Jump to content

Recommended Posts

Posted
అక్రమ లేఅవుట్లపై ఎన్‌ఫోర్స్‌ అస్త్రం
19-05-2019 06:50:58
 
636938454562312475.jpg
  • రంగంలోకి హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 
  •  స్థానిక సంస్థలు, పోలీసులతో కూల్చివేతలు
  • నోటీసులందుకున్న ప్రతీ లేఅవుట్‌ కూల్చివేతే..
అనధికార, అనుమతుల్లేని లేఅవుట్లపై హెచ్‌ఎండీఏ కన్నెర్రజేసింది. రంగంలోకి హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను దింపింది. స్థానిక సంస్థల సిబ్బంది, పోలీసులతో కలిసి ప్లానింగ్‌ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో అనుమతులేని లేఅవుట్లపై కొరడా ఝుళిపిస్తున్నారు. మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ ఆదేశాల మేరకు అనుమతుల్లేని, అనధికార లేఅవుట్లను గుర్తించి నోటీసులిచ్చిన ప్లానింగ్‌ విభాగం అధికారులు, చర్యలకు ఉపక్రమించారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ ఒత్తిడి ఎదురవుతున్నా అధికారులు పట్టువీడడం లేదు.
 
హైదరాబాద్‌ సిటీ, మే18 (ఆంధ్రజ్యోతి): హెచ్‌ఎండీఏ పరిధిలోని శంషాబాద్‌, శంకర్‌పల్లి, ఘట్కేసర్‌, మేడ్చల్‌ నాలుగు జోన్లలో భారీగా అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. అనధికారికంగా, అనుమతుల్లేకుండా లేఅవుట్లను ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినా పుట్టగొడుగులా వెలుస్తున్నాయి. అక్రమ లేఅవుట్లను అరికట్టేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు ఎకరం నుంచి ఆపై ఎన్ని ఎకరాల స్థలాలకైనా అనుమతులిస్తామని చెప్పినా ఏదో ఒక ప్రాంతంలో అక్రమార్కులు అడ్డగోలుగా ఏర్పాటు చేస్తున్నారు. హెచ్‌ఎండీ ప్లానింగ్‌ విభాగంలోని ఏపీఓలు, జేపీఓలు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి అక్రమ లేఅవుట్ల యజమానులకు, డెవలపర్లకు నోటీసులు అందజేశారు. సుమారు 11 రోజుల వ్యవధిలో హెచ్‌ఎండీఏ అధికారులు వివిధ మండలాల వారీగా 713 అనుమతుల్లేని, అనధికార లేఅవుట్లను గుర్తించారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో అక్రమ లేఅవుట్లు ఉండగా, శంకర్‌పల్లిలో 189, శంషాబాద్‌లో 129, మేడ్చల్‌ 150, ఘట్కేసర్‌లో 245 ఉన్నాయి. వీటిపై హెచ్‌ఎండీఏ అధికారులు యాక్షన్‌ప్లాన్‌ చేపట్టారు.
 
 
ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖలు
అనుమతుల్లేని, అనధికార లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ర్టేషన్‌ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే హెచ్‌ఎండీఏ కమిషనర్‌ రిజిస్ర్టేషన్‌ శాఖ అధికారులకు లేఖలు రాసిన్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉండగా, తెలంగాణలోనూ అక్రమలేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ర్టేషన్‌ చేయకూడదని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయంపై గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే అనుమతుల్లేని, అనధికార లేఅవుట్లు పూర్తిస్థాయిలో కట్టడి చేయడానికి అవకాశాలున్నాయి. విధానపరమైన నిర్ణయం కావడంతో మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
 
నోటీసు ఇచ్చిన పత్రి అక్రమ
లేఅవుట్‌నూ తొలగించేలా..
అనధికార, అనుమతుల్లేని లేఅవుట్లకు ఇప్పటికే నోటీసులు అందజేసిన హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. నోటీసులు అందజేసిన ప్రతీ అక్రమ లేఅవుట్‌నూ తొలగించడమే లక్ష్యంగా పంచాయతీలు, మున్సిపాలిటీల సిబ్బంది, పోలీసుల సహకారంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను రంగంలోకి దింపింది. శంకర్‌పల్లి, శంషాబాద్‌, మేడ్చల్‌, ఘట్కేసర్‌ జోన్ల పరిధిలో అక్రమ లేఅవుట్లను ప్లానింగ్‌ అధికారులు తొలగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లను అడ్డుకోవడానికి యజమానులు అడ్డొస్తే.. అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తున్న అంశంపై అరెస్టు చేసి, కేసులు పెడుతామనడంతో వెనక్కి తగ్గుతున్నట్లు తెలిసింది. కొంతమంది ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలతో ఫోన్‌లు చేసి ప్లానింగ్‌ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి. కానీ ప్లానింగ్‌ అధికారులు ఎలాంటి ఒత్తిడికీ లొంగకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అనుమతుల్లేని లేఅవుట్లపై చర్యలు తీసుకునే పనులు శుక్రవారం ప్రారంభమవ్వగా, పది రోజుల్లోపు అన్నింటినీ తొలగించడమే లక్ష్యంగా అధికారులు కదులుతున్నారు. ప్రస్తుతం నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో గుర్తించి నోటీసులిచ్చిన 713 అక్రమ లేఅవుట్లతో పాటు జనవరిలో నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో గుర్తించిన 196 అక్రమ లేఅవుట్లపై కూడా చర్యలు చేపట్టనున్నారు. అక్రమ లేఅవుట్లను పూర్తిస్థాయిలో కట్టడి చేసిన తర్వాత హెచ్‌ఎండీఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
Posted

Bongula undi. Kulchadam endi ra babu. Entha loss andariki. Demolishing kante they should fine the company heavily. Public and govt ki mutual benefit.

Posted

This is a tactic to exhort more money out

who pays more gets to stay

 

enni chudale 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...