయంగా వెళ్లి- ‘ఏకం కాకపోతే ముప్పే’ అనే హెచ్చరికలు చేసి, వారిని ఒప్పించి వస్తున్నారు. శనివారంనాడు ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, ఎన్‌సీపీ నేత శరద్ పవార్, లోక్ తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్, సీపీఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, డి.రాజాలతో సమాలోచనలు జరిపారు. మధ్యాహ్నం లఖ్‌నవూలో సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిలతో చర్చలు జరిపారు. అనంతరం ఢిల్లీ తిరిగి వచ్చారు. ఒకట్రెండు రోజులు ఆయన ఢిల్లీలోనే ఉండి మిగిలిన ఎన్డీఏతర పక్షాలనేతలతో కూడా చర్చలు జరపాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నెల 23న ఎన్డీఏ పక్షాల నేతలందరూ ఢిల్లీలో ఉండి వేగంగా స్పందించి భవిష్యత్ కార్యాచరణకు పూనుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఇప్పటికే సీతారాం ఏచూరి, అరవింద్ కేజ్రీవాల్ మొదలైన నాయకులను కలిశారు. ఉమ్మడి కార్యాచరణకు సై రాహుల్ తో జరిగిన సమావేశం వివరాలను ఆయన ఎన్‌సీపీ నేత శరద్ పవార్, శరద్ యాదవ్, అఖిలేష్, మాయావతిలతో వివరంగా చర్చించినట్లు తెలిసింది. వారు కూడా విపక్షాలను ఐక్యంగా ఉండాలన్న విషయంలో చంద్రబాబు సూచనలను పూర్తిగా అంగీకరించారని, కలిసికట్టుగా కార్యాచరణకు సమ్మతించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. యుపీయేతర తటస్థ పార్టీల్లో అత్యంత ముఖ్యమైన సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల అధినేతలు చంద్రబాబు ప్రతిపాదనకు సానుకూలంగా ప్రతిస్పందించడం ఒక కీలక ముందడుగని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఫలితాలు ప్రకటించిన వెంటనే విపక్షాలు ఏ విధంగా స్పందించాలి, ప్రభుత్వం ఏర్పాటుకు ఏ విధంగా కార్యాచరణ పథకాన్ని రూపొందించుకోవాలన్న విషయంపైనే చంద్రబాబు దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాలు తెలిపాయి. మనందరం ఒకటేనన్న సంకేతం వెళితే, ఐక్యంగా ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమేనని ఆయన అందరికీ నచ్చచెప్పారు. మోదీని ప్రజలు ఏ విధంగానైనా తిరస్కరిస్తారని, అదే సమయంలో కలిసికట్టుగా ముందుకు రాకపోతే బీజేపీయేతర పక్షాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని దాదాపు విపక్షాలన్నీ అభిప్రాయపడుతున్నాయి. చంద్రబాబు సాగిస్తున్న రాయబారాన్ని శరద్‌యాదవ్ ధ్రువీకరించారు. చంద్రబాబు చెప్పిన విషయాల్ని తాము అంగీకరించినట్లు సిపిఐ నేత డి. రాజా చెప్పారు. మొదట సమైక్యత.. తరువాతే ప్రధాని పదవి! రాహుల్ గాంధీతో దాదాపు గంటన్నరసేపు జరిగిన సమాలోచనల్లో ఎన్డీఏతర విపక్షాలను ఏకం చేయాల్సిన అవసరంపై ఇద్దరూ ఒకే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. నాయకత్వం ఎవరన్నది తర్వాత నిర్ణయించవచ్చనీ, ముందుగా ఎన్డీఏతర ప్రతిపక్షాలు ఏకం కావడం తక్షణ అవసరమని ఇద్దరూ అభిప్రాయపడ్డట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఫలితాలు వచ్చినవెంటనే రాష్ట్రపతి కోవింద్ ను కలిసి, ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్ధం కావాలని, అందుకోసం ఇపుడే అన్ని పార్టీలతో చర్చించాలని చంద్రబాబు చేసిన సూచనను రాహుల్ అంగీకరించినట్లు తెలుస్తోంది. కీలక తరుణంలో చంద్రబాబు చొరవ తీసుకోవడం అభినందనీయమని రాహుల్ ప్రశంసించినట్లు సమాచారం. మోదీకి మెజారిటీ రాని పక్షంలో ఎంపీలను ప్రలోభపెట్టేందుకు ఏ ప్రయత్నమైనా చేస్తారని, దాన్ని అడ్డుకోవాలంటే ముందుగా అన్ని పక్షాలూ ఏకంగా ఉండడం అవసరమని వారిరువురూ అంగీకరించారు. Quote
Hydrockers Posted May 19, 2019 Report Posted May 19, 2019 lol pattumani 10 seats rani vadini dekutara after results? Quote
Vaampire Posted May 19, 2019 Report Posted May 19, 2019 lol. nijamga chekka cheebnn di pedhanna pathra ayyi untey mayavati, akilesh etc folks ap vachi babu ni kalisevaru. not the other way, pedha anna pathra aney title kantey pedha broker pathra ani title pedithey perfect ga suit ayyedhi. actually mayawati meaning kooda adhey emo. Quote
snoww Posted May 19, 2019 Report Posted May 19, 2019 44 minutes ago, Hydrockers said: lol pattumani 10 seats rani vadini dekutara after results? Already oka saari convener gaa NTR ki pattina gathe repeat avuthadi Sendraal saar ki malli 20 seats raaledu antey. Sendraal saar ni pakkana petti Jagan + KCR ni theesukuntaaru alliance loki. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.