Hydrockers Posted May 19, 2019 Report Posted May 19, 2019 లక్నో: తమను ఓటు వేయకుండా బీజేపీ అడ్డుకుందని ఉత్తరప్రదేశ్ చాందౌలీ లోక్‌సభ నియోజకవర్గంలోని తారాజీవన్‌పూర్ గ్రామస్తులు ఆరోపించారు. శనివారం రాత్రి బీజేపీ కార్యకర్తలు తమ గ్రామానికి వచ్చి 500 రూపాయల చొప్పున పంపిణీ చేశారని, బలవంతంగా తమ చేతివేళ్లపై ఇంక్ చుక్క పెట్టారని తెలిపారు. ఓటు వేయడానికి వెళ్లొద్దని తమను ఒత్తిడి చేశారని తెలిపారు. దళితులు, వెనుకబడిన తరగతులకు చెందిన వారిని ఓటు వేయకుండా చేయడానికి బీజేపీ రూ. 500 చొప్పున పంపిందని సమాజ్‌వాదీ పార్టీ పేర్కొన్న నేపథ్యంలో తారాజీవన్‌పూర్ గ్రామస్తులు ఈ ఆరోపణలు చేశారు. ఓటర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ అభ్యర్థి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండేపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై తారాజీవన్‌పూర్ వాసులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, దర్యాప్తు జరిపిన తర్వాత చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసు అధికారి కుమార్ హర్ష్ తెలిపారు. చాలా గ్రామాలకు బీజేపీ కార్యకర్తలను పంపి దళితులు ఓటు వేయకుండా మహేంద్రనాథ్ పాండే కుట్రలు చేశారని సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సంజయ్ చౌహాన్ ఆరోపించారు. గ్రామస్తుల చేతి వేళ్లపై బీజేపీ కార్యకర్తలు బలవంతంగా ఇంక్ చుక్కలు పెట్టారని తెలిపారు. బీజేపీ దురాగతాలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆయన డిమాండ్ చేశారు. Quote
Hydrockers Posted May 19, 2019 Author Report Posted May 19, 2019 Sh!t ee idea babub gariki raledu uff Quote
Hydrockers Posted May 20, 2019 Author Report Posted May 20, 2019 baboru next elections lo idi try cheyandi Quote
boeing747 Posted May 20, 2019 Report Posted May 20, 2019 On 5/19/2019 at 3:20 AM, Hydrockers said: Sh!t ee idea babub gariki raledu uff Anduke bob kuda A2 lantollani ettukunte ilanti ideas ichevaru ani @ARYAantunnadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.