Jump to content

Recommended Posts

Posted
ప్రధాని రేసులో మాయ, దీదీ
21-05-2019 01:31:17
 
636939990783235493.jpg
  • ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మని విపక్షాలు
  • మద్దతిచ్చేందుకు కాంగ్రెస్‌ సుముఖం
  • మాయావతితో అఖిలేశ్‌ భేటీ
  • సోనియాతో బెహన్జీ భేటీ రద్దు
  • ఫలితాల తర్వాతే చర్చలని సందేశం
  • మమతది కూడా దోబూచులాటే
  • కాంగ్రెస్‌ పార్టీలో కంగారు మొదలు
  • మమత దగ్గరకు బాబు రాయబారం
  • ఎన్‌డీఏకు 200 దాటవని అంచనా
  • బెదిరించి ఎగ్జిట్‌ పోల్స్‌ను మార్చారు
  • విపక్షాలు కలవకుండా మోదీ ప్లాన్‌
  • పార్టీ నేతలతో రాహుల్‌ వ్యాఖ్యలు
  • నేడు వీవీప్యాట్‌లపై మిత్రుల ధర్నా
బీజేపీ తిరుగులేని మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని పలు ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చిచెప్పినా విపక్షాల విశ్వాసం సడలిపోలేదు. ఇదంతా ఫలితాలకు ముందే విపక్షాలు ఏకం కాకుండా మోదీ చేస్తున్న గిమ్మిక్కులో భాగమని కాంగ్రెస్‌ సహా పలు బీజేపీయేతర పార్టీలు అభిప్రాయపడ్డాయి. చంద్రబాబు మధ్యవర్తిత్వంలో ఐక్యతాయత్నాలను ముమ్మరం చేశాయి. బీజేపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు అవసరమైతే కూటమి నాయకత్వాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.
 
 
న్యూఢిల్లీ, మే 20 (ఆంధ్రజ్యోతి): బీజేపీయేతర పక్షాలన్నీ కలిసి ఒక నేతను ఎన్నుకునేందుకు వీలు కల్పిస్తామని కాంగ్రె్‌సలోని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మరోవైపు నాయకత్వం విషయంలో ఏకాభిప్రాయం కల్పించేందుకే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీని ఒప్పించేందుకు ఆయన కోల్‌కతా వెళ్లారు.
 
ఇప్పటికే సోనియా, రాహుల్‌, శరద్‌ పవార్‌, సీతారాం ఏచూరి, అరవింద్‌ కేజ్రీవాల్‌, అఖిలేశ్‌, మాయావతితో మాట్లాడిన చంద్రబాబు సోమవారం మమతతో కీలక చర్చలు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి, అఖిలేశ్‌తో జరిపిన చర్చల సారాంశాన్ని ఆమెకు తెలియజేశారు. రాత్రికి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం చంద్రబాబు రాహుల్‌గాంధీతో సమావేశమవుతారు. ఆ తర్వాత బీజేపీయేతర పక్షాల ముఖ్య నాయకులు భేటీ కానున్నారు.
 
ఎన్డీయేకు మెజారిటీ కాకపోతే ఎన్డీయేతర పార్టీలన్నీ కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కోరే అంశం మీద చర్చిస్తారు. అహ్మద్‌ పటేల్‌, గులాంనబీ ఆజాద్‌(కాంగ్రెస్‌), శరద్‌ పవార్‌(ఎన్‌సీపీ), చంద్రబాబు, సతీశ్‌ చంద్ర(బీఎస్పీ), సీతారాం ఏచూరి(సీపీఎం), రాజా(సీపీఐ), డెరెక్‌ ఓ బ్రెయిన్‌(తృణమూల్‌) ఈ సమావేశానికి రానున్నారు. వీరంతా బుధవారం ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్‌ల లెక్కింపులో తేడా వస్తే నియోజకవర్గంలోని మొత్తం వీవీ ప్యాట్‌లను లెక్కించాలన్నది వీరి డిమాండ్‌.
 
ముందు ఈవీఎంలను కాకుండా వీవీ ప్యాట్‌లను లెక్కించాలన్నది మరో డిమాండ్‌. ఎన్డీయేతర పక్షాల మధ్య సయోధ్య కుదిరితే కూటమి నాయకత్వ అంశం కూడా లోక్‌సభ ఫలితాలకు ముందే కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. నాయకత్వం విషయం తేలకుండా ఐక్యతా చర్చలు ఏంటని మాయావతి, అఖిలేశ్‌ అభిప్రాయ పడుతుండగా.. ఫలితాలు వచ్చిన తర్వాత నాయకత్వం గురించి మాట్లాడుకోవచ్చని రాహుల్‌ భావిస్తున్నారు.
 
ఒక్కసారి మోదీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం వస్తే ఆయన ఎలాగైనా తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటారని, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారే అవకాశం ఉందన్న చర్చ జరగడంతో కాంగ్రెస్‌ అప్రమత్తమైంది. ‘మోదీ.. వాజ్‌పేయి లాంటి నాయకుడు కాదు, ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని పడగొట్టించుకోవడానికి. ఆయన మరోసారి ప్రధాని అయితే ఇక గద్దె దించడం అసాధ్యం’ అని కాంగ్రెస్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
 
అందుకే, నాయకత్వంపై నేతల మధ్య స్థూలంగా ఒక అవగాహన కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ‘మీరు కేసీఆర్‌, జగన్‌తో మాట్లాడినా నాకు అభ్యంతరం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి’ అని చంద్రబాబు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. జగన్‌, కేసీఆర్‌తో కూడా తమ నేతలు కొందరు టచ్‌లో ఉన్నట్లు తెలిపారు. నాయకత్వం విషయంలో రాహుల్‌ అంత పట్టుదలగా లేరని, మాయావతి అయినా, మమతా బెనర్జీ అయినా ఆయనకు అభ్యంతరం ఉండదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.
 
మమత, మాయావతి, అఖిలేశ్‌ల మధ్య అంగీకారం ఏర్పడితే యూపీఏకు 70 మంది ఎంపీల మద్దతు లభించినట్లవుతుందని, అప్పుడు ఇతర బీజేపీయేతర పార్టీలు కూడా ముందుకు రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో బీజేపీయేతర పక్షాలన్నీ ఏకం కాకుండా నిరాశానిస్పృహల్లో కూరుకుపోయేలా చేసేందుకు, ఎన్డీయేను ఐక్యంగా ఉంచేందుకే బీజేపీ నేతలు ఎగ్జిట్‌ పోల్స్‌ తతంగాన్ని నడిపారని రాహుల్‌గాంధీ భావిస్తున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.
 
మోదీ రాక తప్పదనే అభిప్రాయం ప్రజల్లో కల్పించి, ఈవీఎంలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకే ఈ తంతును పకడ్బందీగా నిర్వహించారని రాహుల్‌ విశ్వసిస్తున్నారని అంటున్నాయి. బీజేపీకి 200 సీట్లు దాటవనే నమ్ముతున్నామని, ఎన్డీయేకు మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు అనూహ్యంగా ఉండడంతో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
 
యూపీఏతో కలిసి నడిచే విషయమై చంద్రబాబు శనివారం మాయాతో చర్చలు జరిపారు. బాబు సూచన మేరకు సోమవారం మాయావతి ఢిల్లీలో రాహుల్‌, సోనియాతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారని వార్తలు వచ్చాయి. అయితే, ‘ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు ఆమె లఖ్‌నవూలోనే ఉంటారు’ అ ని బీఎస్పీ నేత ఒకరు స్పష్టం చేశారు.
 
మరోవైపు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిని కలిశారు. సోమవారం ఆయన మాయావతి నివాసానికి వెళ్లి గంటకు పైగా భేటీ అయ్యారు. యూపీ ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాల పైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
 
 
మమతతో చంద్రబాబు సమావేశం
టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం కోల్‌కతాలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఫలితాల వెల్లడి తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపైనే వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. భేటీకి ముందు చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చిస్తాం.
 
ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ఢిల్లీ రావాలని మమతను కూడా కోరాం’’ అని చెప్పారు. ‘‘ఈ ఎగ్జిట్‌పోల్స్‌ గురించి మాకేమీ ఆందోళన లేదు. ఎందుకంటే ఇవి చాలా సందర్భాల్లో వాస్తవానికి భిన్నంగా ఉంటాయి. మాకు మా అంతర్గత నివేదిక ఉంది. అలాగే ప్రతి జిల్లా, నియోజకవర్గం నుంచి కూడా నివేదికలు ఉన్నాయి’’ అని తృణమూల్‌ నేత ఒకరు చెప్పారు.
  • Haha 1
Posted
Quote

బెదిరించి ఎగ్జిట్‌ పోల్స్‌ను మార్చారు

@3$%

Posted

@3$% Bokka Borla padda Rahul aa, enthaina sendraal saar sendraal saar ae bhayya

tenor.gif

Posted
3 minutes ago, Idassamed said:

Andaru pradhanule.

Yes, that is the game plan to make Modi PM again 

@3$%

Posted
7 minutes ago, Idassamed said:

Andaru pradhanule.

Okkokaru okko year

Posted
4 minutes ago, Paidithalli said:

Okkokaru okko year

Enthaina Rahul ni baga bonda pettaru kada

Sendraal Saar mrodda oka dandam bhayya

Posted
28 minutes ago, Paidithalli said:

Okkokaru okko year

Endhuku seroka kursi yesthe saripotundhi ga...panta sekkalu aafukotaniki appudappudu Nakka gaadu poyi vasthuntaadu..@3$%

Posted
25 minutes ago, HugoStrange said:

redrojulu intlo sallaga kurchovachu kada sendral saab

Piles anta @3$%

Posted
28 minutes ago, bhaigan said:

Enthaina Rahul ni baga bonda pettaru kada

Sendraal Saar mrodda oka dandam bhayya

Avunu vaadoka Maha Yodhudu CITI_c$y

Vaadiki vaade bondha pettukuje rakam, vere vaadu endhuku inka.

Posted
45 minutes ago, bhaigan said:

Enthaina Rahul ni baga bonda pettaru kada

Sendraal Saar mrodda oka dandam bhayya

 

17 minutes ago, Chinna84 said:

Endhuku seroka kursi yesthe saripotundhi ga...panta sekkalu aafukotaniki appudappudu Nakka gaadu poyi vasthuntaadu..@3$%

Rahul baba Ki inka kocnhem time kavali ... ee elections lo karma kali ye mamata no ? Maya no PM ayithe Buddhi vosthadhi 

but nda ki clear majority vosthe better 

Posted
56 minutes ago, Paidithalli said:

Okkokaru okko year

CBN PM aina oka ayya Mari aa Thurak ni support chesi India ni Bangladesh chese Mamatha vadhubra ayya. Eyes close chesi open chese lopu vallu okkokkadu oka cricket team chesi 10ngutharu. India maroka France aidhi ra ayya $s@d

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...